EPAPER

Diwali bonus: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. నేడే ఖాతాల్లో నగదు జమ

Diwali bonus: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..  నేడే ఖాతాల్లో నగదు జమ

Diwali bonus for Singareni employees: సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సింగరేణి సంస్థలో దీపావళి బోనస్‌గా పిలవనున్న పీఎల్ఆర్ఎస్ ప్రోడక్షన్ లింక్డ్ రివార్డ్ స్కిమ్ సింగరేణి కార్మికులకు నేడు బోనస్ చెల్లిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. ఈ మేరకు సింగరేణి సంస్థ రూ.358కోట్లను విడుదల చేయాలని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్‌ను ఆదేశించారు.


గతేడాది చెల్లించిన దీపావళి బోనస్ కంటే ఇది రూ.50కోట్లు అధికం కావడం విశేషం. నేడు మధ్యాహ్నంలోగా దీపావళి బోనస్‌ను కార్మికుల ఖాతాల్లో జమ చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.

దీపావళి బోనస్ కింద ఒక్కొక్క కార్మికుడు రూ.93,750 అందుకోనున్నారు. దీపావళి బోనస్ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 40వేల మంది కార్మికులకు వర్తించనుంది. జేబీసీసీఐ విధానాల్లో భాగంగా కంపెనీలు సాధించిన ఉత్పత్తి పరిమాణం ఆధారంగా కార్మికుల శ్రమకు ప్రోత్సాహకంగా ఈ బోనస్ ను చెల్లించే పద్ధతి గత కొన్నేళ్లుగా అమలులో ఉంటోంది.


ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దీపావళి పండుగకు ముందే చెల్లింపులు జరిగేలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలిచ్చారు. కాగా, ఇటీవల సింగరేణి ఉద్యోగులందరికీ 33 శాతం లాభాల వాటా కింద రూ.796కోట్ల కంపెనీ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఒక్కొక్క కార్మికుడికి సగటున లక్షా 90వేల అందాయి.దీంతో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రూ.5వేల చొప్పున చెల్లించారు.

Also Read:  సీఎం రేవంత్ టూర్ ఫలితాలు .. ముందుకొచ్చిన కొరియా షూ కంపెనీ

అలాగే పండుగ అడ్వాన్స్ కింద ఒక్కొక్క కార్మికుడికి సగటున రూ.93,750లు లభించనున్నాయి. మొత్తం మీద ఈ నెల రోజుల వ్యవధిలో దీపావళి బోనస్, లాభాల వాటా, పండుగ అడ్వాన్స్ కింద రూ.1,250 కోట్లను కంపెనీ చెల్లించింది. ఈ విధంగా సగటున సింగరేణి ఉద్యోగులు ఈ నెల రోజుల కాలంలో ఒక్కొక్కరు సుమారు మూడు లక్షల వరకు అందుకున్నారు. బోనస్ చెల్లింపుపై తగు ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ అధికారులను ఆదేశించారు.

Related News

KTR Vs Konda Sureka: కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ.. నాయస్థానం కీలక వ్యాఖ్యలు

IAS Officer Amoy Kumar: సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై మరో భూ కుంభకోణం ఫిర్యాదు.. ఏకంగా 1000 కోట్లట!

Ponds beautification: హైడ్రా టార్గెట్ ఫిక్స్.. ఫస్ట్ ఫేజ్‌లో నాలుగు చెరువుల సుందరీకరణ

Telangana Bjp: తెలంగాణ బీజేపీ నేతలకు టాస్క్ రెడీ.. నిరూపించుకుంటే పదవులు ఖాయం

Sunil Bansal on T BJP Leaders: బీజేపీ నేతలకు.. బన్సల్‌ ట్రీట్మ్‌మెంట్

TSquare designs: టీ-స్క్వేర్ డిజైన్లు.. పలు మార్పులు, వాటికే ఎక్కువ ఛాన్స్

BRS: బీఆర్ఎస్ పేరు మార్చే యోచన, కేటీఆర్ సంకేతాలు .. మరి కలిసొస్తుందా?

Big Stories

×