భారతదేశంలో పొడువైన నదులు ఇవే..

గంగానది.. ఉత్తరాఖండ్ గంగోత్రి నుంచి బే ఆఫ్ బెంగాల్ సముద్రం వరకు 2525 కిలోమీటర్ల పొడవున ఉంది.

గోదావరి.. దక్షిణ గంగ అనే పేరుగాంచిన ఈ నది మహారాష్ట్ర నుంచి బే ఆఫ్ బెంగాల్ సముద్రం వరకు 1465 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది.

కృష్ణా నది.. మహారాష్ట్రలో పుట్టి.. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 1400 కిమి వరకు వ్యవసాయానకి ఎంతో ఉపయోగపడుతుంది.

యమున నది.. గంగానదికి ఇది ఉపనది. యమునోత్రిలో పుట్టి 1376 కిమి ప్రయాణించి ప్రయాగ్ రాజ్‌లో ఇది గంగా నదిలో కలిసిపోతుంది.

నర్మదా నది.. అమరకంటక్ నుంచి అరేబియన్ సముద్రం వరకు 1312 కిమి పశ్చిమంవైపు ప్రయాణించే దేశంలో పొడువైన నది ఇదే.

సింధూ నది.. టిబెట్ దేశంలో పుట్టి.. ఇండియా మీదుగా పాకిస్తాన్ కు వెళ్లి చివరకు అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. 1114 కిమి ప్రయాణిస్తుంది.