EPAPER

IND VS NZ: 156 పరుగులకే కుప్పకూలిన టీమిండియా

IND VS NZ: 156 పరుగులకే కుప్పకూలిన టీమిండియా

IND VS NZ: న్యూజిలాండ్ ( New Zealand ) వర్సెస్ టీమిండియా ( Team India ) మధ్య జరుగుతున్న రెండో టెస్టులో… రోహిత్ శర్మ ( Rohit Sharma) సేన చేతులెత్తేసింది. 156 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ లో కుప్పకూలింది టీమ్ ఇండియా. ఇవాళ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత తొమ్మిది వికెట్లు కోల్పోయింది. 45.3 ఓవర్లలోనే…. పది వికెట్లు నష్టపోయి… పీకల్లోతు కష్టాల్లోకి వెళ్ళింది.


India was bowled out for 156 runs in the first innings

టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ ఎవరు కూడా రాణించకపోవడంతో..దారుణంగా.. మొదటి ఇన్నింగ్స్ లో ప్రదర్శన కనబరిచింది టీమిండియా ( Team India ) . టీమిండియా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 30 పరుగులు, శుభమన్ గిల్ 30 పరుగులు అలాగే… ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 38 పరుగులు చేసి రాణించారు. ఇందులో రోహిత్ శర్మ ( Rohit Sharma) డక్ అవుట్, విరాట్ కోహ్లీ ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ బాట పట్టారు.

Also Read: Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !


మొదటి రోజు సాయంత్రం ఒక వికెట్ కోల్పోయిన టీమిండియా ( Team India ) … ఇవాళ ఉదయం నుంచి ఇప్పటివరకు 9 వికెట్లు నష్టపోవడం జరిగింది. దీంతో… న్యూజిలాండ్ కంటే 103 పరుగులు వెనుకబడిపోయింది టీమిండియా. నిన్నటి వరకు న్యూజిలాండ్ పై పెత్తనం చెలాయించిన టీమిండియా… బ్యాటింగ్ లో మాత్రం చేతులెత్తేసింది.

Related News

Washington Sundar: “వాషింగ్టన్ సుందర్” అనే పేరు వెనుక సీక్రెట్‌ ఇదే !

IND VS NZ: కుప్పకూలిన భారత టాప్ ఆర్డర్..7 వికెట్లు డౌన్ !

David Warner: డేవిడ్ వార్నర్‌ కు రూట్‌ క్లియర్‌..నిషేధం ఎత్తివేత !

Emerging Asia Cup 2024: నేడు సెమీస్‌ పోరు…ఆఫ్ఘానిస్తాన్ తో టీమిండియా ఫైట్‌

IND VS NZ: న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

Big Stories

×