EPAPER

YS Sharmila: సీఎం అయ్యాడు.. విడిపోదామన్నాడు.. దారుణంగా అవమానించాడు.. జగన్ గుట్టు రట్టు చేసిన షర్మిళ

YS Sharmila: సీఎం అయ్యాడు.. విడిపోదామన్నాడు.. దారుణంగా అవమానించాడు.. జగన్ గుట్టు రట్టు చేసిన షర్మిళ

YS Sharmila: గత కొన్ని రోజులుగా మాజీ సీఎం జగన్, ఆయన సోదరి షర్మిళ మధ్య నెలకొన్న ఆస్తి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఓ దినపత్రికలో వచ్చిన కథనంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలారెడ్డి, వైయస్సార్ అభిమానులకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు.


ఆ లేఖ ద్వారా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్న సమయంలో ఆస్తుల కు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో కూలంకషంగా వివరించి , అసలు తమ కుటుంబంలో ఆస్తి వివాదాలకు సంబంధించి జరిగిన పూర్తి వివరాలను వైయస్సార్ అభిమానులకు షర్మిళ వివరించారు. ఇంతకు ఆ లేఖలో ఏముందంటే…

వైఎస్సార్ కోరిక ఇదే..
దివంగత సీఎం వైఎస్సార్ బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో, సరస్వతి అయినా…భారతి సిమెంట్స్ అయినా… సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ, ఇలాంటివి ఏమైనా… నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలన్నది వైఎస్ఆర్ మాండేట్ అన్నారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నంత వరకు ఏ ఒక్క ఆస్తి పంపకం కూడా జరగలేదు. వైఎస్ఆర్ హఠాత్తుగా మరణించారు. ఆ తర్వాత కూడా ఏ ఆస్తి పంపకాలు జరగలేదు. ఈ రోజు వరకు నాకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో లేదు. స్వార్జితం అని జగన్ చెప్పుకుంటున్న ఆస్తులు అన్ని కుటుంబ ఆస్తులే. నా తండ్రి రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవం.


ఏనాడు ఆస్తుల్లో వాటా అడగలేదు..షర్మిళ
ఇతరులతో ఒక వ్యాపారంలో చిన్న భాగం నా పేరు మీద పెడితే అది ఆస్తి పంచి ఇచ్చినట్లు కాదు. ఆస్తి పంచడం అంటే .. ఇవిగో ఈ ఆస్తులు నీకు, ఇక ఇంతే అని మా నాన్న నాకు చెప్పి ఉంటే అది ఆస్తి పంచేయడమంటే అంటూ షర్మిళ పేర్కొన్నారు. జగన్ ఆస్తుల్లో వాటా అడుగుతున్నాననేది హాస్యాస్పదం. ఇవన్నీ కుటుంబ ఆస్తులు కనుక మా నాన్న, నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచాలనుకున్నారు. కాబట్టే..ఈ రోజు వరకు వీటి గురించి మాట్లాడుతున్నాం. నాకంటూ వ్యక్తిగతంగా ఈ ఆస్తులపై మోజు లేదు. వీళ్ళు పెట్టిన హింసలకు ఈ ఆస్తులు కావాలని కోరిక కూడా లేదు. కేవలం నా బిడ్డలకు ఈ ఆస్తులు చెందాలనేది వైఎస్సార్ అభిమతం గనుక, ఈ రోజు వరకు కూడా అమ్మైనా, నేనైనా తపన పడుతున్నాం. ఇప్పటికీ అమ్మ వెయ్యి సార్లు వీళ్ళను అడిగి ఉంటుంది. వందల కొద్దీ లేఖలు రాసి ఉంటుంది. అయినా నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తుల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు.

నాన్న చనిపోయిన తరువాత 10 ఏళ్లు జగన్ ఇబ్బందులు పడితే, అవి నా ఇబ్బందులు అనుకొని.. నా శక్తికి మించిన సహాయం చేశాను. తోడబుట్టిన వాడికోసం నా బిడ్డలను సైతం పక్కనపెట్టి ఆయన్ను, ఆయన పార్టీని ఏ స్వార్ధం లేకుండా నా భుజాల మీద మోశాను. ఆ 10 ఏళ్లు నా అవసరం ఉంది అనుకున్నారో, ఏమో.. నన్ను బాగానే చూశారు. పెద్ద కూతురు అన్నారు. ఆ 10 ఏళ్లు వైఎస్సార్ ఊహించినట్లుగానే.. గ్రాండ్ చిల్డ్రన్ నలుగురు సమానం అన్నట్లుగానే వ్యవహరించారు. ఆ 10 ఏళ్లలో 200 కోట్లు ఇచ్చామని చెప్తున్నది ఇందులో భాగంగానే.

