EPAPER

Ustaad Bhagat Singh: తేరి రీమేక్ కాదు.. ఆ పోలికలు ఉండటం వల్లే మిస్ కమ్యునికేషన్

Ustaad Bhagat Singh: తేరి రీమేక్ కాదు.. ఆ పోలికలు ఉండటం వల్లే మిస్ కమ్యునికేషన్

Ustaad Bhagat Singh: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి షాక్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హరీష్ శంకర్. అయితే సినిమా టైటిల్ లాగానే ఆ సినిమా రిసల్ట్ కూడా హరీష్ కి షాక్ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత మళ్లీ రచయితగా పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్గా పనిచేశాడు హరీష్ శంకర్. ఒక దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్లీ అసిస్టెంట్ గా చేయటం అనేది మామూలు విషయం కాదు. కానీ హరీష్ అలా కాకుండా పూరి గారి దగ్గర మళ్ళీ చేశాడు.


ఇకపోతే ఆ సినిమా తర్వాత మిరపకాయ్ అనే సినిమాను పవన్ కళ్యాణ్ తో చేయాల్సి ఉంది హరీష్. కానీ ఆ సినిమా కూడా పట్టాలెక్కలేదు అయితే మొదటిసారి అవకాశం ఇచ్చిన రవితేజ మళ్లీ రెండోసారి కూడా అవకాశాన్ని ఇచ్చాడు. అయితే మిరపకాయ్ సినిమా ఊహించిన రీతిలో అద్భుతమైన హిట్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాల్సిన హరీష్ శంకర్ దబాంగ్ అనే రీమేక్ ను గబ్బర్ సింగ్ తెరకెక్కించాడు.

గబ్బర్ సింగ్ సినిమా సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేనిది. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ గత పదేళ్లుగా తమ హీరోలకు అద్భుతమైన హిట్ లేదు అనుకుంటున్న తరుణంలో, అసలు పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటి అని చూపించి, ఆల్ టైం రికార్డ్ ను సృష్టించిన సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటారు అలా చూపించి బాక్సాఫీస్ వద్ద బీభత్సమైన సక్సెస్ అందుకున్నాడు. స్వతహాగా హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కావడంతో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు.


ఇకపోతే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత చేసిన సినిమాలన్నీ దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ గా నిలిచాయి. ఇకపోతే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్నాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి వచ్చిన అప్డేట్ లన్నిటో కంటే ఈ గ్లిమ్స్ వీడియో అందర్నీ బీభత్సంగా ఆకట్టుకుంది.

ఈ సినిమా తమిళ్లో సూపర్ హిట్ అయినా తేరి సినిమాకు రీమేక్ అని అందరూ అనుకున్నారు. ఒక సందర్భంలో మిస్ కమ్యూనికేషన్ జరిగి ఇదే కన్ఫామ్ అని ఫిక్స్ అయిపోయారు కూడా. అయితే దీని గురించి ఇప్పుడు అసలైన క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు దశరథ్. సంతోషం మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి అద్భుతమైన హిట్ సినిమాలు తీసిన దశరథ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నారు. అయితే ఈ సినిమా తేరి రీమేక్ అని అందరూ అనుకున్నారు. వాస్తవానికి మిస్ కమ్యూనికేషన్ వలన అలా జరిగింది ఇది రీమేక్ సినిమా కాదు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఏవైతే కోరుకుంటున్నారో అలాంటి అంశాలన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా మంచి హిట్ ఆపోతుందా అని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా రీమేక్ కాదు అని దశరథ్ క్లారిటీ ఇవ్వగానే చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎక్స్ట్రా గుడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు.

Related News

35 chinna katha kaadu: అరుదైన గౌరవం అందుకున్న 35 చిన్న కథ కాదు..!

Pragathi: ఆ నటుడు అసభ్యకరంగా తాకాడు.. ప్రగతి ఎమోషనల్ కామెంట్స్..!

Unstoppable With NBK : అప్పుడు పవన్ కళ్యాణ్ కి ప్లే చేసిన స్ట్రాటజీ ఇప్పుడు సిబిఎన్ కు కూడా చేస్తుంది

Fauji Movie : భారీ ధరకు ‘ ఫౌజీ ‘ డిజిటల్ రైట్స్.. ఇది ప్రభాస్ రేంజ్.. !

5 Years Of Kaithi : సరిగ్గా ఐదేళ్ల క్రితం, లోకేష్ కనకరాజ్ అంటే ఏంటో తెలిసి వచ్చింది

Kanguva: సూర్యతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తున్న మెగా హీరో

Big Stories

×