EPAPER

Rajasaab: రికార్డు సృష్టించిన మోషన్ పోస్టర్.. 24 గంటల్లో అత్యధిక వీక్షణ..!

Rajasaab: రికార్డు సృష్టించిన మోషన్ పోస్టర్.. 24 గంటల్లో అత్యధిక వీక్షణ..!

Rajasaab.. ది రాజా సాబ్ (The Rajasaab) . రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. కల్కి 2898 ఏడి (Kalki 2898AD చిత్రం తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ప్రముఖ డైరెక్టర్ మారుతి (Maruthi)దర్శకత్వంలో రొమాంటిక్ , హార్రర్ , కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్లుగా రుద్ది కుమార్, నిధి అగర్వాల్ ,మాళవిక మోహనన్ నటిస్తున్నారు. అంతేకాదు మాళవిక మోహనన్ తొలిసారి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది.


ప్రభాస్ బర్త్ డే.. మోషన్ పోస్టర్ రిలీజ్.

రొమాంటిక్ – హార్రర్ – కామెడీ జానర్లో వస్తున్న చిత్రం కాబట్టి ప్రభాస్ అందంగా, ఆడంబరంగా కనిపించడానికి తనను తాను పూర్తిగా మార్చుకున్నారని చెప్పవచ్చు. దాదాపు రూ.200 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయడానికి డేట్ లాక్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా నిన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం. ఇందులో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించారు . ఎన్నడూ చూడని విధంగా హార్రర్ బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ కనిపించబోతున్నారు అని తెలిసి అభిమానులు సైతం సంతోష పడుతున్నారు. ముఖ్యంగా ఈ పోస్టర్ ఎంతమంది ప్రేక్షకులనైతే ఆకట్టుకుందో అంతేమంది వ్యతిరేకంగా మాట్లాడిన వారు కూడా ఉన్నారు.


పవన్ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేసిన రాజాసాబ్ మోషన్ పోస్టర్..

ఇందులో ప్రభాస్ గెటప్ తాత లా ఉందని, మోషన్ పోస్టర్ ఏమంత ఆకట్టుకోలేదు అంటూ కామెంట్ కూడా చేశారు. అయితే తాజాగా యూట్యూబ్లో మోషన్ పోస్టర్ సృష్టించిన రికార్డు ఇలాంటి వారి నోళ్లు మూయించింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా గత రికార్డులన్నీ కూడా బ్రేక్ చేస్తూ యూట్యూబ్లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన మోషన్ పోస్టర్ గా రికార్డులు సృష్టించింది రాజ సాబ్ మోషన్ పోస్టర్. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ బ్రో మూవీ మోషన్ పోస్టర్ 5.83 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది . దీనికి తోడు ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదు.

సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రాజాసాబ్ మోషన్ పోస్టర్..

అయితే రాజా సాబ్ మాత్రం ఈ రికార్డును కేవలం 19 1/2 గంటల్లోనే బ్రేక్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాలి. రాజాసాబ్ పోస్టర్ వీడియోకి 19.5 గంటలలో ఏకంగా 5.85 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే తాత గెటప్ లో ఉన్నాడు అంటూ నెగిటివ్గా కామెంట్లు చేసిన వారికి పై దెబ్బగా ఈ మోషన్ పోస్టర్ రికార్డులు సృష్టించిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ప్రభాస్ రేంజ్ అంటే ఇది అని, ఆయన ఏ గెటప్ లో ఉన్న ప్రేక్షకులు ఆదరిస్తారని మరొకసారి నిరూపించారు. అతి తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ రాబట్టిన మోషన్ పోస్టర్ గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ పోస్టర్.

Related News

Priyanka Chopra : ఆ హీరోలతో ముద్దులు, నాతో మాత్రం హద్దులు… ప్రియాంక చోప్రాపై సీనియర్ నటుడి కామెంట్స్

Alia Bhatt: అలియాకు పక్షవాతం.. సిగ్గులేదు అంటూ మండిపడ్డ బ్యూటీ

Brahmanandam: స్టార్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన బ్రహ్మీ.. అసలు నిజం ఏంటంటే..?

Best Movie in This Week : ఈ రోజు విడుదలైన 7 సినిమాల్లో విన్నర్ ఎవరు..? ఇక్కడ ఓ లుక్ వేయండి.

Suriya : వద్దు అంటున్నా… హైట్ తక్కువ అంటూ స్టేజ్‌పైనే సూర్య పరువు మొత్తం తీసేసిన బాలీవుడ్ స్టార్..

War 2: వార్ 2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫొటోస్ లీక్.. ఏమున్నాడ్రా బాబు

Unstoppable 4 : బాలయ్య టాక్ షోకి ‘గేమ్ ఛేంజర్’… ఇది మామూలు ప్లాన్ కాదు భయ్యో

Big Stories

×