EPAPER

Kanguva First Review : “కంగువ” ఫస్ట్ రివ్యూ… మూవీ టాక్ ఏంటంటే?

Kanguva First Review : “కంగువ” ఫస్ట్ రివ్యూ… మూవీ టాక్ ఏంటంటే?

Kanguva First Review : తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన ఫాంటసీ యాక్షన్ పాన్ ఇండియా మూవీ ‘కంగువ’ (Kanguva). శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ సినిమా బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్ర బృందం ఈ మూవీ ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్నారు. సూర్య వరసగా ఇంటర్వ్యూలలో పాల్గొనడంతో పాటు పలు ఈవెంట్లలో కనిపిస్తున్నారు. అయితే మూవీ రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉండగానే ‘కంగువ’ ఫస్ట్ రివ్యూ (Kanguva First Review) వచ్చేసింది. మరి ఈ సినిమా టాక్ ఏంటో చూసేద్దాం పదండి.


‘కంగువ’ ఫస్ట్ రివ్యూ…

‘కంగువ’ (Kanguva) మూవీకి లిరిసిస్ట్ మదన్ కర్కి డైలాగ్స్ అందించారు. తాజాగా ఆయన ఈ మూవీ ఫస్ట్ రివ్యూను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తను సినిమాకు సంబంధించిన ఫుల్ వెర్షన్ చూసాను అంటూ సినిమా ఎలా వచ్చిందో వెల్లడించారు. ఈ సినిమాలో సూర్య పర్ఫామెన్స్ తో సహా పలు అంశాలు అద్భుతంగా ఉన్నాయి అంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ లో “ఈ రోజే కంగువ ఫుల్ వెర్షన్ చూసాను. డబ్బింగ్ జరుగుతున్న టైంలో ప్రతి సీను నేను 100 సార్లకు పైగా చూశాను. కానీ చూసిన ప్రతిసారి ఈ సినిమా ఎఫెక్ట్ పెరుగుతూనే ఉంది. ఆర్ట్ డిజైనింగ్, లోతైన కథ, భారీ విజువల్స్, సూపర్ మ్యూజిక్ తో సహా సూర్య పవర్ హౌస్ పర్ఫార్మెన్స్ కలిపి ఇదొక అద్భుతమైన సినిమాగా రూపొందింది. అలాగే ఇంతటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అందించిన దర్శకుడు శివకు, స్టూడియో గ్రీన్ కు ధన్యవాదాలు” అంటూ పోస్ట్ చేశారు.


3500 థియేటర్లలో రిలీజ్…

కాగా సూర్య ‘కంగువ’ (Kanguva) సినిమాను తమిళంతో పాటు తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో నవంబర్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు 3500 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్లను నిర్వహించబోతున్నారు. ‘కంగువ’ సినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటించింది. ఇందులో సూర్య డ్యూయల్ రోల్ చేయగా, జగపతి బాబు, బాబి డియోల్, యోగి బాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో సూర్య డబ్బింగ్ కోసం మేకర్స్ ఏఐ టెక్నాలజీని వాడడం విశేషం. ఆయన కేవలం తమిళ భాషకు మాత్రమే డబ్బింగ్ చెప్పారు. ఇతర భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్టులతో కాకుండా సూర్య వాయిస్ ని ఏఐ వాడి డబ్బింగ్ చెప్పించారు. స్టూడియో గ్రీన్, యూవీ  క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ కృష్ణ, ప్రమోద్, కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 2000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని నమ్ముతున్నారు నిర్మాతలు. ఇదిలా ఉండగా సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Related News

Priyanka Chopra : ఆ హీరోలతో ముద్దులు, నాతో మాత్రం హద్దులు… ప్రియాంక చోప్రాపై సీనియర్ నటుడి కామెంట్స్

Alia Bhatt: అలియాకు పక్షవాతం.. సిగ్గులేదు అంటూ మండిపడ్డ బ్యూటీ

Brahmanandam: స్టార్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన బ్రహ్మీ.. అసలు నిజం ఏంటంటే..?

Best Movie in This Week : ఈ రోజు విడుదలైన 7 సినిమాల్లో విన్నర్ ఎవరు..? ఇక్కడ ఓ లుక్ వేయండి.

Suriya : వద్దు అంటున్నా… హైట్ తక్కువ అంటూ స్టేజ్‌పైనే సూర్య పరువు మొత్తం తీసేసిన బాలీవుడ్ స్టార్..

War 2: వార్ 2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫొటోస్ లీక్.. ఏమున్నాడ్రా బాబు

Unstoppable 4 : బాలయ్య టాక్ షోకి ‘గేమ్ ఛేంజర్’… ఇది మామూలు ప్లాన్ కాదు భయ్యో

Big Stories

×