OTT Movie : ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ లో మలయాళం మూవీస్ హవా నడుస్తోంది. మలయాళం ఇండస్ట్రీ లో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో మూవీస్ ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అలాంటి మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక ఆసక్తి కరమైన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకునే మూవీ లవర్స్ కు ఈ మూవీ ఒక సజెషన్. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఇది ఒక మలయాళం మూవీ. బిజినెస్ లో పెట్టుబడి పెట్టిన తర్వాత కరోనా రావడంతో హీరో ఏమి చేశాడనే కథాంశంతో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు “ఆరక్కరియం” (Aarakkariyam). ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
రాయ్, షర్లి ఇద్దరు దంపతులు ఉంటారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. షర్లి మొదటి భర్త ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోతే, డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన షర్లికి ఈమె తండ్రి రాయ్ తో రెండవ పెళ్లి చేస్తాడు. రాయ్ కూడా మొదటి భార్యతో కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుంటాడు. ఇతనికి కూడా ఇది రెండవ పెళ్ళి. షర్లికి మొదటి భర్త వల్ల ఒక కూతురు ఉండగా, ఆమె బోర్డింగ్ స్కూల్లో చదువుతూ ఉంటుంది. రాయ్ ఒకసారి తన దగ్గర ఉన్న డబ్బును మొత్తం బిజినెస్ లో పెడతాడు. ఇతడిని ఫ్రెండు కూడా ఇతని మాటలు నమ్మి భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ సరుకును కస్టమ్స్ ఆఫీసర్స్ పట్టుకుంటారు. ఈ ప్రాసెస్ లో ఉండగా కరోనా ఎక్కువగా ఉండటంతో గవర్నమెంట్ లాక్ డౌన్ విధిస్తుంది. బిజినెస్ కోసం ఇన్వెస్ట్ చేసిన వీరిద్దరికీ టెన్షన్ పట్టుకుంటుంది. ఇతని టెన్షన్ చూసి రాయ్ మామగారు తన ఇంటిని అమ్మాలని చూస్తాడు. అందుకోసం పేపర్లో ప్రకటన ఇవ్వగా ఒక వ్యక్తి ఇంటి కొంటాను అని ఫోన్ చేసి చెప్తాడు.
అయితే ఆ ఇంటిని కూల్చి ఒక రిసార్ట్ ను కడతాను అని ఫోన్ లో చెప్తాడు. ఈ విషయాన్ని రాయ్ తో చెప్తూ అతను బిల్డింగ్ పడగొడితే ఇందులో 11 సంవత్సరాలుగా దాచిపెట్టిన రహస్యం ఒకటి బయట పడుతుందని టెన్షన్ పడతాడు. ఇంతకీ ఆ రహస్యం ఏమిటి అని అతనిని రాయ్ అడుగుతాడు. ఇందులో ఒక శవాన్ని నేను పూడ్చి పెట్టానని సమాధానం చెప్తాడు. ఈ క్రమంలో వీరికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఇంతకీ ఆ శవం ఎవరిది? రాయ్ మామగారు దాచిపెట్టిన ఆ రహస్యం ఏమిటి? వీళ్లు ఎదుర్కొన్న ఆ సంఘటనలు ఏమిటి? తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న “ఆరక్కరియం” (Aarakkariyam) సస్పెన్స్ మూవీని తప్పకుండా చూడండి. దృశ్యం మూవీని తలపించే విధంగా ఈ మూవీ కూడా ఉంటుంది. మరెందుకు ఆలస్యం ఈ మూవీపై కూడా ఓ లుక్ వేయండి.