బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత నిర్మాతగా మారుతూ తెరకెక్కించిన చిత్రమే ‘దో పత్తి’.

శషాంక్ చదుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ‘దో పత్తి’లో కృతి సనన్ డ్యుయెల్ రోల్‌లో నటించింది.

ఏకంగా నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది ‘దో పత్తి’. అక్టోబర్ 25న విడుదలయిన ఈ సినిమా మినీ రివ్యూపై ఓ లుక్కేయండి.

ప్లస్‌ల విషయానికొస్తే.. ‘దో పత్తి’లో కాజోల్, కృతి సనన్ నటనే హైలెట్. ఈ ఇద్దరివి నటనకు స్కోప్ ఉన్న పాత్రలే.

‘దో పత్తి’లో స్క్రీన్ ప్లే అనేది వేగంగా కాకుండా చాలా మెల్లగా వెళ్తూ ఆడియన్స్‌ను అందులో లీనం చేసే ప్రయత్నం చేస్తోంది.

ఆడియన్స్‌ను కట్టిపడేయడానికి కాజోల్, కృతి పర్ఫార్మెన్స్‌లే చాలు.

‘దో పత్తి’లో ప్లస్‌లతో పోలిస్తే మైనస్‌లు చాలానే ఉన్నాయి. ముందుగా కథలో ట్విస్టులు ఆడియన్స్‌ను ఎగ్జైట్ చేసే విధంగా ఉండవు.

తన్వి అజ్మీ, బ్రిజింద్ర లాంటి నటులను తీసుకొని వారికి ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇవ్వలేదని ప్రేక్షకులకు అనిపించే ఛాన్స్ ఉంది.

‘దో పత్తి’ క్లైమాక్స్‌ను కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. అయితే అది మరొకలాగా ఉంటే బాగుంటుందని చాలామందికి అనిపిస్తుంది.