EPAPER

Frogs Health Benefits: కప్పలు తింటే ఇన్ని లాభాలున్నాయా? పదండ్రా పట్టుకొద్దాం!

Frogs Health Benefits: కప్పలు తింటే ఇన్ని లాభాలున్నాయా? పదండ్రా పట్టుకొద్దాం!

Frog Curry Health Benefits: కప్పలు తినడం భారత్ తక్కువే అయినా, విదేశాల్లో ఎక్కువగా తింటారు. చిన్న చిన్న హోటల్స్ మొదలుకొని, పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు రకరకాల కప్ప కూరలను అందుబాటులో ఉంచుతాయి. ముఖ్యంగా చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కప్పల మాంసాన్ని ఎక్కువగా తింటారు. ఇళ్లలో ఫ్రెష్ కప్పలతో రకరకాల వంటకాలు చేసుకుని కడుపు నిండా తినేస్తారు. కప్పల కర్రీ రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. ఇంతకీ కప్పల్లో ఉండే పోషక విలువలు ఏంటి? కప్పలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


కప్పల్లో ఉండే పోషక విలువలు

కప్ప మాంసంలో అధిక-నాణ్యత కలిగిన ప్రోటీన్(15-20%) ఉంటుంది. కొవ్వు(3-4%) స్వల్ప మోతాదులో ఉంటుంది. విటమిన్ B12, ఐరన్, జింక్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి.


కప్ప మాంసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కప్ప మాంసంలోని అధిక ప్రొటీన్ కంటెంట్ కండరాలు ఆరోగ్యంగా బలంగా పెరిగేలా చేస్తుంది. కప్ప మాంసంలోని విటమిన్ B12, ఐరన్ రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు రక్తహీనతలను దూరం చేస్తాయి. తక్కువ కొవ్వు పదార్థాలు, అధిక పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కప్ప మాంసంలోని విటమిన్ B12, ఐరన్, జింక్ మెదడును యాక్టివ్ గా ఉంచుతాయి. కప్ప మాంసంలోని యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ క్యాన్సర్ కారకాలను సమర్థవంతంగా అడ్డుకుంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎములకను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడంలో సాయపడుతాయి.

కప్పలు మాంసం తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎక్కడ పడితే అక్కడ దొరికే కప్పలను ఆహారంగా తీసుకోకూడదు. పురుగు మందులు లేని, సురక్షితమైన ప్రాంతం నుంచి తీసుకొచ్చిన వాటిని మాత్రమే ఉపయోగించాలి. కప్ప మాంసాన్ని చక్కగా ఉడికించాలి. కొన్ని కప్పలు టాక్సిన్స్, అలెర్జీ లక్షణాలను కలిగి ఉంటాయి. అలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కప్ప మాంసం అధికంగా తీసుకునే దేశాలు

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 రకాల కప్పలను కర్రీస్ కోసం వినియోగిస్తున్నారు. ఫ్రాన్స్, చైనా, సౌత్ ఈస్ట్ ఆసియాలో ఎక్కువగా కప్ప మాంసాన్ని తీసుకుంటారు. ఆసియా ఖండంలో చైనా, జపాన్, కొరియా, థాయ్ లాండ్, వియత్నం, కంబోడియా, లావోస్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, యూరప్ ఖండంలోని ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్, బల్గేరియా, ఆఫ్రికాలోని ఈజిఫ్ట్, మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, దక్షిణాఫ్రికా,  అమెరికా ఖండంలోని యుఎస్ఏ, మెక్సికో, బ్రెజిల్, పెరూ, ఈక్వెడార్ తో పాటు ఆస్ట్రేలియా, పుఫువా న్యూగినియాలో కప్ప మాంసాన్ని అధికంగా తీసుకుంటున్నారు.

గమనిక: ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహన కోసమే. వీటిని ఆహారంగా తీసుకొనే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ లైవ్’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Read Also: హిమాలయాల్లోని అరుదైన పాముకు ఆ రొమాంటిక్ హీరో పేరు పెట్టిన పరిశోధకులు.. అది అంత స్పెషలా?

Related News

Curry Leaves Hair Mask: కరివేపాకుతో హెయిర్ మాస్క్.. ఇది వాడితే జుట్టు రాలే సమస్యే ఉండదు

Face Serum: నారింజ తొక్కలతో ఫేస్ సీరం.. అందమైన చర్మం మీ సొంతం

Pimples On Face: వీటిని వాడితే మీ ముఖంపై మొటిమలు రమ్మన్నా.. రావు

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అది తినకుండా రోజును ప్రారంభిస్తే ఏమవుతుందంటే?

Spotting and Periods: పీరియడ్స్‌కు, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను పీరియడ్స్ అనుకోవద్దు

Boneless Chicken Pickle: బోన్ లెస్ చికెన్ పికిల్ ఇలా సరైన కొలతలతో చేసి చూడండి రుచి అదిరిపోతుంది

Big Stories

×