EPAPER

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అది తినకుండా రోజును ప్రారంభిస్తే ఏమవుతుందంటే?

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అది తినకుండా రోజును ప్రారంభిస్తే ఏమవుతుందంటే?

Breakfast: వైద్యుల నుంచి పోషకాహార నిపుణుల వరకు అందరూ ముఖ్యమైన భోజనం బ్రేక్ ఫాస్ట్ అని చెబుతారు. ఖచ్చితంగా దాన్ని స్కిప్ చేయకుండా తినమని అంటారు. ఇలా ఎందుకు చెబుతారో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. అల్పాహారాన్ని చక్రవర్తిలా తినాలని, మధ్యాహ్న భోజనాన్ని రాజుల తినాలని, రాత్రి భోజనాన్ని పేదవాడిలా తినాలని చెప్పుకుంటారు. అంటే అల్పాహారంలో అధిక పోషకాహారాన్ని తీసుకోవాలని, మధ్యాహ్న భోజనం తక్కువగా తినాలని, రాత్రి భోజనం ఇంకా తక్కువగా తినాలని అర్థం. రోజులో అల్పాహారమే అత్యంత ముఖ్యమైన భోజనంగా చెప్పుకుంటారు. బ్రేక్ ఫాస్ట్‌కు ఇంత ప్రాధాన్యత ఎందుకు?


బ్రేక్ ఫాస్ట్ అంటే ఇదే
అల్పాహారాన్ని ఆంగ్లంలో బ్రేక్ ఫాస్ట్ అంటారు. అంటే బ్రేక్ + ఫాస్ట్ అని అర్థం. మునుపటి రోజు రాత్రి భోజనం చేశాక మనం పెద్ద బ్రేక్ తీసుకుంటాము. ఆ సమయంలో మన శరీరం ఉపవాసం ఉంటుంది. రాత్రిపూట ఆహారం తీసుకున్న తర్వాత మీ శరీరంలోని శక్తి నిల్వలు తక్కువగా ఉంటాయి. ఆ రోజు రాత్రంతా మీరు ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు. కాబట్టి శరీరం చాలాసేపు ఉపవాసమే చేస్తుంది. అలాంటప్పుడు మరుసటి రోజు ఆ లాంగ్ గ్యాప్ తర్వాత తినే ఆహారం పోషకాలతో నిండి ఉండాలి. అది ఎంతో ముఖ్యమైనదిగా భావించాలి.

బ్రేక్ ఫాస్ట్‌లో మీరు తినే ఆహారాన్ని శరీరంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు అల్పాహారంలో ప్రోటీన్ ఆహారాన్ని తింటే ఆ రోజంతా శరీరం ఉత్సాహంగా సాగుతుంది. అదే అధిక చక్కెర ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఆ రోజంతా మీరు నీరసంగా, మత్తుగా ఉంటారు. అందుకే అల్పాహారంలో పోషకాహారాన్ని తినాల్సిన అవసరం ఉంది


బ్రేక్ ఫాస్ట్ మానేస్తే ఏమవుతుంది?
బ్రేక్ ఫాస్ట్ మానేస్తే అలసట, చిరాకు పెరిగిపోతుంది. ఏకాగ్రత లోపం కూడా వస్తుంది. రోజులో మీరు మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం మానేసినా ఫర్వాలేదు. కానీ అల్పాహారాన్ని మాత్రం ఖచ్చితంగా తినండి. ఇది ఆ రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా పనిచేసేలా చేస్తుంది. శరీరానికి నీరసాన్ని ఇవ్వదు. అలాగే పోషకాహార లోపాలు, జీవక్రియ అసమతుల్యతలు వంటివి కూడా రాకుండా ఇది అడ్డుకుంటుంది.

అల్పాహారంలో సమతుల్య ఆహారం తినడంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ప్రోటీన్లు నిండిన ఆహారాన్ని తినాలి. ప్రోటీన్లతో పాటు మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు మీరు తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. బలవర్ధకమైన తృణధాన్యాలు అల్పాహారంలో తినడం వల్ల ఆరోగ్యానికి అంతా మేలే జరుగుతుంది.

మీరు ఎప్పుడైతే బ్రేక్ ఫాస్ట్ మానేస్తారో ఆ రోజు మీరు తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకే అసహనం చూపిస్తారు. ఆ రోజంతా శరీరానికి అసౌకర్యంగా అనిపిస్తుంది. మధ్యాహ్న భోజనం ఎక్కువగా తిన్నా కూడా అల్పాహారం తినని లోపం మీకు తెలుస్తూనే ఉంటుంది.

Also Read: మిల్ మేకర్‌తో మంచూరియా ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు

బరువు పెరగకుండా సరైన బరువుతో ఉండాలనుకుంటే అల్పాహారాన్ని కచ్చితంగా తినాల్సిన అవసరం ఉంది. క్రమం తప్పకుండా అల్పాహారం తినడం అనేది బరువు నిర్వహణతో మునిపడి ఉందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. ఆరోగ్యకరమైన అల్పాహారం తినే వ్యక్తులు మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. ఎవరైతే బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తారో వాళ్లకి మధ్యాహ్నం, రాత్రి భోజనంలో ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాలు తినాలనిపిస్తుంది. అలాగే చక్కెర నిండిన పదార్థాలు కూడా తినాలనిపిస్తుంది. ఇవి బరువును త్వరగా పెంచేస్తాయి.

కాబట్టి వీలైనంత వరకు బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయకుండా ఉండేందుకే ప్రయత్నించండి. ఇది మీ ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది.

Related News

Face Serum: నారింజ తొక్కలతో ఫేస్ సీరం.. అందమైన చర్మం మీ సొంతం

Frogs Health Benefits: కప్పలు తింటే ఇన్ని లాభాలున్నాయా? పదండ్రా పట్టుకొద్దాం!

Pimples On Face: వీటిని వాడితే మీ ముఖంపై మొటిమలు రమ్మన్నా.. రావు

Spotting and Periods: పీరియడ్స్‌కు, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను పీరియడ్స్ అనుకోవద్దు

Boneless Chicken Pickle: బోన్ లెస్ చికెన్ పికిల్ ఇలా సరైన కొలతలతో చేసి చూడండి రుచి అదిరిపోతుంది

Social Media Age Restriction: ఆ వయస్సు పిల్లలు మొబైల్ చూస్తే ఇక అంతే.. నార్వే సర్కార్ కీలక నిర్ణయం!

Big Stories

×