EPAPER

Best Movie in This Week : ఈ రోజు విడుదలైన 7 సినిమాల్లో విన్నర్ ఎవరు..? ఇక్కడ ఓ లుక్ వేయండి.

Best Movie in This Week : ఈ రోజు విడుదలైన 7 సినిమాల్లో విన్నర్ ఎవరు..? ఇక్కడ ఓ లుక్ వేయండి.

Best Movie in This Week : ఇటీవల కాలంలో బిగ్ స్క్రీన్ పై పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువ కావడంతో ఏమాత్రం గ్యాప్ దొరికినా సరే చిన్న సినిమాలు ఒకేసారి కుప్పలు తెప్పలుగా రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ ఫ్రైడే కూడా అలాగే ఏకంగా 7 సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. మరి ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమాల్లో విన్నర్ ఎవరో అనే విషయంపై ఇక్కడ ఒ లుక్కు వేయండి. టాక్ త్వరలోనే అప్డేట్ చేయబడును.


పొట్టేల్ (Pottel)
ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ‘పొట్టేల్’ మూవీ గురించి. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగాతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి డైరెక్టర్స్ హైప్ పెంచేశారు. ఇక ఇందులో యువచంద్ర, అనన్య నాగళ్ళ జంటగా నటించగా, సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. రా అండ్ రాస్టిక్ పీరియాడిక్ బ్యాక్డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా పాయింట్ బాగున్నప్పటికీ మూవీ ఆకట్టుకోలేదు అంటూ టాక్ నడుస్తోంది.

నరుడి బ్రతుకు నటన (Narudu Brathuku Natana)
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించగా, శివకుమార్, నితిన్ ప్రసన్న లీడ్ రోల్స్ లో నటించారు. రా అండ్ రస్టిక్ ఎమోషనల్ స్టోరీ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. కొంతమంది డోంట్ మిస్ అంటుంటే మరికొంతమంది భరించడం కష్టమే అంటున్నారు.


లగ్గం (Laggam)
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల ఆధారంగా తెరపైకి వచ్చిన మరో చిత్రం ‘లగ్గం’. సాయిరోనక్‌, ప్రగ్యా నాగ్ర జంటగా నటించిన ‘లగ్గం’ చిత్రం అక్టోబర్ 25న అంటే ఈరోజు రిలీజ్ అయ్యింది. సుభీషి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు చెప్పాల రమేష్ దర్శకత్వం వహించారు. ఈ ‘లగ్గం’ మంచి కాన్సెప్ట్ తో రూపొందిన ఓ ఫ్యామిలీ డ్రామా. ఇంటర్వెల్, క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ వీకెండ్ కి ఒకసారి ట్రై చేయవచ్చు.

ఎంత పని చేశావ్ చంటి (Yentha Pani Chesav Chanti)
‘తస్మాత్ జాగ్రత్త’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ఉదయ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన కొత్త సినిమా ‘ఎంత పని చేశావ్ చంటి’. శ్రీనివాస్ ఉలిశెట్టి, దియారాజ్, నీహారిక, శాంతిప్రియ హీరో, హీరోయిన్లుగా పి.జె.కె.మూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన విభిన్న కథా చిత్రం ‘ఎంత పని చేశావ్ చంటి’ ఆడవాళ్లకు మాత్రమే అంటూ ఈ శుక్రవారం థియేటర్లలోకి తీసుకొచ్చారు.

టాక్ త్వరలోనే అప్డేట్ చేయబడును.

సముద్రుడు (Samudrudu)
మా కలెక్షన్లలో 20% మత్స్యకారులకు ఇస్తాము అంటూ అందరి దృష్టిని ఆకర్షించారు ‘సముద్రుడు’ టీం. రమాకాంత్, అవంతిక, భాను శ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు నారదశి నగేష్ దర్శకత్వం వహించారు. కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా కనీసం బజ్ లేకుండానే థియేటర్లలోకి వచ్చింది.

టాక్ త్వరలోనే అప్డేట్ చేయబడును.

C 202
ఇన్ని సినిమాల మధ్య హర్రర్ కథాంశంతో ప్రేక్షకులను అలరించడానికి ఈరోజు థియేటర్లలోకి వచ్చిన మరో సినిమా C 202. మున్నా కాశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, చిత్రం శీను తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మైటీ ఓక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కె ఈ సినిమాను నిర్మించారు. దర్శకత్వం వహించిన మున్నా కాశినే ఈ సినిమాలో హీరోగా నటించారు.

టాక్ త్వరలోనే అప్డేట్ చేయబడును.

గ్యాంగ్‌స్టర్ (Gangster)
చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘గ్యాంగ్‌స్టర్’. అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ కూడా నటించిన ఈ చిత్రం కూడా నేడు థియేటర్లలోకి వచ్చింది. హీరో చంద్రశేఖర్ రాథోడ్ సినిమాకు రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, ప్రధాన నటుడిగా వ్యవహరించారు.

టాక్ త్వరలోనే అప్డేట్ చేయబడును.

Related News

Fauji Movie : భారీ ధరకు ‘ ఫౌజీ ‘ డిజిటల్ రైట్స్.. ఇది ప్రభాస్ రేంజ్.. !

5 Years Of Kaithi : సరిగ్గా ఐదేళ్ల క్రితం, లోకేష్ కనకరాజ్ అంటే ఏంటో తెలిసి వచ్చింది

Kanguva: సూర్యతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తున్న మెగా హీరో

Raja Saab : టైం చూసి దిగుతున్న’ రాజా సాబ్ ‘..కల్కి రికార్డ్ బ్రేక్ చేస్తుందా?

Game Changer Teaser: టీజర్ అదిరిపోయిందంట.. దివాళీ బ్లాస్టేరోయ్

Ram Charan – NTR : ఎన్టీఆర్ పై మళ్లీ రామ్ చరణ్ దే పై చెయ్యి.. ఇంకెప్పుడు ఎన్టీఆర్ రీచ్ అవుతాడు..?

Naga Vamsi About Nbk109: ఎన్ని అంచనాలు పెట్టుకున్న వాటిని మించి ఈ సినిమా ఉండబోతుంది

Big Stories

×