EPAPER

BRS: బీఆర్ఎస్ పేరు మార్చే యోచన, కేటీఆర్ సంకేతాలు .. మరి కలిసొస్తుందా?

BRS: బీఆర్ఎస్ పేరు మార్చే యోచన, కేటీఆర్ సంకేతాలు ..  మరి కలిసొస్తుందా?

BRS: బీఆర్ఎస్ పార్టీకి కాలం కలిసి రాలేదా? పార్టీ పేరుతోపాటు నేతలను మార్చే పనిలో పడిందా? ప్రస్తుతమున్న కారు గుర్తు డబ్బున్న వారికే వర్తిస్తుందా? పార్టీ అంతర్గత చర్చలో ఏం జరిగింది? కేసీఆర్ ఓకే చెప్పినట్టేనా? కేటీఆర్ ఇచ్చిన సంకేతాలు దేనికి? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ శ్రేణులను వెంటాడుతున్నాయి.


బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ మధ్య రకరకాల ఫీలర్లు వస్తున్నాయి. మొన్నటికి మొన్న పార్టీ జెండాలో కేసీఆర్ ఫోటోకు బదులు కేటీఆర్ కనిపించారు. ఎవరో అభిమానంతో చేసిందని చాలామంది భావించారు. కానీ, అంచనా ప్రకారమే పెట్టారట. దీనిపై పబ్లిక్ నుంచి రియాక్షన్ పెద్దగా లేకపోవడంతో.. దాన్ని అంచెలంచెలుగా అమలు చేయాలన్నది ఆ పార్టీ నుంచి ఇప్పుడు వినిపిస్తున్నమాట.

జెండాలో ఫోటోయే కాదు.. ఇప్పుడు పార్టీ పేరు సైతం మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. గురువారం ఆదిలాబాద్‌లో చేపట్టిన రైతు పోరు సభలో కేటీఆర్ దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అంటే రాష్ట్ర సమితి కాదని.. భారత రైతు సమితి వచ్చే విధంగా మాట్లాడారు. దీంతో పార్టీలో మార్పులు మొదలవుతున్నాయనే సంకేతాలు క్రమంగా బలపడుతున్నాయి.


గతంలో ఉన్న గుర్తు, పేరు కేసీఆర్‌కు కలిసొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు పాలించారు. ముఖ్యమంత్రి కావాలన్న కేసీఆర్ కోరిక సైతం నెరవేరింది. కాకపోతే కేసీఆర్ పెట్టిన పార్టీ జెండా గుర్తులు, పేరు కేటీఆర్‌కు కలిసిరాలేదన్నది పార్టీలో మరో వర్గం నుంచి బలంగా వినిపిస్తున్నమాట.

ALSO READ: ఐఏఎస్ అమోయ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, భూముల అక్రమాలపై తీగలాగుతున్న ఈడీ

ఇంతవరకూ ఓకే.. నేతల మాటేంటన్నది అసలు చర్చ. మిగతా పార్టీల నుంచి వచ్చినవారు కాకుండా, ప్రత్యేకంగా నేతలను తయారు చేసే పనిలో పడ్డారట కేటీఆర్. ముఖ్యంగా యువకులను పార్టీలోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారట. దీని సంబంధించి తెర వెనుక గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది.

ఉద్యమం నాటి నేతలు, వలస వచ్చిన నేతలను త్వరలో పక్కన పెట్టే ఛాన్స్ ఉందంటూ మరో ఫీలర్ బయటకు వచ్చింది. అందుకే నేతలు పార్టీ నుంచి వెళ్లిపోతున్నా, సైలెంట్‌గా ఉండటానికి కారణం అదేనని అంటున్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో బీఆర్ఎస్‌లో భారీ మార్పులు తప్పవనే సంకేతాలు బలపడుతున్నాయి.

Related News

KTR Vs Konda Sureka: కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ.. నాయస్థానం కీలక వ్యాఖ్యలు

IAS Officer Amoy Kumar: సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై మరో భూ కుంభకోణం ఫిర్యాదు.. ఏకంగా 1000 కోట్లట!

Ponds beautification: హైడ్రా టార్గెట్ ఫిక్స్.. ఫస్ట్ ఫేజ్‌లో నాలుగు చెరువుల సుందరీకరణ

Telangana Bjp: తెలంగాణ బీజేపీ నేతలకు టాస్క్ రెడీ.. నిరూపించుకుంటే పదవులు ఖాయం

Sunil Bansal on T BJP Leaders: బీజేపీ నేతలకు.. బన్సల్‌ ట్రీట్మ్‌మెంట్

TSquare designs: టీ-స్క్వేర్ డిజైన్లు.. పలు మార్పులు, వాటికే ఎక్కువ ఛాన్స్

Big Stories

×