EPAPER

Ka Movie: ట్రైలర్ బావుంది.. కానీ, కిరణ్ అబ్బవరంకే లక్ లేదు..?

Ka Movie: ట్రైలర్ బావుంది.. కానీ, కిరణ్ అబ్బవరంకే లక్ లేదు..?

Ka Movie:  కుర్ర హీరో కిరణ్ అబ్బవరం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజావారు రాణిగారు సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన కిరణ్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. సాధారణంగా ఒక కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయమయ్యినప్పుడు.. అది కూడా మొదటి సినిమాతో హిట్ అందుకున్నప్పుడు ప్రేక్షకుల్లో అతడి తరువాతి సినిమాపై అంచనాలు బాగానే ఉంటాయి. మొదటి సినిమా హిట్ అయ్యాక ఏ హీరో అయినా రెండో సినిమా నుంచి ఆచితూచి అడుగులు వేస్తాడు. కానీ, కిరణ్ అక్కడే ఫెయిల్ అయ్యాడు.


రాజావారు రాణిగారు తరువాత.. కిరణ్ తీసిన సినిమాలు అన్ని లెక్కబెట్టుకుంటే.. మహా అయితే రెండు సినిమాలు ప్రేక్షకులు ఆదరించారు.  ఒకటి ఎస్ఆర్ కల్యాణమండపం, రెండు వినరో భాగ్యము విష్ణు కథ. ఈ రెండు సినిమాలు తప్పించి ఈ హీరో చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకులకు తెలియదు. ఏడాదికి ఒక సినిమా ఇవ్వడానికే కష్టపడుతున్న హీరోలు ఉన్న ఈ జనరేషన్ లో ఈ కుర్ర హీరో.. ఏడాదిలో మూడు సినిమాలు రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు. ఇక చివరగా రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం.. ఒక ఏడాది గ్యాప్ తీసుకొని, ఒక మంచి కథతో వచ్చాడు. అదే క. సందీప్ మరియు సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిరణ్ సరసన నయన్ సారిక, తన్వి రామ్ నటిస్తున్నారు.

Pushpa 2 Remuneration : పుష్పగాడి రేంజే వేరబ్బా.. అందుకే అన్ని రూ.కోట్లు..!


మొట్ట మొదటిసారి కిరణ్.. పీరియాడికల్ కథతో వస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఇప్పటివరకు కొద్దో గొప్పో హైప్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక క మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా నేడు క ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఏమో అనుకున్నాం కానీ, ఈసారి కిరణ్ అబ్బవరం మంచి కథనే ఎంచుకున్నట్లు ట్రైలర్ ను బట్టి అర్ధమవుతుంది. ఒక పోస్ట్ మ్యాన్ గా ఒక ఊరికి వచ్చిన హీరో.. ఆ ఊరి కోసం ఏం చేశాడు.. ? ఆ ఊరు బాగుండడం కోసం ఎలాంటి ఆపదలు కొనితెచ్చుకున్నాడు.. ? అనే కథతో క మూవీ తెరకెక్కిందని ట్రైలర్ లో చూపించారు.

ఇప్పటివరకు లవర్ బాయ్ పాత్రల్లో కనిపించిన కిరణ్.. ఈ సినిమాలో ఊర మాస్ యాక్షన్ హీరోగా కనిపించాడు. మనోడిలో ఈ యాంగిల్ కూడా ఉందా.. ? అనే అనుమానం ట్రైలర్ చూసిన ఎవరికైనా అనిపించకమానదు. ట్రైలర్ ను బట్టి సినిమా పాజిటివ్ టాక్ అందుకుంటే హిట్ కొట్టినట్లే అనుకుంటే పొరబడినట్లే. అదేంటి.. అంత మాట అనేశారు అని అంటారా.. ? కథ బావున్నా.. లక్ కూడా కలిసిరావాలి కదండీ మరి. ఆ లక్ కిరణ్ కు లేదనే మాట వినిపిస్తుంది. అందుకు కారణం.. క సోలో రిలీజ్ కాదు కాబట్టి. దీపావళీ కానుకగా అక్టోబర్ 31 న క మూవీ రిలీజ్ కానుంది. దీపావళీ రేస్ అంటే ఒక్క సినిమానే రిలీజ్ ఎందుకు ఉంటుంది.. క తో పాటు అరడజనుకు పైగా సినిమాలు అదే రోజున రిలీజ్ అవుతున్నాయి.

