EPAPER

Hamas Stop War: యుద్ధం ముగించడానికి హమాస్ రెడీ.. ‘గాజాలో ఇజ్రాయెల్ దాడులు అపేస్తే.. ‘

Hamas Stop War: యుద్ధం ముగించడానికి హమాస్ రెడీ.. ‘గాజాలో ఇజ్రాయెల్ దాడులు అపేస్తే.. ‘

Hamas Stop War| ఇజ్రాయెల్ తో యుద్ధం ముగించడానికి తాము సిద్ధంగా ఉన్నమంటూ హమాస్ మిలిటెంట్లు ప్రకటించారు. ఫ్రాన్స్ మీడియా సంస్థ అయిన ఎఎఫ్‌పితో కతార్ రాజధాని దోహలో ఒక సీనియర్ హమాస్ అధికారి (హమాస్ రాజకీయ విభాగం) గురువారం అక్టోబర్ 25, 2024న మాట్లాడారు.


“హమాస్ తరపున కొందరు నాయకలు యుద్ధం ముగించడానికి చర్చలకు సిద్దంగా ఉన్నారు. ఈజిస్ట్ రాజధాని కైరోలో ఇజ్రాయెల్ అధికారులతో గాజా సంధి కోసం చర్చలు కొనసాగుతున్నాయి. మేము యుద్ధం ముగించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇజ్రాయెల్ ముందుగా గాజాలో దాడులు ఆపేయాలి. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి వైదొలగాలి. ఇరువైపులు నుంచి ఖైదీలు విడుదలకు అంగీకరించాలి. గాజా ప్రజలను తిరిగి వారి ఇళ్లకు చేరేందుకు అనుమతి ఇవ్వాలి. గాజాలోకి ఇతర దేశాలు, ఐరాస నుంచి వచ్చే ఆహారం, వైద్య సాయాన్ని అనుమతించాలి. ఇవన్నీ చేసేందుకు ఇజ్రాయెల్ ఒప్పుకుంటే యుద్ధం ముగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.” అని సీనియర్ హమాస్ అధికారి అన్నారు.

Also Read: ‘ఇది మీ దేశం కాదు’.. ఆస్ట్రేలియా పార్లమెంటులో బ్రిటన్ రాజుకు ఘోర అవమానం


హమాస్ మిలిటెంట్ విభాగం నాయకుడు యాహ్యా సిన్వర్ ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన తరువాత ఇరువైపులా సంధి కోసం చర్చలు ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా సంధి కోసం ఈజిప్ట్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. అయితే ముందుగా హమాస్ వద్ద ఏడాదిపైగా బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేయాలని సూచించారు. కైరోలో చర్చలు చేసిన తరువాత ఇజ్రాయెల్ తరుపున మోసాద్ (ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగం) చీఫ్ ని కతార్ కు వెళ్లి శాంతి చర్చలు చేయాల్సిందిగా నెతన్యాహు గురువారం ఆదేశించారు.

మరోవైపు గాజా యుద్ధం ముగించే ప్రయత్నాల్లో భాగంగా కతార్ ప్రభుత్వాధికారులను అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంథోని బ్లింకెన్ కలిశారు. ఆయన కతార్ వెళ్లి.. యుద్దం ముగించేందుకు కతార్ ఒక మధ్యమార్గం సూచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి విరమించాక.. పాలస్తీనా వాసులు తిరిగి గాజాలో తమ జీవితాలు పున:ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఒకవైపు యుద్ధం ముగించేందుకు దౌత్య చర్చలు జరుగుతున్నా.. మరోవైపు గాజాలో మారణహోమం మాత్రం ఆగడం లేదు. అక్టోబర్ నెలలోనే ఉత్తర గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో 770 మంది చనిపోయారు. రెండు రోజుల క్రితం గాజాలో శరణార్థి శిబిరంగా మారిన ఒక స్కూల్ పై ఇజ్రాయెల్ చేసిన బాంబు దాడిలో 17 మంది చనిపోయారు. గాజాలో సామాన్య పౌరులు చిక్కుకున్నారని.. వారు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు వెళ్లడానికి ఏ ప్రదేశం సురక్షితంగా లేదని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్ ఎడతెరపి లేకుండా చేస్తున్న దాడుల వల్ల వారిని కాపాడలేకపోతున్నామని పాలస్తీనా ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది.

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య దశాబ్దాలుగా భూభాగం కోసం జరుగుతున్న వివాదంలో అక్టోబర్ 7, 2023న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై దాడి చేశారు. ఈ దాడిలో 1200 మంది చనిపోగా.. 250 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ కిడ్నాప్ చేసింది. ఆ తరువాత ఇజ్రాయెల్ ప్రారంభించిన మారణకాండలో ఇప్పటివరకు 42,000 మందికి పైగా గాజా పౌరులు చనిపోయారు. మరోవైపు హమాస్‌కు మద్దతుగా లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ లో కూడా యుద్దం ప్రారంభించింది. లెబనాన్ లో ఇప్పటివరకు దాదాను 1580 మంది చనిపోయినట్లు సమాచారం.

Related News

Putin Welcomes Trump: ‘యుద్ధం ఆపేందుకు ట్రంప్ సిన్సియర్‌గా కృషి చేస్తారు’.. బ్రిక్స్ సదస్సులో పుతిన్

Indian Ambassador Canada: భారతీయ విద్యార్థులను బ్రెయిన్ వాష్ చేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు .. కెనెడా అంబాసిడర్ వ్యాఖ్యలు

US Presidential Elections : అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం, ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం

Smart Bomb: లెబనాన్‌పై ‘స్మార్ట్ బాంబ్’ వదిలిన ఇజ్రాయెల్.. క్షణాల్లో బిల్డింగులు ధ్వంసం, ఈ బాంబు ప్రత్యేకత తెలుసా?

Justin Trudeau Resignation Demand : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి ఝలక్, రాజీనామాకు పట్టుబట్టిన సొంత పార్టీ ఎంపీలు

Hotel Bill Con couple: 5 స్టార్ రెస్టారెంట్‌లో తినడం.. బిల్లు ఎగ్గొటి పారిపోవడం.. దంపతులకు ఇదే పని!

Big Stories

×