EPAPER

YS Jagan: చిలకా ఏ తోడు లేకా బెంగళూరు వైపు ఒంటరి నడక..?

YS Jagan: చిలకా ఏ తోడు లేకా బెంగళూరు వైపు ఒంటరి నడక..?

మ్యాటర్ అక్కడితో ఆగితే పర్వాలేదనుకున్నారు. కానీ రాజకీయ వైకుంఠపాళిలో పెద్దపాము మింగే పరిస్థితికి వైసీపీ పరిస్థితి వచ్చిందంటున్నారు. అవును జగన్ ఇప్పుడు ఒంటరి అయ్యారు. ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఓవైపు ఇంట్లోనే ఆస్తుల కుంపటి రగులుతోంది. సొంత చెల్లెలే రాజకీయ ప్రత్యర్థి అయ్యారు. జగన్ పైనే అస్త్రాలు సంధిస్తున్నారు. ఆల్రెడీ మొన్నటి ఎన్నికల్లో చాలా డ్యామేజ్ జరిగింది కూడా. షర్మిల, సునీత ఇద్దరూ అన్నపైనే పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. ఇప్పుడు ఆస్తుల వ్యవహారం మరో హాట్ డిబేట్. వాటాల పంపకాల ఇష్యూ .. ఏపీలో రాజకీయంగా ప్రత్యర్థులకు మంచి అస్త్రాలుగా మారిపోయాయి. ప్రతి ఇంట్లోనూ ఉండేవే ఇవి అని జగన్ తనకు తాను ఎంతగా సర్ది చెప్పుకున్నా.. అందరి ఇంట్లో ఉండేవి వేరు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కథ వేరు. ఈ లాజిక్ జగన్-షర్మిల ఆస్తుల పంపకాల్లో పని చేయదంటున్నారు.

నిజానికి ఆస్తుల పంపకాల చుట్టూ మ్యాటర్ చాలా దూరం వెళ్తోంది. ఇప్పటికే జగన్ కు పొలిటికల్ గా చాలా డ్యామేజ్ జరిగింది. తాను సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల్లో వాటా ఇవ్వడమేంటన్నది జగన్ ప్రశ్న. అయితే ప్రత్యర్థులు మాత్రం తల్లికి, చెల్లికి న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. అది ఎన్నికల ఫలితాల్లో రిఫ్లెక్ట్ కూడా అయింది. ఇక ఈ ఎపిసోడ్ డైలీ సీరియల్ మాదిరిగా కంటిన్యూ అయితే జగన్ కు అసలుకే ఎసరు అన్న చర్చ కూడా నడుస్తోంది. కసాయి అన్న ముద్ర వేసేందుకు ప్రత్యర్థి పార్టీల నేతలు రెడీగా ఉన్నారు. తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడుస్తారా అన్న పాయింట్ నూ వినిపిస్తున్నారు.


సరే ఆస్తుల మ్యాటర్ కొద్దిసేపు పక్కన పెడుదాం. జగన్ కు చుట్టుకున్న మరో టెన్షన్ ఏంటంటే.. ఇన్నాళ్లూ తన వెనకే ఉన్నారనుకున్న నేతలంతా ఒక్కొక్కరుగా తమదారి తాము చూసుకుంటున్నారు. వలసలు పెరుగుతున్నాయి. వైసీపీలో సీనియర్లు ఒకరొకరుగా గుడ్ బై చెబుతుండడంతో జగన్‌కు సీనియర్ పొలిటీషియన్లు కరువై.. చివరికి సలహాదారులే మిగులుతారా అన్నది కూడా హాట్ డిబేట్ గా మారింది. ముఖ్యంగా పదవుల్లో ఉన్నవారు.. మాజీలైన నేతలు కూడా వైసీపీని వీడేందుకు క్యూకడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు.. ఇద్దరు మాజీ మంత్రులు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేదు. అంతటా ఇదే సీన్. అయితే టీడీపీ, లేదంటే జనసేనతో టచ్ లోకి వెళ్తున్నారు. ఇటీవలే పార్టీకి గుడ్ బై చెప్పిన వాసిరెడ్డి పద్మ ఎపిసోడ్ తో అసలు వలసలను ఆపాలని జగన్ అనుకోవడం లేదా అన్న పాయింట్ కూడా చర్చనీయాంశమవుతోంది. పార్టీ వీడుతూ వాసిరెడ్డి పద్మ చేసిన కామెంట్స్ ఏంటంటే.. మద్యం పేరిట పేద ప్రజలను దోచుకున్నారని, ఐదేళ్ల పాలనలో ఎప్పుడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, వైసీపీలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, గుడ్‌ బుక్‌ పేరుతో జగన్‌ మరోసారి మోసానికి రెడీ అయ్యారని ఫైర్ అయ్యారు. అదీ మ్యాటర్.

