EPAPER

Pushpa 2 Remuneration : పుష్పగాడి రేంజే వేరబ్బా.. అందుకే అన్ని రూ.కోట్లు..!

Pushpa 2 Remuneration : పుష్పగాడి రేంజే వేరబ్బా.. అందుకే అన్ని రూ.కోట్లు..!

Pushpa 2 Remuneration  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న సుకుమార్ (Sukumar) తన దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, రష్మిక మందన్న(Rashmika mandanna) హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం పుష్ప (Pushpa ). బాలీవుడ్ లో ఎటువంటి మార్కెట్ లేకున్నా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ సినిమా.. సీక్వెల్ ని ఇప్పుడు భారీ బడ్జెట్ తో చిత్ర బృందం విడుదల చేయడానికి సిద్ధమయ్యింది. ఎప్పుడో ఆగస్టు 15న విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ డిసెంబర్ 6కి విడుదల చేద్దాం అని ప్రకటించారు.


అనుకున్న డేట్ కంటే ముందే విడుదల..

దీనికి తోడు అల్లు అర్జున్ లక్కీ నంబర్ 666 కావడంతో 12వ నెల 6వ తేదీ సినిమాను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయగా.. ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని మార్చడం జరిగింది. డిసెంబర్ 5వ తేదీన అంటే ఒకరోజు ముందే విడుదల చేస్తామని చెప్పి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు చిత్ర బృందం.


ఒక్క సినిమా కోసం మూడేళ్ల కేటాయింపు..

ఇకపోతే ఈ సినిమా కోసం దాదాపు 3 సంవత్సరాల సమయం కేటాయించారు. ఈ టైంలో రెండు సినిమాలు కూడా తీసేయవచ్చు. ఏది ఏమైనా ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఈ సినిమా కోసమే తన పూర్తి సమయాన్ని కేటాయించిన అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఎంత పారితోషకం తీసుకుంటున్నారు అనే వార్త వైరల్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ ఈ సినిమాకి పారితోషకం తీసుకోవడం లేదట. సినిమాలో వచ్చే షేర్ ని తీసుకోబోతున్నారని సమాచారం . అంటే టోటల్ సినిమా టర్నోవర్ లో 27% బన్నీకి వాట ఇవ్వాలన్నమాట.

రెమ్యునరేషన్ కాదు.. రూ.270 కోట్లు లాభం..

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా రూ .1000 కోట్లకు పైగా గ్రాస్ టర్నోవర్ వసూల్ చేసింది అంటే దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ కి రూ .250 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక సినిమా నిర్మాణానికి రూ 500 కోట్ల వరకు ఖర్చు అయి వుంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. అలాగే ఖర్చులు, బన్నీ పార్ట్ పోగా మిగిలిన దాంట్లో దర్శకుడుకి కూడా షేర్ ఇవ్వాలని సమాచారం. ఆ పైగా మిగిలినది నిర్మాతలకు లాభం అన్నమాట. వాస్తవానికి సినిమా విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ లో రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమా విడుదలైన తర్వాత వచ్చే కలెక్షన్లు నిర్మాతలకు భారీ లాభాన్ని అందించబోతున్నాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా మూడేళ్లు శ్రమపడి ఒక సినిమా కోసం పనిచేయడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అందుకే బన్నీ రేంజ్ పెరిగిందని, అందుకే ఈ సినిమా కోసం ఆయన రూ.270 కోట్లు దక్కించుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజం అయితే ఒక్క సినిమాతో 270 కోట్లు వసూల్ చేయడం తెలుగులో ఇదే ఫస్ట్ టైం అవుతుంది.

Related News

Priyanka Chopra : ఆ హీరోలతో ముద్దులు, నాతో మాత్రం హద్దులు… ప్రియాంక చోప్రాపై సీనియర్ నటుడి కామెంట్స్

Alia Bhatt: అలియాకు పక్షవాతం.. సిగ్గులేదు అంటూ మండిపడ్డ బ్యూటీ

Brahmanandam: స్టార్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన బ్రహ్మీ.. అసలు నిజం ఏంటంటే..?

Best Movie in This Week : ఈ రోజు విడుదలైన 7 సినిమాల్లో విన్నర్ ఎవరు..? ఇక్కడ ఓ లుక్ వేయండి.

Suriya : వద్దు అంటున్నా… హైట్ తక్కువ అంటూ స్టేజ్‌పైనే సూర్య పరువు మొత్తం తీసేసిన బాలీవుడ్ స్టార్..

War 2: వార్ 2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫొటోస్ లీక్.. ఏమున్నాడ్రా బాబు

Unstoppable 4 : బాలయ్య టాక్ షోకి ‘గేమ్ ఛేంజర్’… ఇది మామూలు ప్లాన్ కాదు భయ్యో

Big Stories

×