OTT Movie : హర్రర్ చిత్రాలను చూడాలనుకునే మూవీ లవర్స్ కు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఒక వేదిక అని చెప్పవచ్చు. ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీని చూసేటప్పుడు ఆ థ్రిల్లింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గూస్ బంప్స్ తెప్పించే ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ప్రస్తుతం ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? తెలుసుకుందాం పదండి.
నెట్ ఫ్లిక్స్
ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ హర్రర్ థ్రిల్లర్ ఒక ఇండోనేషియన్ మూవీ. ఈ మూవీలో ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్లో ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత స్టోరీ ఓ లెవెల్లో ఉంటుంది. ఈ మూవీ పేరు “మున్కర్” ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
హెర్లిన్ అనే ఒక టీనేజ్ అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ లో చేర్పిస్తారు. ఆమె కొత్తగా జాయిన్ అవ్వటంతో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఒకసారి అందరూ ఖురాన్ చదువుతూ ఉండగా హెర్లిన్ నిద్రమత్తులో ఉంటుంది. మిగతా స్టూడెంట్స్ ఆమెను చూస్తూ ఖురాన్ సరిగ్గా చదవలేక పోతారు. అందుకుగాను టీచర్ మిగతా స్టూడెంట్స్ కు పనిష్మెంట్ ఇస్తుంది. ఈ క్రమంలో మిగతా స్టూడెంట్స్ ఈమెపై ద్వేషం పెంచుకుంటారు. అందులో ఒక అమ్మాయి మాత్రమే ఈమెపై ప్రేమగా ఉంటుంది. ఆమె పేరు రణం. ఒకసారి ఆ స్కూల్ కి హెర్లిన్ ని చూడటానికి ఆమె తల్లి వస్తుంది. ఈ స్కూల్ నాకు నచ్చలేదు, నేను ఇంటికి వచ్చేస్తాను అని హెర్లిన్ తన తల్లితో చెప్తుంది. అందుకు తల్లి ఆమెను సముదాయించి కొద్దిరోజుల్లో అన్నీ సర్దుకుంటాయని, బాగా చదువుకోమని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది.
ఆమెపై ద్వేషం పెంచుకున్న మిగతా స్టూడెంట్స్ ఆరోజు రాత్రి హెర్లిన్ ని బాగా టార్చర్ చేస్తారు. ఆ టార్చర్ నుంచి తప్పించుకొని పారిపోతుండగా ఆమెకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హెర్లిన్ కి పల్స్ ఆగిపోయి చనిపోతుంది. కొద్దిరోజుల తర్వాత ఆ స్కూల్ కి హెర్లీన్ వస్తుంది. ఆమెను చూసి అందరూ భయపడతారు. ఆమె ప్రవర్తన చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అప్పటినుంచి ఆ స్కూల్లో హెర్లీన్ వల్ల అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఈ మూవీలో ఆమె భయపెట్టే తీరు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇంతకీ హెర్లిన్ ని చంపింది ఎవరు? ఆమె నిజంగానే దయ్యం రూపంలో తిరిగి వచ్చిందా? అనే విషయాలను తెలుసుకోవాలని అనుకుంటే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ “మున్కర్” (Munkar) ని తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీ ని ఒంటరిగా చూడటం కష్టం అని చెప్పాలి. ఇందులో హర్రర్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మీరు కూడా ఈ మూవీ పై ఓ లుక్ వేయండి.