సీఎం అయ్యాడు.. మారాడు.. షర్మిళ
2019లో జగన్, ముఖ్యమంత్రి అయ్యారు. సిఎం అయిన వెంటనే జగన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. చిన్నచూపు చూడటమే కాకుండా సిఎం అయిన నెలరోజులకే విడిపోదామని ఇజ్రాయిల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారు. ఇందుకు అమ్మా, నేను వద్దని చెప్పాం. లేదు ససేమిరా విడిపోవాల్సిందే అని పట్టుబట్టాడు. తర్వాత రోజుల్లో ఆస్తులు పంచుకుందామని విజయవాడకు రమ్మన్నారు. విజయవాడకు వచ్చాక, భారతి సిమెంట్స్, సాక్షిలో నాకు ఎక్కువ వాటా కావాలని అడిగాడు.

నేను 60 తీసుకుంటా, నీకు 40 ఇస్తా అని చెప్పాడు. అది అమ్మకు కూడా భావ్యం అనిపించలేదు. సగం కంటే ఎక్కువ కావాలని గట్టిగా అనుకుంటే .. 5 శాతం ఎక్కువ తీసుకో.. లేదా 10 శాతం ఎక్కువ తీసుకో.. కానీ 20 శాతం ఎక్కువ కావాలని అడగడమంటే అన్యాయం అనిపిస్తుందని అమ్మ చెప్పింది. అర్ధగంటలో ఈ ఆస్తులు నీకు, ఈ ఆస్తులు నాకు అని తేలిపోయింది. దీని ప్రకారం సాక్షిలో 40 శాతం, భారతి సిమెంట్స్ లో వాళ్లకు చెందిన 49 శాతంలో 40 శాతం, సరస్వతి పవర్ లో 100 శాతం, యలహంక ప్రాపర్టీలో 100 శాతం, వైఎస్ఆర్ నివాసమున్న ఇల్లు, ఇంకా కొన్ని ఆస్తులు నా భాగానికి రావడం జరిగిందని అక్కడ ఒప్పందం జరిగిందని షర్మిళ పేర్కొన్నారు.

కేసుల్లో లేని సరస్వతి, యలహంక ప్రాపర్టీలను, MOU మీద సంతకం పెట్టిన 2019 లోనే ఇవ్వాల్సి ఉండగా.. ఈ రోజు వరకు ఇవ్వాలన్న ఉద్దేశ్యం వాళ్లకు లేదు. అమ్మ గట్టి ఒత్తిడి మేరకు, క్లాసిక్, సండూరు హోల్డ్ చేస్తున్న 52 శాతం సరస్వతి షేర్స్ నీ 2021 లో కొనుక్కోవడానికి అంగీకరించారు. ఇక తర్వాత రోజుల్లో వాళ్ళ ఇండివిడ్యువల్ షేర్లు కూడా అమ్మకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది.

నన్ను అవమానించారు.. షర్మిళ
అదే 2021లో, నేను రాజకీయాల్లో అడుగుపెట్టడం, మొదట తెలంగాణలో, ఆ తర్వాత కాలంలో ఆంధ్రకు రావడం జరిగింది. తనకు ఇష్టం లేకుండా రాజకీయాల్లోకి వచ్చానని, నన్ను తొక్కడానికి జగన్ మోహన్ రెడ్డి గారు చెయ్యని ప్రయత్నం లేదు. ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తే, నన్ను అన్ని రకాలుగా అవమానించడమే కాకుండా, సోషల్ మీడియాలో ఉచ్ఛం, నీచం లేకుండా, పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న దాన్ని అనే ఇంగితం కూడా లేకుండా, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. నన్నే కాదు, వైఎస్ఆర్ తమ్ముడు వివేకానంద రెడ్డి పర్సనల్ ఫోటోలు సాక్షి మీడియాలో అసభ్యకరంగా ప్రచురించి అతి దారుణంగా వ్యవహరించారు. ఆంధ్ర ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక.. ఆ ఓటమికి నేను కారణం అని వాళ్ళు బలంగా నమ్మారు. కాబట్టి మాకు విరోధం వద్దని, సెటిల్ చేసుకుందామని, బంధువులను నా దగ్గరకు పంపించడం జరిగింది.

