EPAPER

5 Years Of Kaithi : సరిగ్గా ఐదేళ్ల క్రితం, లోకేష్ కనకరాజ్ అంటే ఏంటో తెలిసి వచ్చింది

5 Years Of Kaithi : సరిగ్గా ఐదేళ్ల క్రితం, లోకేష్ కనకరాజ్ అంటే ఏంటో తెలిసి వచ్చింది

5 Years Of Kaithi : తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది దర్శకులు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. కానీ కొంతమంది దర్శకులు మాత్రమే తమ ఇంపాక్ట్ ను బలంగా చూపిస్తారు. ఇలా కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా చాలామంది దర్శకులు ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ టైమ్స్ లో ఒక గొప్ప సినిమా ఏ భాషలో ఉన్నా కూడా అంత గొప్ప సినిమా తీసిన దర్శకుడు గురించి తెలుసుకొనే పర్సన్స్ కూడా ఎక్కువైపోయారు. ఆ సినిమా చూసిన వెంటనే ఆ దర్శకుడు నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేసే ఆడియన్స్ ఉన్నారని కూడా చెప్పాలి. తమిళ్లో సూపర్ హిట్ లవ్ స్టోరీ 96 సినిమా వచ్చినప్పుడు తెలుసుకున్నారు. అదే దర్శకుడు తీసిన సత్యం సుందరం సినిమా కోసం చాలామంది ఎదురుచూసి దానికి కూడా బ్రహ్మరథం పట్టారు.


ఒక షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలు పెట్టిన చాలామంది దర్శకులు నేడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తీసి నగరం సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్ కనకరాజ్. ఈ సినిమాలు సందీప్ కిషన్ రెజీనా జంటగా నటించారు. ఈ సినిమాతోనే చాలామందిని ఆశ్చర్యపరిచాడు లోకేష్. ఒక కథను ఇంత ఆసక్తికరంగా చెప్పొచ్చు అని ప్రూవ్ చేసిన సినిమా నగరం. నగరం సినిమా తర్వాత కొన్ని నీళ్లు గ్యాప్ తీసుకొని ఖైదీ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు లోకేష్. కార్తీ నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రాత్రి ప్రయాణాన్ని చాలా ఆసక్తికరంగా అద్భుతంగా తెరపైకి ఎక్కించాడు. ప్రతి సీను కూడా గూస్బమ్స్ తెప్పించేలా ఉంటుంది ఈ సినిమాలో, కార్తీ తో పాటు మిగతా క్యారెక్టర్స్ కూడా మంచి స్కోప్ ఉంటుంది.

ఖైదీ సినిమా చూపించిన ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే,యాక్షన్ సీక్వెన్సెస్, కార్తీ పర్ఫామెన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో అనిపించాయి. చాలామందికి ఒక ఫిలిం మేకర్ గా ఆశ్చర్యాన్ని కలిగించాడు లోకేష్. ఈ సినిమా తర్వాత లోకేష్ దర్శకత్వం వహించిన సినిమా మాస్టర్. మాస్టర్ సినిమా తర్వాత వచ్చిన విక్రమ్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కమల్ హాసన్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా చూడడానికంటే ముందు మరొకసారి ఖైదీ సినిమా చూసి థియేటర్ కు రండి అని లోకేష్ చెప్పినప్పుడు చాలామందికి ఆశ్చర్యం కలిగింది. ఎక్కడో హాలీవుడ్ లో ఉన్న కల్చర్ ను లోకేష్ సినీమాటిక్ యూనివర్స్ అంటూ తెలుగులోకి తీసుకొచ్చాడు. ఇక విక్రమ్ సినిమా చూసిన తర్వాత ఖైదీ సినిమా రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. నేటికీ ఖైదీ సినిమా వచ్చి ఐదేళ్లయింది. ఇక ఖైదీ టూ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ విషయం గురించి దర్శకుడు లోకేష్ కూడా ఢిల్లీ కమింగ్ సూన్ అంటూ చాలాసార్లు క్లారిటీ ఇచ్చాడు. నేటితో లోకేష్ కనకరాజ్ అంటే ఏంటి అని ప్రూవ్ అయి ఐదేళ్లు అని చెప్పొచ్చు.


Related News

35 chinna katha kaadu: అరుదైన గౌరవం అందుకున్న 35 చిన్న కథ కాదు..!

Pragathi: ఆ నటుడు అసభ్యకరంగా తాకాడు.. ప్రగతి ఎమోషనల్ కామెంట్స్..!

Ustaad Bhagat Singh: తేరి రీమేక్ కాదు.. ఆ పోలికలు ఉండటం వల్లే మిస్ కమ్యునికేషన్

Unstoppable With NBK : అప్పుడు పవన్ కళ్యాణ్ కి ప్లే చేసిన స్ట్రాటజీ ఇప్పుడు సిబిఎన్ కు కూడా చేస్తుంది

Fauji Movie : భారీ ధరకు ‘ ఫౌజీ ‘ డిజిటల్ రైట్స్.. ఇది ప్రభాస్ రేంజ్.. !

Kanguva: సూర్యతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తున్న మెగా హీరో

Big Stories

×