EPAPER

Baba Siddique Son: అజిత్ పవార్ పార్టీలో చేరిన బాబా సిద్దిఖ్ కుమారుడు.. ‘మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి రెడీ’

Baba Siddique Son: అజిత్ పవార్ పార్టీలో చేరిన బాబా సిద్దిఖ్ కుమారుడు.. ‘మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి రెడీ’

Baba Siddique Son| ఇటీవల కాల్పుల్లో చనిపోయిన ముంబై రాజకీయ నాయకుడు బాబా సిద్దిఖ్ కుమారుడు జీషాన్ సిద్దిఖ్ మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. శుక్రవారం అక్టోబర్ 25, 2024న జీషాన్ సిద్దఖ్ అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)లో చేరాడు. త్వరలో జరుగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వాంద్రే ఈస్ట్ నియోజకవర్గంలో ఎన్‌సీపీ తరపున పోటీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. 2019లో జీషాన్ సిద్దిఖ్ కాంగ్రెస్ పార్టీ తరపున వాంద్రే ఈస్ట్ నుంచే పోటీ చేసి విజయం సాధించడం గమనార్హం.


ఆగస్టులో జరిగిన మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్ల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న జీషాన్ సిద్దిఖ్ పార్టీకి వ్యతిరేకంగా బిజేపీ, అజిత్ పవార్ ఎన్‌సీపీ, షిండే శివసేన కూటిమి అభ్యర్థులకు తన ఓటు వేశాడు. దీంతో కాంగ్రెస్ హై కమాండ్ అతడిని పార్టీని వెలివేసింది.

Also Read: రాజకీయాలను జయించిన ప్రేమ.. పాక్ యువతిని పెళ్లాడిన బిజేపీ నాయకుడి కుమారుడు..


జీషాన్ సిద్దిఖ్ తండ్రి బాబా సిద్దిఖ్ కూడా మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. కానీ కొంతకాలం క్రితమే అజిత్ పవార్ పార్టీలో చేరారు. అక్టోబర్ 12, 2024న బాబా సిద్దిఖ్‌పై కొందరు క్రిమినల్స్ బహిరంగంగా కాల్పులు జరిపారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బాబా సిద్దిఖ్ మరణం తరువాత జీషాన్ సిద్దిఖ్ ప్రస్తుతం తండ్రి బాటలోనే అజిత్ పవార్ పార్టీలో చేరడం గమనార్హం.

మహారాష్ట్ర ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యుబిటి), కాంగ్రెస్, షరద్ పవార్ ఎన్సీపీ పార్టీలు.. మహావికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. జీషాన్ సిద్దిఖ్ కు పోటీగా వాంద్రే ఈస్ట్ నియోజకవర్గంలో మహావికాస్ అఘాడీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్ ఎన్నికల బరిలో ఉన్నాడు.

అజిత్ పవార్ పార్టీలో చేరిన తరువాత జీషాన్ సిద్దిఖ్ మహావికాస్ అఘాడీ కూటమిపై విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ”మా నాన్న చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోలేదు. నా కష్ట కాలంలో తోడుగా నిలబడ్డ.. అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ టట్కరేగారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. నాకు పార్టీ(అజిత్ పవార్ ఎన్సీపీ)లో చోటు ఇచ్చారు. ఇది నాకు, నా కుటుంబానికి చాలా ప్రత్యేక దినం. నేను వాంద్రే ఈస్ట్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయబోతున్నా. నాకు పోటీగా పాత స్నేహితులు (కాంగ్రెస్) వారి అభ్యర్థిని బరిలోకి దింపారని తెలిసింది. నాకు మద్దుతు తెలపాలనే ఉద్దేశం వారెప్పటికీ లేదు. నాకు ప్రజల ప్రేమ, సహకారాలు లభిస్తాయని నమ్మకం ఉంది. నేను తప్పకుండా వాంద్రే ఈస్ట్ ని మళ్లీ గెలుచుకుంటా” అని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు మహావికాస్ అఘాడీలోని మూడు పార్టీలు కూడా మొత్తం 288 సీట్లలో పోటీకి సిద్ధమయ్యాయి. మూడు పార్టీలు కూడా నవంబర్ 20న జరుగబోయే ఎన్నికల్లో 18 సీట్లు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించి మిగతా 270 సీట్లలో సరిసమానంగా పోటీ చేయబోతున్నాయి.

Related News

Teachers In Obscene Act: క్లాస్‌రూమ్‌లో టీచర్లు అలాంటి పాడుపని.. విద్యార్థులు రావడంతో..

Anmol Bishnoi Most Wanted: అన్మోల్ బిష్ణోయి తలపై రూ.10 లక్షల బహుమానం.. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో పేరు

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Supreme Court: తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

RAJNATH SINGH : గస్తీ ఒప్పందం విజయవంతంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు… చర్చలకు ఉండే శక్తే వేరు అంటూ కితాబు

Bengaluru Traffic: బెంగళూరులో ప్రత్యక్ష నరకం, రోడ్ల మీదే కార్లు వదిలేసి వెళ్లిపోయిన టెక్కీలు!

Big Stories

×