EPAPER

Diwali 2024: ఎటు చూసినా దివ్వెల వెలుగు జిలుగులే! దీపావళి వేడుకలు అట్టహాసంగా జరిగే ప్రదేశాలు ఇవే!

Diwali 2024: ఎటు చూసినా దివ్వెల వెలుగు జిలుగులే! దీపావళి వేడుకలు అట్టహాసంగా జరిగే ప్రదేశాలు ఇవే!

Diwali Celebrations 2024: దీపావళి. హిందువుల ప్రముఖ పండుగ. బంధు మిత్రులు అంతా ఒక్కచోట చేరి ఎంతో ఆనందంగా జరుపుకునే వేడుక. మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధతో నిర్వహించుకునే పర్వదినం. పిండి వంటలు, దివ్వెల వెలుగులు, పటాసుల మోతలతో అత్యంత వైభవంగా జరుపుకునే సంబురం. దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు కన్నుల పండువగా జరుగుతాయి. కొన్ని ప్రముఖ నగరాల్లో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ప్రభుత్వాలు దీపాల పండుగ నిర్వహించగా, మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలే స్వచ్ఛందంగా నిర్వహిస్తారు. ఇంతకీ మన దేశంలో ఘనంగా దీపావళి వేడుకలు జరిగే ప్రాంతాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..


అయోధ్య, ఉత్తర ప్రదేశ్

దేశంలో అత్యంత వైభవంగా దీపావళి వేడుకలు జరిగే నగరాల్లో శ్రీరాముడి జన్మస్థానం అయోధ్య ప్రథమ స్థానంలో ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ సర్కారు సరయు నది దీరంలో కోటి దీపోత్సవం నిర్వహిస్తుంది. దేశలోని నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు ఈ వేడుకలో పాల్గొని దీపాలు వెలిగిస్తారు. సరయు నది పరిసరాలన్నీ దీపాల వెలుగుల్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.


వారణాసి, ఉత్తర ప్రదేశ్

అత్యంత వైభవంగా దీపావళి పండుగ జరిగే మరో ప్రదేశం వారణాసి. ఉత్తర ప్రదేశ్ లోని ఈ పుణ్యక్షేత్రంలో గంగా నది తీరాన దీపాల అలంకరణ కనువిందు చేస్తుంది.

జైపూర్, రాజస్థాన్

దీపావళి వేడుకలు రాజస్థాన్ లోని జైపూర్ లో కన్నుల పండువగా జరుగుతాయి. రంగురంగుల దీపాలతో జైపూర్ కోట అత్యంత సుందరంగా కనిపిస్తుంది. దీపావళి సమయంలో ఇక్కడి మార్కెట్లకు దీపాల అలంకరణ పోటీలు నిర్వహిస్తారు.  అందంగా అంకరించిన మార్కెట్ కు అవార్డు అందజేస్తారు.

ఉదయ్ పూర్, రాజస్థాన్

దీపావళి పండుగ రోజున ఉదయ్ పూర్ కోటలు దీపాల కాంతులలో వెలిగిపోతాయి. పిచోలా సరస్సు చుట్టూ వెలిగించిన దీపాలు ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తాయి.

కోల్ కతా, పశ్చిమ బెంగాల్

దీపావళి అనగానే కాళీ మాత గుర్తొస్తుంది. కోల్ కతాలో దీపావళి సందర్భంగా ఎక్కడ చూసినా కాళీ మాత విగ్రహాలే దర్శనం ఇస్తాయి. దీపావళి రోజున కోల్ కతా వీధులు దీపాల వెలుగుతో మెరిసిపోతాయి.

గోవా

దీపావళి వేడుకలు గోవాలోనూ అద్భుతంగా జరుగుతాయి. దీపావళి రాత్రి ఇక్కడ నరకాసుర వధ నిర్వహిస్తారు. గోవా సంప్రదాయ సంగీంతం, నృత్యాలతో ప్రజలు కోలాహలంగా ఈ వేడుక నిర్వహించుకుంటారు.

అహ్మదాబాద్, గుజరాత్

దేశంలో దీపావళి సంబురాలు అత్యంత వైభవంగా జరిగే నగరాల్లో గుజరాత్ లోని అహ్మదాబాద్ ఒకటి. పండుగ సందర్భంగా ఇక్కడి వీధుల్లో ప్రత్యేకంగా డెకరేషన్ చేస్తారు. దీపాల కాంతుల్లో అహ్మదాబాద్ అద్భుతంగా మెరిసిపోతూ కనిపిస్తుంది.

ముంబై, మహారాష్ట్ర

ముంబైలోనూ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతాయి. ముంబై సముద్ర తీరంతో పాటు వీధులు రంగు రంగుల దీపాల కాంతుల్లో వెలిగిపోతుంటాయి. కళ్లు చెదిరేలా లైట్ షో నిర్వహిస్తారు. దీపోత్సవాల పోటీలు కూడా నిర్వహిస్తారు.

ఢిల్లీ

ఢిల్లీలోనూ దీపావళి వేడుకలు వైభవంగా కొనసాగుతాయి. సంప్రదాయం, ఆధునికత మేళవింపుగా ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఢిల్లీలోని చాందిని చౌక్, ఢిల్లీ హాట్, సరోజిని నగర్ మార్కెట్లు దీపాల కాంతులతో వెలిగిపోతాయి. అయితే, ఢిల్లీలో బాణాసంచా కాల్చడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి.

Read Also: దీపావళి పండుగను హ్యాపీగా జరుపుకోవాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పని సరి!

Related News

Elinati Shani: మకరరాశి వాళ్లు వచ్చే ఆరు నెలలు జాగ్రత్త.. లేదంటే..?

Temples: ఆ ఆలయంలో కొబ్బరి మొక్క నాటితే మగ పిల్లాడు పుడతాడట, గులాబీ మొక్క నాటితే ఆడపిల్ల పుడుతుందట

Lucky Rashi till December: దీపావళి నుండి క్రిస్మస్ వరకు వీరు రాజులా గడుపుతారు

Rahu Shani Nakshatra Gochar 2024 : శని-రాహువు అరుదైన పరివర్తన యోగం.. వీరికి అపారమైన సంపద రానుంది

Sun Transit Astrology: ఈ 3 రాశుల వారు సూర్యుడి దయతో సంతోషకరమైన సమయాన్ని పొందబోతున్నారు

Laxmi Narayan Yoga 2024: కేవలం మరో 5 రోజుల్లో ఈ 4 రాశుల వారు బుధుడి అనుగ్రహంతో కోటీశ్వరులు కాబోతున్నారు

Friday Lucky Zodiac: శుక్రవారం గౌరీ యోగం.. ఈ 5 రాశులపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది

Big Stories

×