OTT Movie : రొమాంటిక్ చిత్రాలను చూడాలనుకుంటే మొదటిగా గుర్తుకు వచ్చేది హాలీవుడ్ చిత్రాలే. హాలీవుడ్ చిత్రాలలో బో*ల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. హాలీవుడ్ మేకర్స్ ప్రేక్షకుల అభిరుచి మేరకు రొమాంటిక్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. రొమాంటిక్ చిత్రాలు ఇదివరకు చాలా వచ్చినా, ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ బో*ల్డ్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ? పేరేమిటో తెలుసుకుందాం పదండి.
నెట్ ఫ్లిక్స్
భర్త చనిపోవడం వలన కాల్ బాయ్ తో ఒక ముసలావిడ జరిపే లవ్ ట్రాక్ తో ఈ మూవీ నడుస్తుంది. ఈ సినిమా బో *ల్డ్ మూవీ అయినప్పటికీ ఫీల్ గుడ్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీ పేరు “గుడ్ లక్ టు యు లియో గ్రాండే” (Good Luck To You Grande). ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ( Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఈ మూవీలో లాన్సీ అనే 70 సంవత్సరాల ముసలావిడ ఉంటుంది. ఈమెకు రెండు సంవత్సరాల క్రితమే తన భర్త చనిపోతాడు. ఒంటరి జీవితంతో విసిగిపోయిన లాన్సీ ఒక యువకునితో రొమాన్స్ చేయాలి అనుకుంటుంది. ఈ క్రమంలో ఒక కాల్ బాయ్ తో ఆ పని చేసుకోవాలి అనుకోని కాల్ బాయ్ ని బుక్ చేసుకుంటుంది. ఆ మరుసటి రోజు లాన్సీ ఇంటికి కాల్ బాయ్ వస్తాడు. అతడు చాలా యంగ్ గా ఉండేసరికి బామ్మ గిల్టీ ఫీల్ అవుతుంది. నా వయసు వారితో ఎప్పుడైనా ఇలా చేశావా అని అతనిని అడుగుతుంది. మీ కన్నా పెద్ద వయసు ఉన్న ఒకరితో ఒకసారి ఇలా చేశాను అని చెప్తాడు. ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నావు అని ఆ బామ్మ అడగగా, చదువుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఈ డబ్బుతోనే నేను చదువుకుంటున్నాను. ఈ విషయం నా పేరెంట్స్ కి కూడా తెలియదని సమాధానం చెప్తాడు.
అతని మాటలకు బామ్మ ఇంప్రెస్ అవుతుంది. ఆరోజు రాత్రి ఇద్దరూ చాలా సంతోషంగా గడుపుతారు. ఆ బామ్మ అతనిని బాగా ఇష్టపడుతుంది. ఆ మరుసటి రోజు అతను వెళ్ళిపోతాడు. బామ్మ అతనినే తలచుకొని బాధపడుతూ వుంటుంది. కొద్దిరోజుల తర్వాత అతనిని మర్చిపోలేక మళ్ళీ ఒకసారి బుక్ చేసుకుంటుంది. అతడు ఇంటికి రాగానే బామ్మ చాలా సంతోషపడుతుంది. ఈరోజు నువ్వు ఏమేమి చేయాలో అవన్నీ ఒక పేపర్ మీద రాశాను, ఆ విధంగానే నాతో రొమాన్స్ చెయ్యాలని అతనికి చెప్తుంది బామ్మ. దానికి అతడు సరేనని చెప్పి ఆరోజు మొత్తం ఆ బామ్మ ని సంతోషపెడతాడు. ఇలా నడుస్తున్న వీరి లవ్ ట్రాక్ చివరికి ఏమవుతుంది? అతని కోసం ఆ బామ్మ ఏమిచ్చేస్తుంది. తెలుసుకోవాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న “గుడ్ లక్ టు యు లియో గ్రాండే” (Good luck to you grande) రొమాంటిక్ బో*ల్డ్ మూవీని తప్పకుండా చూడాల్సిందే.