Also Read:  తారాస్థాయికి అన్నా, చెల్లి ఆస్తి వివాదం.. కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం

ఇవన్నీ ఇలా ఉంటే ఇంకోవైపు కోర్టు కేసుల్లోనూ కదలిక వస్తోంది. ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఎక్కడ బెయిల్ రద్దు అవుతుందోనన్న టెన్షన్ కూడా పెరుగుతోందంటున్నారు. సో ఒకటి రెండు దిక్కులు కాదు అష్ట దిక్కుల నుంచి జగన్ కు సవాళ్లు పొంచి ఉన్నాయి. గండాలు ముంచుకొస్తున్నాయి. జగన్ బెంగళూరులో ఫుల్ టైమ్.. తాడేపల్లిలో పార్ట్ టైమ్ ఇదీ టీడీపీ నేతల కామెంట్స్. ఎందుకంటే ప్రయాణాలు అలా ఉన్నాయి మరి. మాట మాట్లాడితే యలహంక ప్యాలెస్ లో మకాం వేస్తున్నారు. అక్కడ ఎవరెవరితో చర్చలు జరుపుతున్నారు.. ఏం చేస్తున్నారన్నది టాప్ సీక్రెట్ గా మారుతోంది. ప్రతి వారం కచ్చితంగా బెంగళూరు వెళ్లాల్సిందే అన్నట్లు ప్రయాణం పెట్టుకుంటున్నారు. గత వారం బెంగళూరులో వరదల కారణంగా వెళ్లలేదన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ ను ఇదే ఇష్యూపై నిలదీశారు. విమర్శలు చేశారు. మాట మాట్లాడితే హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారంటూ ప్రశ్నించారు. తీరా ఇప్పుడు సీన్ అపోజిషన్ కు మారే సరికి జగన్ బెంగళూరు ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారా అన్న ప్రశ్నలు టీడీపీ నుంచి వస్తున్నాయి.

పవన్ కల్యాణ్ నైతే పార్ట్ టైం పొలిటీషియన్ అని జగన్ ఒక దశలో కౌంటర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు తాడేపల్లికి జగనే పార్ట్ టైమ్ అవుతున్నారా అన్న చర్చలు ఆ పార్టీలు తెరపైకి తెస్తున్నాయి. నిజానికి అప్పుడప్పుడు ఏవైనా ఇన్సిడెంట్లు ఉంటే జగన్ పరామర్శలతో సరిపెడుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వైసీపీపై టీడీపీ, జనసేన నుంచి భారీగా కౌంటర్లు పడుతున్నాయి. అయితే వైసీపీ నుంచి ఆ కౌంటర్లకు ఎన్ కౌంటర్ ఇచ్చే వారే లేకుండా పోతున్నారు. మైకుల ముందుకొచ్చి మాట్లాడే వారే కరువవుతున్నారంటున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిప‌క్షంలో ఉన్నా జ‌గ‌న్ ఒంట‌రిగానే కొన‌సాగుతున్నారు. వైసీపీ కార్యాలయం కూల్చివేత దగ్గర్నుంచి ఇప్పటిదాకా పెద్దగా ఖండించిన నేతలు లేరు. అయితే చాలా మందికి కేసుల భయం పట్టుకుందన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే నందిగం సురేశ్, కుక్కల విద్యాసాగర్, బోరుగడ్డ అనిల్ లాంటి వారు జైలులో ఉన్నారు. సజ్జల లాంటి వారిని పోలీసులు విచారిస్తున్నారు. సో కేసులు.. కోర్టులు విచారణలంటూ తిరుగుతున్నారు. ఇంకొందరైతే రాష్ట్రం వదిలేసి తమ సొంత పనులు చూసుకునేందుకు వెళ్లిపోతున్నారంటున్నారు. సిచ్యువేషన్ ఇలాగే ఉంటే పార్టీ సంగతేంటన్న ప్రశ్నలూ వస్తున్నాయి.

జ‌గ‌న్ ఒంట‌రి.. సింహం సింగిల్‌గా వ‌స్తుందంటూ వైసీపీ గతంలో ఊద‌ర‌గొట్టింది. చివ‌రికి ఎన్నిక‌ల్లో బొక్క బోర్లా ప‌డింది. అధికారం అండ‌గా ఉన్నప్పుడు ఏ పార్టీకి, ఏ నాయ‌కుడికీ ఇత‌రులు క‌నిపించ‌రు. వారితో అవ‌స‌రం ఉంటుంద‌ని కూడా అధికారంలో ఉన్న నాయ‌కుల‌కు అనిపించ‌దు. అధికారం కోల్పోయిన‌ప్పుడు, అంత కాలం జేజేలు కొట్టిన వాళ్లంతా దూర‌మైన‌ప్పుడు, భ‌విష్యత్ అంధ‌కారంగా క‌నిపిస్తుంది. చీక‌ట్లో చిరుదీపం వెలిగించే వ్యక్తి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పొజిషన్ లో వైసీపీ ఉందా అన్న డౌట్లు వినిపిస్తున్నాయి.

Related News

Nellore Politics: సై అంటే సై.. నెల్లూరు మంత్రుల మధ్య ఇసుక దుమారం

Mekathoti Sucharitha: వైసీపీకి మరో ‘మేడమ్‌’ గుడ్ బై..

Iran Israel War: ప్రాణ మిత్రులు బద్ద శత్రువులు ఎలా అయ్యారు? ఇరాన్-ఇజ్రాయెల్ నడుమ చిచ్చు ఎలా మొదలైంది?

Kavitha: కవితకు ఏమైంది? సవాలు చేసి సైలెంట్ అయ్యారు ఎందుకు?

Salman Khan: సల్మాన్ నిజంగానే ఆ జింకను కాల్చాడా? ఆ రోజు అతనితో ఉన్న హీరోయిన్స్ ఎవరు? వారికీ ముప్పుందా?

Chandrababu Vision: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ తో ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో తెలుసా? హైదరాబాద్‌కు విశాఖ ప్రత్యామ్నాయం కానుందా?

Big Stories

×