EPAPER

Ram Charan – NTR : ఎన్టీఆర్ పై మళ్లీ రామ్ చరణ్ దే పై చెయ్యి.. ఇంకెప్పుడు ఎన్టీఆర్ రీచ్ అవుతాడు..?

Ram Charan – NTR : ఎన్టీఆర్ పై మళ్లీ రామ్ చరణ్ దే పై చెయ్యి.. ఇంకెప్పుడు ఎన్టీఆర్ రీచ్ అవుతాడు..?

Ram Charan – NTR : టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరు పాన్ ఇండియా సినిమాలను చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇక ఈ మధ్య ఎక్కువగా అలాంటి సినిమాలే వస్తున్నాయి. డైరెక్టర్లు కూడా స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలనే తెరకేక్కించే పనిలో ఉన్నారు. స్టార్ హీరోల మధ్య పాన్ ఇండియా లెవల్ వార్ జరుగుతుంది.. గత మూడేళ్లుగా ప్రభాస్ ఒక్కడే పాన్ ఇండియన్ హీరోగా సినిమాలు చేయడంతో హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వందల కోట్ల బిజినెస్ జరిగేది. కానీ ఇప్పుడు స్టార్ హీరోలందరు పాన్ ఇండియా లెవల్ లో సినిమాను రిలీజ్ చెయ్యాలని ఆలోచిస్తుండేవారు. ఈ మధ్య ఎక్కువగా ఎన్టీఆర్, రామ్ గేమ్ ఛేంజర్ సినిమాల పైనే ఫోకస్ పెట్టారు. అయితే గతంలో లాగే ఈ ఏడాది కూడా రామ్ చరణ్ దే పై చేయి అనే టాక్ మీడియా వర్గాల్లో వినిపిస్తుంది.. అదేంటో ఒకసారి చూసేద్దాం..


ఎన్టీఆర్ పై మళ్లీ రామ్ చరణ్ దే పై చెయ్యి..

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ దేవరతో పాన్ ఇండియా లెవెల్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు రూ.150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా.. రికార్డులను త్వరలోనే అల్లు అర్జున్ పుష్ప 2, రాంచరణ్ గేమ్ ఛేంజర్‌ సినిమాల తో బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఇప్పటికే ఫ్రీ థియెట్రిక‌ల్‌ బిజినెస్‌తో రామ్ చరణ్‌ మూవీ మరో రికార్డును బ్రేక్ చేసింది. ఎన్టీఆర్ దేవరకన్నా అదిరిపోయే రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుంది గేమ్ చేంజర్.. ఇక దేవరకు వరల్డ్ వైడ్ గా రూ.180 కోట్ల ప్రీ థియెట్రిక‌ల్ బిజినెస్‌ జరిగితే.. రామ్‌చరణ్ గేమ్ ఛేంజ‌ర్‌కు మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.150 కోట్ల ప్రీ థియెట్రిక‌ల్‌ బిజినెస్ జరిగింది. అంటే ఇంకా లెక్కలు తేలాల్సి ఉంది.. అంటే ఈ సినిమా బిజినెస్ తో ఎన్టీఆర్ పై రామ్ చరణ్ పై చెయ్యి సాధించాడు. ఇక రామ్ చరణ్ సినిమా హిట్ అయితే ఇక ఎన్టీఆర్ మళ్లీ డౌన్ అయిపోతాడని తెలుస్తుంది.


ఎన్టీఆర్ సినిమాలు ఎందుకు క్రేజ్ ను అందుకోలేదు..?

ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఇక కలెక్షన్స్ కూడా అదే రేంజులో ఉన్నాయి.. దాంతో ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. బిజినెస్ డీల్ చూస్తే.. దేవర సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో రూ.110 కోట్లు మాత్రమే జరగగా.. తెలుగు రాష్ట్రాల్లోనే రెండు సినిమాలకు రూ.40 కోట్ల వ్యత్యాసం వచ్చింది. ఇక గేమ్ ఛేంజర్‌కు ఓవర్సీస్ లో రూ.30 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.45 కోట్లు, కర్ణాటకలో రూ.16కోట్లు, తమిళనాడులో రూ.30 కోట్లు ప్రీ థియెట్రికల్‌ బిజినెస్‌లు జరిగినట్లు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే రామ్ చరణ్ కాస్త ఎక్కువగా వసూల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ నెక్స్ట్ రాబోతున్న వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాతో అయినా రామ్ చరణ్ రికార్డ్ ను బ్రేక్ చేస్తాడేమో చూడాలి..

Related News

35 chinna katha kaadu: అరుదైన గౌరవం అందుకున్న 35 చిన్న కథ కాదు..!

Pragathi: ఆ నటుడు అసభ్యకరంగా తాకాడు.. ప్రగతి ఎమోషనల్ కామెంట్స్..!

Ustaad Bhagat Singh: తేరి రీమేక్ కాదు.. ఆ పోలికలు ఉండటం వల్లే మిస్ కమ్యునికేషన్

Unstoppable With NBK : అప్పుడు పవన్ కళ్యాణ్ కి ప్లే చేసిన స్ట్రాటజీ ఇప్పుడు సిబిఎన్ కు కూడా చేస్తుంది

Fauji Movie : భారీ ధరకు ‘ ఫౌజీ ‘ డిజిటల్ రైట్స్.. ఇది ప్రభాస్ రేంజ్.. !

5 Years Of Kaithi : సరిగ్గా ఐదేళ్ల క్రితం, లోకేష్ కనకరాజ్ అంటే ఏంటో తెలిసి వచ్చింది

Kanguva: సూర్యతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తున్న మెగా హీరో

Big Stories

×