అమ్మ మీదనే కేసు వేశాడు.. షర్మిళ
సెటిల్ మెంట్ కి ఒప్పుకోలేదని మళ్ళీ కక్ష్య కట్టి, నా మీద, అమ్మ మీద NCLT లో మేము మోసం చేసి షేర్లు తీసుకున్నామని కేసు వేశారు. పబ్లిక్ లో గత కొన్ని రోజులుగా అమ్మ మీద కేసు వేసిన దుర్మార్గుడు అనే అపకీర్తి ఇప్పుడు వస్తుందని గమనించి.. నా బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నారనే అభియోగం మోపుతున్నారు. నిజానికి బెయిల్ రద్దు అయ్యే సీన్ లేదు. ఎందుకంటే సరస్వతి షేర్స్ అటాచ్ అవ్వలేదు. కంపెనీల్లో ED అటాచ్ చేసింది షేర్లు కాదు. 32 కోట్లు విలువ జేసే భూములు మాత్రమే. షేర్స్ ట్రాన్స్ఫర్ కి, ఆయన బెయిల్ రద్దు కి ఎటువంటి సంబంధం లేదు. అమ్మ, నేను మోసం చేస్తున్నామని గాని, లేక ఆస్తికోసం అత్యాశ పడుతున్నామని గాని, YSR అభిమానులు భావించకూడదని.. పైనున్న వాస్తవాలు అన్ని మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఒక విషయం గుర్తుచేస్తున్నా.. MOU నా చేతుల్లో 5 ఏళ్లు ఉన్నా…దాంట్లో నాకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వకపోయినా… ఏ ఒక్క మీడియా కి కానీ, కోర్టుకి కానీ, ఈ MOU నాకు నేనుగా బయటపెట్టలేదు. అవకాశం, అవసరం ఉన్నా…ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినా.. కుటుంబ గౌరవం, YSR పరువు కోసం నేను ఎక్కడా 5 ఏళ్ళు MOU బయట పెట్టలేదు.

Also Read: YS Jagan: వైసీపీ కొత్త ప్రచారం.. ఏ క్షణమైనా బెయిల్ రద్దు, టెన్షన్‌లో జగన్ !

ఇలా షర్మిళ విడుదల చేసిన లేఖ పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. అయితే తన తండ్రి వైఎస్సార్ అభిమానులు, తనను అనుమానించకూడదనే ఉద్దేశంతో తెలుపుతున్నట్లు, ఇప్పటికైనా అసలు నిజాన్ని సమాజానికి తెలపాలన్నదే తన అభిమతమని షర్మిళ లేఖలో తుది పలుకులు పలికారు. మరి ఈ లేఖకు జగన్ రిప్లై ఎలా ఉంటుందో వేచిచూడాలి.

Related News

TDP on Sharadapeetam: శారదాపీఠం.. పేరుకే పీఠమే కానీ వివాదాల పుట్ట.. ప్రభుత్వ నిర్ణయం భేష్ అంటున్న కూటమి నేతలు

Kurnool District News: గంటల వ్యవధిలో పెళ్లి.. వరుడు రెడీ కానీ.. ప్రియుడు ఎంటర్.. ఆ తర్వాత జరిగింది ఇదే!

Weather Update: తప్పిన తుఫాను గండం

High Court on Allu Arjun: హైకోర్టులో అల్లుఅర్జున్ కు ఊరట.. అప్పటి వరకు చర్యలు వద్దంటూ ఆదేశం..

Tirumala Breaking News: తిరుమలకు కాలినడకన వస్తున్నారా.. అయితే సదుపాయాలు మీకోసమే.. టీటీడీ కీలక ప్రకటన

Prakasam Politics: ప్రకాశంలో సైలెంట్ పాలిటిక్స్ ప్లే చేస్తున్న ఆ నేత.. నేరుగా పవన్ నుండి పిలుపు.. వాట్ నెక్స్ట్?

Big Stories

×