EPAPER

Thandel: సంక్రాంతి రేస్ నుండి తప్పిపోయినట్లే, రిలీజ్ డేట్ ఎప్పుడంటే

Thandel: సంక్రాంతి రేస్ నుండి తప్పిపోయినట్లే, రిలీజ్ డేట్ ఎప్పుడంటే

Thandel:  అక్కినేని వారసుడిగా వాసు వర్మ (Vasu Varma) దర్శకత్వం వహించిన జోష్ (josh) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. కానీ వాస్తవానికి ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. వాసు వర్మ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినా కూడా ఇప్పటికీ చాలామందికి ఒక ఫేవరెట్ ఫిలిమ్ గా ఉంటుంది. ఈ సినిమాలో నాగచైతన్యని చూపించిన విధానం. ఈ సినిమాలోని డైలాగ్స్. అందర్నీ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య ఆటిట్యూడ్ కూడా చాలామందికి ఇష్టం అని చెప్పొచ్చు. కానీ అప్పుడున్న కొన్ని కారణాల వలన ఈ సినిమా అంతగా ఆడలేదు.


జోష్ సినిమా తర్వాత నాగచైతన్య చేసిన సినిమా ఏ మాయ చేసావే (Ye Maaya Chesave). గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gowtham Vasudev Menon) దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి హిట్ అయింది. కేవలం కమర్షియల్ గా హిట్ అవ్వడమే కాకుండా చాలామంది ప్రశంసలను కూడా అందుకుంది ఈ చిత్రం. ఇప్పటికీ ఈ సినిమాకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ కూడా తనకు చాలా ఇష్టమైన సినిమాల్లో ఏమాయ చేసావే కూడా ఒకటి అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికి నాగ చైతన్య కెరియర్ లో బెస్ట్ ఫిలిమ్స్ ప్రస్తావన వస్తే ఈ సినిమా ముందు ప్లేస్ లో ఉంటుంది.

ఇకపోతే ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాను చేస్తున్నాడు. సముద్రం నేపథ్యంలో ఈ సినిమా జరుగుతుంది. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచింది. కార్తికేయ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చందు దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఇద్దరు కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను మొదట డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తారు అని అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా అప్పుడు రావట్లేదని చాలామందికి క్లారిటీ వచ్చేసింది.


ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను రిపబ్లిక్ డే కి రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలు దేశభక్తికి సంబంధించిన ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి అందుకోసమే చిత్ర యూనిట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒక యదార్థ సంఘటన ఆధారంగా నిర్మితమైనట్లు కథనాలు వినిపించాయి. కార్తికేయ లాంటి హిట్ సినిమా తర్వాత చందు తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.

Related News

35 chinna katha kaadu: అరుదైన గౌరవం అందుకున్న 35 చిన్న కథ కాదు..!

Pragathi: ఆ నటుడు అసభ్యకరంగా తాకాడు.. ప్రగతి ఎమోషనల్ కామెంట్స్..!

Ustaad Bhagat Singh: తేరి రీమేక్ కాదు.. ఆ పోలికలు ఉండటం వల్లే మిస్ కమ్యునికేషన్

Unstoppable With NBK : అప్పుడు పవన్ కళ్యాణ్ కి ప్లే చేసిన స్ట్రాటజీ ఇప్పుడు సిబిఎన్ కు కూడా చేస్తుంది

Fauji Movie : భారీ ధరకు ‘ ఫౌజీ ‘ డిజిటల్ రైట్స్.. ఇది ప్రభాస్ రేంజ్.. !

5 Years Of Kaithi : సరిగ్గా ఐదేళ్ల క్రితం, లోకేష్ కనకరాజ్ అంటే ఏంటో తెలిసి వచ్చింది

Kanguva: సూర్యతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తున్న మెగా హీరో

Big Stories

×