EPAPER

Raja Saab : ప్రభాస్ తాత గెటప్ వెనుక ఇంత కథ ఉందా.. మారుతి ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

Raja Saab : ప్రభాస్ తాత గెటప్ వెనుక ఇంత కథ ఉందా.. మారుతి ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

Raja Saab : రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD (Kalki 2898 AD)  సినిమా తర్వాత ఊహించని ఇమేజ్ సొంతం చేసుకొని ఇప్పుడు వరస పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన రాజా సాబ్, ఫౌజీ, కల్కి 2, సలార్ 2 , స్పిరిట్ వంటి చిత్రాలు లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూటింగ్ పూర్తిచేసే పనిలో పడ్డారు. వచ్చే ఏడాది 2025 ఏప్రిల్ 10వ తేదీన సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నహాలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో సినిమాపై హైప్ పెంచడానికి చిత్ర బృందం సినిమా నుంచి అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాజాసాబ్ నుంచి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.


మోషన్ పోస్టర్ తో రికార్డ్ సృష్టించిన రాజాసాబ్..

ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ కి విపరీతమైన స్పందన లభించింది. విడుదలైన 24 గంటల్లోనే 8.3 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు విడుదలైన ఏ సినిమా మోషన్ పోస్టర్ కి కూడా ఈ రేంజ్ లో వ్యూస్ రాలేదు అనడంలో సందేహం లేదు. అయితే ఇదిలా ఉండగా మోషన్ పోస్టర్ చూసిన కొంతమంది ఇందులో ప్రభాస్ తాత గెటప్లో ఉన్నాడంటూ కామెంట్లు చేశారు. దీనికి తోడు నెగిటివ్ కామెంట్లు చేసే వారి సంఖ్య ఎక్కువయ్యింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తాత గెటప్ వెనుక ఉన్న అసలు కారణాన్ని చిత్ర బృందం రివీల్ చేసినట్లు సమాచారం. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.


రాజాసాబ్ లో ప్రభాస్ ద్విపాత్రాభినయం..

ప్రముఖ డైరెక్టర్ మారుతీ (Marithi) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రిద్దీ కుమార్ (Riddhi Kumar), మాళవిక మోహనన్ (మలవిక mohanan), నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్లుగా హార్రర్, కామెడీ రొమాంటిక్ జానర్లో తెరకెక్కిన చిత్రం రాజా సాబ్ (Rajasaab ). ఇక ఈ సినిమాలో తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్లో ప్రభాస్ సింహాసనం మీద కూర్చొని చేతిలో సిగార్ తో రాజు లుక్ లో చాలా కొత్తగా కనిపించి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. అదే సమయంలో హార్రర్ నేపథ్యం ఉన్న సినిమా అని, ఈ మోషన్ పోస్టర్ ద్వారా రివీల్ చేయడం జరిగింది. అయితే ఈ పాత్ర సినిమాలో ఎప్పుడు కనిపించనుంది అనే చర్చ మొదలయ్యింది. ఇక దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని చెప్పవచ్చు. ఇంతకుముందు విడుదల చేసిన గ్లింప్స్ లో చూపించినట్టు యంగ్ క్యారెక్టర్ ఒకటైతే, ఇప్పుడు రాజు గెటప్ లో చూపించిన క్యారెక్టర్ ఇంకొకటి.

తాత గెటప్ వెనుక అసలు కథ ఇదే..

ఇప్పుడు హీరో పాత్రను రెండు రకాలుగా చూపించేసరికి జనాలకు చంద్రముఖి, నాగవల్లి సినిమాలు గుర్తుకు వస్తున్నాయని అదే సమయంలో ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. దీనికి తోడు సోషల్ మీడియా ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. మహారాజు పాత్ర ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వస్తుందని, సాలిడ్ ఉండే ఈ గెటప్ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ పాత్ర కి తాత పాత్ర గా రివీల్ చేస్తారని కూడా చెబుతున్నారు. అంతే కాదు ఈ భాగం అరగంట వరకు ఉండవచ్చని , ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ చాలా క్రేజీగా ఉంటారని , డైలాగ్ డెలివరీ, మేనరిజం కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయని చెబుతున్నారు అంతేకాదు ప్రభాస్ ను ఇప్పటి వరకు ఎవరు అలా చూసి ఉండరు అని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఇంత పగడ్బందీగా ప్లాన్ చేస్తున్న మారుతి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

War 2: వార్ 2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫొటోస్ లీక్.. ఏమున్నాడ్రా బాబు

Unstoppable 4 : బాలయ్య టాక్ షోకి ‘గేమ్ ఛేంజర్’… ఇది మామూలు ప్లాన్ కాదు భయ్యో

Laggam Movie Review : ‘లగ్గం’ మూవీ రివ్యూ

Chiranjeevi : 28న చిరుకు అక్కినేని పురస్కారం… ఎవరి చేతుల మీదు గానో తెలుసా..?

RajaSaab: ఇద్దరు కాదు.. ముగ్గురు అంట.. తాతమనవడు.. ఇంకా.. ?

Kannappa : శివయ్యా… నీపైనే భారమంతా… కేదారనాథ్ యాత్రలో కన్నప్ప టీం..

Suriya: టాలీవుడ్ సీనియర్ హీరోల చుట్టూ తిరుగుతున్న తమిళ్ హీరో.. బాగానే ప్లాన్ చేశాడుగా..?

Big Stories

×