EPAPER

Bengaluru Traffic: బెంగళూరులో ప్రత్యక్ష నరకం, రోడ్ల మీదే కార్లు వదిలేసి వెళ్లిపోయిన టెక్కీలు!

Bengaluru Traffic: బెంగళూరులో ప్రత్యక్ష నరకం, రోడ్ల మీదే కార్లు వదిలేసి వెళ్లిపోయిన టెక్కీలు!

Bengaluru Traffic Jam: గత కొద్ది రోజులుగా బెంగళూరులో కురుస్తున్న ఎడతెరపి వర్షాలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి రోజూ కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో రోడ్ల మీదే ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. బుధవారం నాడు కురిసిన భారీ వర్షాలు బెంగళూరు వాసులకు ప్రత్యక్ష నరకం చూపించాయి. నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టెక్ సంస్థల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చే సమయంలో ఈ ట్రాఫిక్ జాయ్ ఏర్పడ్డంతో గంటల తరబడి వాహనదారులు రోడ్ల మీదే నిలిచిపోయారు. ఎంతకీ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో చాలా మంది టెక్కీలు తమ కార్లను రోడ్లమీదే వదిలేసి వెళ్లిపోయారు.


ట్రాఫిక్ కష్టాలకు కేరాఫ్ బెంగళూరు

భారత్ లో అత్యంత ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొనే నగరం అనగానే బెంగళూరు గుర్తొస్తుంది. కొద్ది దూరం ప్రయాణించాలన్నా ముప్పుతిప్పలు పడాల్సి ఉంటుంది. ట్రాఫిక్ జామ్ ప్రయాణం బెంగళూరు వాసులకు కొత్తేమీ కాదు. సాధారణ సమయాల్లోనే ట్రాఫిక్ కష్టాలు ఉంటాయంటే, కాస్త వాన పడితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నగరం అంతా ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. కీలో మీటరు ప్రయాణించాలంటే గంటలు తరబడి రోడ్ల మీద పడిగాపుడు కాయాల్సి వస్తుంది. తాజాగా బెంగళూరులో అలాంటి దారుణ పరిస్థితి తలెత్తింది. బుధవారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లై ఓవర్ మీద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టెక్కీలు తమ ఆఫీస్ ముగించుకుని వచ్చే సమయంలో ట్రాఫిక్ జామ్ కావడంతో ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 3 గంటలకు పైగా ప్లై ఓవర్ మీదే వెయిట్ చేయాల్సి వచ్చింది. వెయిట్ చేసి చిరాకేసి చాలా మంది టెక్కీలు తమ కార్లను రోడ్డు మీదే వదిలేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో బెంగళూరు ట్రాఫిక్ జామ్ కు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరికైనా నరకంగా అనిపిస్తుందంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

కర్ణాటక రాజధానిలో భారీ వర్షం, ఐదురుగు మృతి

గత వారం రోజులుగా బెంగళూరులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. పలు కాలనీలు నీట మునిగాయి. సిటీలోని చాలా రోడ్లు నదులను తలపిస్తున్నాయి.  చాలా ప్రాంతాల్లో కార్లు, ఇతర వాహనాలు నీళ్లలో మునిగిపోయి. వరదల్లోనే నగరవాసులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు భారీ వర్షాల ధాటికి ఇప్పటి వరకు సుమారు 8 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇళ్లలోకి నీళ్లు రావడంతో చాలా మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Read Also: బెంగళూరులో భారీ వర్షం.. కుప్పకూలిన భారీ భవనం.. ఒకరు మృతి

Related News

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Supreme Court: తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

RAJNATH SINGH : గస్తీ ఒప్పందం విజయవంతంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు… చర్చలకు ఉండే శక్తే వేరు అంటూ కితాబు

Ajit Pawar : మహా ఎన్నికల్లో కీలక పరిణామం, అజిత్‌ పవార్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్, ఇక ఆ గుర్తు మీదే !

India Export Webley-455: మేడ్ ఇన్ ఇండియా తుపాకులు అమెరికాకు ఎగుమతి.. ఉత్తర్ ప్రదేశ్ లో తయారీ

Maharashtra Polls MVA: మహారాష్ట్రలో కుదిరిన ప్రతిపక్షాల పొత్తు.. ఇండియా కూటమి 85-85 సీట్ షేరింగ్‌

Big Stories

×