EPAPER

Homemade Face Mask: ఖరీదైన క్రీములు అవసరమే లేదు.. వీటితో ఇన్స్టంట్ గ్లో

Homemade Face Mask: ఖరీదైన క్రీములు అవసరమే లేదు.. వీటితో ఇన్స్టంట్ గ్లో

Homemade Face Mask: ముఖం యొక్క మెరుపును పెంచేందుకు అనేక ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం రసాయనాలతో తయారు చేసినవే. ఇలాంటి ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడితే చర్మం పొడిబారడంతో పాటు మెరుపును కూడా కోల్పోతుంది.


ఇది మాత్రమే కాదు చర్మంపై ముడతలు కూడా వస్తాయి. అందుకే రసాయనాలతో తయారు చేసిన ఫేస్ ప్రొడక్ట్స్ వాడకుండా ఇంట్లోనే కొన్ని పదార్థాలతో ఫేస్ మాస్కులను తయారు చేసుకుని వాడవచ్చు. వీటి వల్ల ముఖంపై కోల్పోయిన గ్లోను తిరిగి పొందవచ్చు. అంతే కాకుండా ముఖంపై మొటిమలు కూడా రాకుండా ఉంటాయి.

ఫేస్ మాస్క్‌లు చర్మానికి తేమను పునరుద్ధరించడమే కాకుండా, తక్కువ సమయంలో చర్మం యొక్క పాత గ్లోను తిరిగి తెస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే ఫేస్ మాస్క్‌లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ 2 సహజమైన ఫేస్ మాస్క్‌లు మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి

1. తేనె, స్ట్రాబెరీ ఫేస్ మాస్క్‌:

కావలసినవి:
తేనె – 1 టీ స్పూన్
స్ట్రాబెరీ పేస్ట్- 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం:పైన చెప్పిన మోతాదుల్లో స్ట్రాబెరీ పేస్ట్ , తేనెను తీసుకుని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిని ముఖానికి మాస్క్ లాగా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. రెండూ అనేక పోషకాలను కలిగి ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కాంతిని పెంచడమే కాకుండా మృతకణాలను తొలగిస్తాయి. స్ట్రాబెర్రీలో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

2. అరటిపండు, తేనె, పసుపుతో ఫేస్ మాస్క్:
కావలసినవి:
అరటిపండు గుజ్జు – 1 టేబుల్ స్పూన్
తేనె- 1 టీ స్పూన్
పసుపు- 1 టేబుల్ స్పూన్

Also Read: నారింజ తొక్కలతో ఫేస్ సీరం.. అందమైన చర్మం మీ సొంతం

తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో అరటిపండు గుజ్జుతో పాటు, తేనె, పసుపు వేసి ఒక బౌల్‌లో మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా ముఖంపై మొటిమలు కూడా రాకుండా ఉంటాయి. అరటి పండులోని పోషకాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. అంతే కాకుండా మొటిమల సమస్యను కూడా చాలా వరకు తగ్గిస్తాయి.

అరటిపండు, తేనె, పసుపుతో చేసిన ఫేస్ మాస్క్ ముఖాన్ని మెరిసేలా చేయడంతో పాటు చర్మాన్ని మృదువుగా మార్చడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ నేచురల్ ఫేస్ మాస్క్ డ్రై స్కిన్ ఉన్న వారికి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అరటిపండులో విటమిన్ ఎ, బి, సి ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి పనిచేస్తుంది. గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Healthy Hair Tips: వీటితో.. జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం

Almond For Skin: బాదంను ఇలా వాడితే.. మీ ముఖం మెరిసి పోతుంది

Orange Juice: ఈ జ్యూస్ తాగితే అనేక వ్యాధులు పరార్.. బరువు కూడా తగ్గొచ్చు

Herbal Hair Oil: ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్‌తో.. జుట్టు పెరగడం గ్యారంటీ

Curry Leaves Hair Mask: కరివేపాకుతో హెయిర్ మాస్క్.. ఇది వాడితే జుట్టు రాలే సమస్యే ఉండదు

Face Serum: నారింజ తొక్కలతో ఫేస్ సీరం.. అందమైన చర్మం మీ సొంతం

Big Stories

×