EPAPER

Spotting and Periods: పీరియడ్స్‌కు, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను పీరియడ్స్ అనుకోవద్దు

Spotting and Periods: పీరియడ్స్‌కు, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను పీరియడ్స్ అనుకోవద్దు

మహిళల్లో స్పాటింగ్, పీరియడ్స్ ఈ రెండూ జరుగుతూనే ఉంటాయి. పన్నేండేళ్ల ఆడపిల్లల్లో పీరియడ్స్ రావడానికి కొన్ని రోజుల ముందు లేదా నెలల ముందు స్పాటింగ్ కనిపిస్తుంది. అలా స్పాటింగ్ కనిపించిందంటే కొన్ని రోజుల్లో వారికి పీరియడ్స్ మొదలవుతాయని అర్థం చేసుకోవాలి. అలాగే మహిళల్లో కూడా ప్రతి నెలా పీరియడ్స్ వస్తున్నప్పటికీ అప్పుడప్పుడు స్పాటింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ స్పాటింగ్ అనేది లైట్ కలర్ లో ఉంటుంది. దాన్ని కూడా పీరియడ్స్ అనుకుంటారు. ఎంతోమంది కొన్ని చుక్కలు మాత్రమే స్రవించి స్పాటింగ్ ఆగిపోతుంది. కాబట్టి ప్రతి మహిళా స్పాటింగ్ కు, పీరియడ్స్ కు మధ్య తేడాను తెలుసుకోవాలి.


స్పాటింగ్ అంటే
స్పాటింగ్ అంటే పీరియడ్స్ మొదలవడానికి ముందు కనిపించే లక్షణం. రక్తం కొన్ని చుక్కలు మేరకు కనిపిస్తుంది. తర్వాత ఆగిపోతుంది. దీన్ని యోని రక్తస్రావం అని కూడా పిలుచుకోవచ్చు. స్పాటింగ్ అనేది సాధారణ పీరియడ్స్ తో పోలిస్తే చాలా తేలికగా ఉంటుంది. అంటే ఒక్కసారి మాత్రమే రెండు మూడు చుక్కల రూపంలో కనిపించి మాయమైపోతుంది. అప్పుడు స్రవించే రక్తం గులాబీ రంగులో లేదా గోధుమ రంగులో కూడా ఉండవచ్చు. ప్యాడ్స్ పెట్టుకోవాల్సిన అవసరం స్పాటింగ్ లో కనిపించదు. స్పాటింగ్ కనిపించినప్పుడు రొమ్ములు సున్నితంగా మారుతాయి. పొట్ట కూడా నొప్పిగా, అసౌకర్యంగా అనిపించవచ్చు.

గర్భంలో స్పాటింగ్
ప్రెగ్నెన్సీ లో కూడా స్పాటింగ్ కనిపించే అవకాశం ఉంది. దాన్ని పీరియడ్స్ గా భావించి భయపడేవారు. ఎక్కువమంది ఇది లేత గులాబీ రంగులో అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రకాశవంతమైన ముదురు రంగులో కూడా ఈ రక్తం కనిపిస్తుంది. గర్భం ధరించిన సమయంలో ఏ నెలలో అయినా స్పాటింగ్ కనిపించే అవకాశం ఉంది. అయితే ఎక్కువ కాలం పాటు ఇది జరగదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.


గర్భం ధరించిన తొలి రోజుల్లో కూడా కొంతమందికి స్పాటింగ్ కనిపిస్తూ ఉంటుంది. అండం ఫలదీకరణం చెందాక అది గర్భాశయ గోడకు అతుక్కునేందుకు ప్రయత్నిస్తుంది. ఆ సమయంలోనే స్పాటింగ్ కనిపించే అవకాశం ఉందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

పాలీసిస్టరీ ఓవరీ సిండ్రోమ్ అనే హార్మోన్ల సమస్యతో బాధపడే మహిళల్లో కూడా స్పాటింగ్ కనిపించే అవకాశం ఉంది. వీరికి సక్రమంగా పీరియడ్స్ రావు. దీనివల్ల కూడా అప్పుడప్పుడు స్పాటింగ్ కనిపిస్తుంది.

పెరిమెనోపాజ్
పెరిమెనోపాజ్ అంటే మెనోపాజ్ కు ముందు దశ. మీ శరీరం పీరియడ్స్ ను పూర్తిగా ఆపేయడానికి సిద్ధపడుతూ ఉంటుంది. అదే పెరీమెనోపాజ్ అందుకే ఈ దశలోనే అప్పుడప్పుడు స్పాటింగ్ కనిపిస్తూ ఉంటుంది.

Also Read: దీపావళి రోజు కొత్తగా కనిపించాలా ? ఈ టిప్స్ ఫాలో అయిపోండి

పీరియడ్స్ అంటే
ఇక పీరియడ్స్ విషయానికి వస్తే ప్రతి నెలా ఆరోగ్యకరమైన మహిళల్లో రుతుస్రావం జరుగుతూనే ఉంటుంది. ఇది కేవలం స్పాటింగ్ లాగా అలా కనిపించి మాయమైపోదు. రెండు నుంచి వారం పాటు రక్తస్రావం కనిపిస్తుంది. అలాగే కడుపు ఉబ్బరంగా అనిపించడం, రొమ్ములు సున్నితంగా మారడం, మూడు స్వింగ్స్ రావడం, తీవ్రంగా అలసిపోయినట్టు అనిపించడం, తలనొప్పి, జీర్ణ సమస్యలు వంటివి పీరియడ్స్ టైం లో కనిపిస్తాయి.

Related News

Frogs Health Benefits: కప్పలు తింటే ఇన్ని లాభాలున్నాయా? పదండ్రా పట్టుకొద్దాం!

Pimples On Face: వీటిని వాడితే మీ ముఖంపై మొటిమలు రమ్మన్నా.. రావు

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అది తినకుండా రోజును ప్రారంభిస్తే ఏమవుతుందంటే?

Boneless Chicken Pickle: బోన్ లెస్ చికెన్ పికిల్ ఇలా సరైన కొలతలతో చేసి చూడండి రుచి అదిరిపోతుంది

Social Media Age Restriction: ఆ వయస్సు పిల్లలు మొబైల్ చూస్తే ఇక అంతే.. నార్వే సర్కార్ కీలక నిర్ణయం!

Master Dating: మాస్టర్ డేటింగ్ అంటే ఏమిటీ? ఇందులో ఇంత పిచ్చ హ్యాపీనెస్ ఉంటుందా మామా?

Big Stories

×