భారతదేశంలో ఎక్కువమంది ప్రజలు మాట్లాడే భాషలు ఇవే..

భిన్న సంస్కృతులు, భిన్న భాషల సమ్మేళనం భారతదేశం.

ఇండియాలో అత్యధికంగా 52.8 కోట్ల మంది హిందీ భాష మాట్లాడుతున్నారు.

హిందీ తరువాత అత్యధికంగా బెంగాలీ భాష మాట్లాడే వారి సంఖ్య 9.72 కోట్లు.

మూడో స్థానంలో మరాఠీ భాష ఉంది. మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో మొత్తం 8.3 కోట్ల మంది ఈ భాషను ఉపయోగిస్తారు.

8.11 కోట్ల మంది తెలుగు భాష మాట్లాడేవారున్నారు. ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో తెలుగు ఉపయోగంలో ఉంది.

అతిప్రాచీన భాష అయిన తమిళంలో మాత్రం 6.9 కోట్ల మంది మాట్లాడుతున్నారు.

5.54 కోట్ల మంది గుజరాతీ భాషలో మాట్లాడుతారు.

జమ్మూ కశ్మీర్, యూపి, బిహార్, తెలంగాణ, బెంగాల్ రాష్ట్రాల్లో 5.07 కోట్ల మంది ఉర్దూ భాష మాట్లాడుతున్నారు.