OPPO Find X8 series : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 సిరీస్‌ను తీసుకురానుంది. ఈ ఎక్స్ 8 సిరీస్‌లో ఒప్పో ఫైండ్ ఎక్స్ 8, ఫైండ్ ఎక్స్ ప్రో ఉండనున్నాయి. అలానే ఈ సిరీస్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్‌ను ఇంట్రడ్యూస్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వివరాలను తెలుసుకుందాం.
ఒప్పో త్వరలోనే తీసుకురాబోతున్న ఎక్స్ 8 సిరీస్‌లో ఒప్పో ఫైండ్ ఎక్స్ 8, ఫైండ్ ఎక్స్ ప్రో లీక్డ్ స్పెసిఫికేషన్స్ స్మార్ట్ ఫోన్ ప్రియులను హోరెత్తిస్తున్నాయి. ఎప్పటిలాగే కొత్త మెుబైల్స్ లో సరికొత్త ఫీచర్స్ ను తీసుకువస్తుంది. ఈ ఫోన్ ధర తో పాటు స్పెషిఫికేషన్స్ సైతం వావ్ అనిపించేలా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం మీరు ఆ వివరాలపై ఓ లుక్కేయండి.
ఒప్పో ఫైండ్ ఎక్స్ 8, ఫైండ్ ఎక్స్ 8 ప్రో మీడియా టెక్ డైమన్సిటీ 9400 ఎస్ఓసీతో పని చేస్తాయి. ఫైండ్ ఎక్స్ 8 6.59 అంగుళాల ప్లాట్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే రిజల్యూ, 120 హెచ్‌జెడ్‌తో రానుంది. ప్రో మోడల్ వచ్చేసరికి 6.78 ఇంచ్, 2కే మైక్రో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెడ్జెడ్ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ల డిస్ ప్లేలు ఎల్టీపీఓ టెక్నాలజీని కూడా కలిగి ఉన్నాయి.
ALSO READ : వాట్సాప్ లో చిన్న సెట్టింగ్ మార్పుతో ఐదుగురికి కాదు.. ఒకేసారి అందరికీ శుభాకాంక్షలు పంపొచ్చని తెలుసా!
ఈ స్మార్ట్ ఫోన్లు 100డబ్ల్యూ వైర్డ్, 50డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. అయితే ప్రో మోడల్ బ్యాటరీ 5,910ఎమ్ఏహెచ్, స్టాండర్డ్ వేరియంట్‌తో (5,630 ఎమ్ఏహెచ్) పోలిస్తే కాస్త పెద్దది.
కెమెరా విషయానికొస్తే – ఎక్స్ 8 ప్రో మోడల్లో ఓఐఓ సపోర్ట్‌తో 50 మెగా పిక్సల్ సోనీ ఎల్వైటీ 800 ప్రైమరీ సెన్సర్ ఉంది. మెయిన్ కెమెరాలో 50 మెగా పిక్స్ల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో పాటు 50 మెగా పిక్సల్ టెలిఫొటో పెరిస్కోప్ లెన్స్ కూడా ఉన్నాయి. ఈ ఎక్స్ 8 ప్రో మోడల్‌కు 4 రియర్ కెమెరాస్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి టెలిఫొటో షూటర్, మరొకటి పెరిస్కోప్ లెన్స్. అంటే ఈ మోడల్లో రెండు డ్యుయెల్ పెరిస్కోప్ టెలిఫొటో సెటప్ ఉందన్నమాట. ఈ అడ్వాన్స్ సెటప్ ఫీచర్లో ఒక టెలిఫొటో లెన్స్ డిస్టంట్ ల్యాండ్‌స్కేప్ ఫొటోలను క్యాప్చర్ చేయగా, మరొకటి ప్రోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీ కోసం పనిచేస్తుంది. మొత్తంగా ఈ లెన్స్‌లు దూరంగా లేదా క్లోజ్ అప్ ప్రోర్ట్రెయిట్స్ను నేచురల్, రిఫైన్డ్ లుక్ ఫొటోస్‌గా మార్చి అందిస్తాయి.
ఎక్స్ 8 మోడల్లో స్టాండర్డ్ ట్రిపుల్ కమెరా సెటప్ ఉంది. 50 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 50 మెగా పిక్సల్ టెలిఫొటో, 50 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. మొత్తంగా ఈ ఎక్స్ 8 సిరీస్‌లో 32 మెగా పిక్స్ల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.
ఇంకా ఈ ఫైండ్ ఎక్స్ 8 సిరీస్ అండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15తో నడుస్తుంది. ఫైనల్‌గా ఈ ఎక్స్ 8 సిరీస్ ధర రూ.54,250 నుంచి ప్రారంభం కావొచ్చు అని సమాచారం. అయితే దీన్ని చైనాలో మాత్రమే ప్రస్తుతానికి విడుదల చేయనున్నారు. భారత మార్కెట్ రిలీజ్‌పై ఇంకా స్పష్టత లేదు.