Ka Movie Trailer : చీకటి వలయం… గందరగోళం… సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటున్న ట్రైలర్..!

మిగతా డబ్బింగ్ సినిమాలు పక్కన పెడితే.. పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు అదే రోజున రిలీజ్ కానున్నాయి. అవే దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్,  శివకార్తికేయన్ అమరన్. అమరన్ విషయం పక్కనపెడితే.. లక్కీ భాస్కర్ ను నిర్మించింది సితార ఎంటర్ టైన్మెంట్స్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ.. స్టార్ హీరోల సినిమాలు రేస్ లో ఉంటేనే.. థియేటర్స్ దొరకనివ్వకుండా చేస్తాడు.. అలాంటిది క లాంటి మూవీకి థియేటర్స్ ఇస్తాడా.. ? వంశీ నందిపాటి ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై వంశీ నందిపాటి ఈ సినిమా తెలుగు స్టేట్స్ రైట్స్ ను 12 కోట్లు పెట్టి కొన్నాడు.

కథ బావున్నా.. థియేటర్లు ఉంటేనే కదా కలక్షన్స్ వచ్చేవి. అన్ని థియేటర్లు నాగవంశీ చేతిలో ఉంటే.. ఈ సినిమాకు కలక్షన్స్ ఎలా వస్తాయి.. ? ఈ లెక్కన చూస్తే బయ్యర్లు సేఫ్ అవ్వడం కష్టమే అనే మాట వినిపిస్తుంది. మనోడి మార్కెట్ ను బట్టి.. ఒక 7 ,8 కోట్లు పెట్టి ఈ సినిమాను కొన్నా.. కొంతవరకు బయ్యర్లు సేఫ్ అయ్యేవారేమో.. కానీ ఏకంగా రూ. 12 కోట్లు అంటే నష్టం భరించక తప్పేలా లేదు.

Sai Pallavi : ఆ హీరోలు అందరూ ఉనికిని కోల్పోతారు… సాయి పల్లవి నుంచి షాకింగ్ కామెంట్స్..!

పోనీ.. ఈ రేసులో ఎందుకు సోలో రిలీజ్ పెట్టుకోవచ్చు కదా అని కిరణ్ ను అడిగితే.. ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఆ విషయాన్నీ ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు. అన్ని దారులు మూసుకుపోయాయి. క మూవీ రిజల్ట్ ఏది అయినా  బయ్యర్స్ కు వచ్చే నష్టాన్ని మేకర్స్  భరించాల్సి వస్తుందేమో. ఒకవేళ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకున్నా.. కలక్షన్స్ తక్కువ వచ్చాయని సర్దుకుపోవడమే. లేదు.. ఏమో గుర్రం ఎగరావచ్చు అని అనుకోవాలంటే.. అమరన్, లక్కీ భాస్కర్ సినిమాల కన్నా క మూవీ బాగుంటే.. రిలీజ్ అయ్యాకా థియేటర్స్ ను పెంచవచ్చు.  ఇక కిరణ్ అబ్బవరం లక్ ఎలా ఉందో తెలియాలంటే ఇంకో వారం ఆగాల్సిందే.

Related News

Sai Durgha Tej: ఇప్పటివరకు ‘విరూపాక్ష’ చూడలేదు, మెగా హీరోలంతా కలిస్తే అదే టాపిక్.. సాయి దుర్గా తేజ్ కామెంట్స్

Priyanka Chopra : ఆ హీరోలతో ముద్దులు, నాతో మాత్రం హద్దులు… ప్రియాంక చోప్రాపై సీనియర్ నటుడి కామెంట్స్

Alia Bhatt: అలియాకు పక్షవాతం.. సిగ్గులేదు అంటూ మండిపడ్డ బ్యూటీ

Brahmanandam: స్టార్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన బ్రహ్మీ.. అసలు నిజం ఏంటంటే..?

Best Movie in This Week : ఈ రోజు విడుదలైన 7 సినిమాల్లో విన్నర్ ఎవరు..? ఇక్కడ ఓ లుక్ వేయండి.

Suriya : వద్దు అంటున్నా… హైట్ తక్కువ అంటూ స్టేజ్‌పైనే సూర్య పరువు మొత్తం తీసేసిన బాలీవుడ్ స్టార్..

War 2: వార్ 2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫొటోస్ లీక్.. ఏమున్నాడ్రా బాబు

Big Stories

×