EPAPER

Nara Lokesh US Tour: అమెరికా వెళ్లిన నారా లోకేష్.. వారం రోజులు అక్కడే.. టార్గెట్ మాత్రం అదే!

Nara Lokesh US Tour: అమెరికా వెళ్లిన నారా లోకేష్.. వారం రోజులు అక్కడే.. టార్గెట్ మాత్రం అదే!

నేటి నుండి మంత్రి లోకేష్ యుఎస్ పర్యటన
పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం
వారం రోజుల పాటు అమెరికాలోనే..
దాదాపు రెండు వేల కోట్ల పెట్టుబడుల టార్గెట్
ఏపీని పారిశ్రామికంగా పరిగెత్తించడమే ధ్యేయం
లోకేష్ కు ఐటీ సర్వ్ అలయెన్స్ ఆహ్వానం
సినర్జీ సదస్సులో ప్రసంగించనున్న లోకేష్
డిజిటల్ స్టార్టప్ కంపెనీలకు ఆహ్వానం
హైటెక్ తరహాలో అమరావతి అడుగులు


అమరావతి, స్వేచ్ఛ: Nara Lokesh US Tour: ఏపీని గతంలో కన్నా అభిదృద్ధి పథంలో పరిగెత్తించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేటి నుంచి వారం రోజుల పాటు అమెరికా పర్యటించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత గడచిన ఐదేళ్ల కాలంలో ఏపీ పారిశ్రామికంగా అభివృద్ధి సాధించలేదు. నిరుద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. ఇన్నాళ్లూ రాజధాని లేకపోవడం కూడా మైనస్ గా మారింది. పారిశ్రామిక పురోభివృద్ధి జరిగినప్పుడే ఏ రాష్ట్రం అయినా ప్రగతి పథంలో ముందుంటుంది. హైదరాబాద్ అత్యంత వేగంగా డెవలప్ కావడానికి అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటీ పరిశ్రమకు మంచి ఊతం లభించింది. విదేశీ పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడ్డాయి. హైటెక్ సిటీ అని ఓ సరికొత్త నగరాన్ని పరిచయం చేసి అక్కడ ఐటీ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. దీనితో ఉద్యోగావకాశాలు పెరిగి నగరం నలుదిశలా అభివృద్ధి వేగవంతంగా జరిగింది. చంద్రబాబు ఆదేశానుసారం లోకేష్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

పారిశ్రామిక ప్రగతి


రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని త్వరితగతిన వృద్ధి చేసేందుకు=, భారీ తరహా ప్రాజెక్టులను అమరావతికి రప్పించేందుకు నేటు నుంచి వారం రోజుల పాటు అమెరికా పర్యటించనున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా భారీ ఎత్తున పారిశ్రామికవేత్తలను ఒప్పించి అమరావతిలో పరిశ్రమలు నెలకొల్పేలా చేయడమే లోకేష్ అమెరికా పర్యటన ముఖ్యోద్దేశం.

నిరుద్యోరగులకు భరోసా

ఒక పక్క పారిశ్రామిక ప్రగతి, మరో పక్క నిరుద్యోగ ఉపాధి రెండు లక్ష్యాలను సాధించే దిశగా లోకేష్ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకోబోతోంది. గత ఐదేళ్లుగా కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాక..ఉపాధి అవకాశాలు కోల్పోయిన యువత నిరాశానిస్పృహలతో ఉన్నారు. రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని లోకేష్ ఒక మహోన్నత లక్ష్యంతో అమెరికా సందర్శించనున్నారు. కాగా లోకేష్ ని అమెరికా సందర్శించాలని ఐటీ సర్వ్ అలయెన్స్ మంత్రి లోకేష్ కి అమెరికా రావలసిందిగా ఇన్విటేషన్ పంపింది. సినర్జీ సమావేశంలో లోకేష్ ఇచ్చే సలహాలు, విలువైన సూచనలు ఎంతగానె ఉపయుక్తంగా ఉంటాయని తమ ఆహ్వాన లేఖలో పేర్కొన్నారు నిర్వాహకులు.

పాత పరిచయాలు

లోకేష్ చదువుకుంది స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో. అందుకే అమెరికాలో లోకేష్ కు పరిచయాలు కూడా ఎక్కువే. ఇప్పుడు ఆ పరిచయాలను ఉపయోగించుకుని బడా పారిశ్రామిక వేత్తలను పెద్ద స్థాయిలో ఏపీకి తీసుకురావాలని చూస్తున్నారు. రూ.1500 నుంచి రెండు వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఈ టూర్ సాగనుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి కావలసిన అనుమతులు, స్థలాలు సమకూర్చి వారికి పారిశ్రామిక సరళీకృత విధానాలలో అన్ని అనుమతులు లభ్యమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు లోకేష్.

Also Read: YS Vivekananda: డబ్బు మహా పాపిష్టిది.. జగన్ ఆస్తుల వివాదంపై వైఎస్ వివేకా ఆత్మ ట్వీట్, అదెలా సాధ్యం?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు

లోకేష్ పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లడం సబబే కానీ..అమెరికాలో నవంబర్ లో జరిగే ఉపాధ్యక్ష ఎన్నికలలో నేతలంతా బిజీగా ఉంటారు. వారికి మద్దతు నిచ్చే పారిశ్రామిక వేత్తలు కూడా ఎన్నికల మూడ్ లోనే ఉంటారు. లోకేష్ పర్యటన ఎంతవరకూ సక్సెస్ అవుతుందో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయ్యాక కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అప్పుడు వెళితే ఏదైనా ఫలితం ఉండొచ్చని కొందరు సూచిస్తున్నారు. ఇప్పటికైతే లోకేష్ పర్యటన కేవలం విహారయాత్రలాగానే ఉంటుంది తప్ప పెట్టుబడులు ఆకర్షించేలా ఉండదని అంటున్నారు. ఒక వేళ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే..తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం ఎలాంటి నియమాలు అమలుచేస్తుందో తెలియదు. పెట్టుబడులు ఉపసంహరించుకోవాల్సిందిగా కూడా కోరే ప్రమాదం లేకపోలేదు.

Related News

TDP vs YCP: మాజీ సీఎం వైఎస్ జగన్ కు విషెస్ చెప్పిన టీడీపీ.. అయితే కాస్త వెరైటీగా..!

Tirumala Darshan Update Today: తిరుమలలో ఈ ఒక్క తప్పు చేయవద్దు సుమా.. ప్రస్తుతం దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

Diarrhoea Cases Palnadu: డయేరియా మరణాలపై ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి దిగిన మంత్రులు.. వైద్యశాఖ అప్రమత్తం

Jagan vs Sharmila: తారాస్థాయికి అన్నా, చెల్లి ఆస్తి వివాదం.. కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం

Chandrababu on Jagan: ఛీ.. ఛీ ఇలాంటి వారు రాజకీయాల్లోనా.. తల్లి, చెల్లిపై కేసులా.. ఒక్క నిమిషం చాలు నాకు.. జగన్ పై మండిపడ్డ సీఎం చంద్రబాబు

Chandrababu – Modi: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతికి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ మంజూరు

Big Stories

×