EPAPER

Roma Michael Bikini: ‘ఈ మహిళ నరకానికే వెళుతుంది’.. బికినీలో పాకిస్తాన్ మోడల్!

Roma Michael Bikini: ‘ఈ మహిళ నరకానికే వెళుతుంది’.. బికినీలో పాకిస్తాన్ మోడల్!

Roma Michael Bikini| పాకిస్తానీ ఫ్యాషన్ మోడల్ రోమా మైకేల్ పేరు.. ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆమె తాజాగా మిస్ వరల్డ్ గ్రాండ్ అందాల పోటీల్లో పాల్గొనడమే దీనికి ప్రధాన కారణం. ఆమె ఆ పోటీల్లో భాగంగా ర్యాంప్ వాక్ కోసం బికినీ ధరించింది. బికినీ ధరించి తాను ఒక పాకిస్తానీ అని గర్వంగా ప్రకటించింది. ఆమె బికినీలో ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియోలు, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ముస్లిం ప్రధాన దేశమైన పాకిస్తాన్ లో ఆమెపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.


పాకిస్తాన్ లాంటి ఇస్లామిక్ దేశాల్లో మహిళలు శరీరమంతా కప్పుకునేలా పూర్తి వస్త్రాలు ధరించడం ఒక సంప్రదాయం. అక్కడ మహిళలు.. ఒళ్లు కనిపించే విధంగా బట్టలు వేసుకోకూడదని కఠిన నియమాలున్నాయి. అలాంటిది రోమా మైకేల్ ఏకంగా బికినీలో ర్యాంప్ వాక్ చేయడం.. పాకిస్తాన్ లో సంప్రదాయ ముస్లింలకు నచ్చడం లేదు.

పాకిస్తాన్ కు చెందిన సోషల్ మీడియా యూజర్లు రోమా మైకేల్ వ్యవహారంపై మండిపడుతూ తెగ పోస్ట్ లు పెడుతున్నారు. మరోవైపు మహిళా హక్కుల గురించి మరికొందరు నెజిజెన్లు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రోమా మైకేల్ కొత్త వివాదానికి తెరదీసింది.


Also Read: రూ.60 లక్షలు ఇస్తే.. సినిమాల్లో హీరోయిన్ చాన్స్ అంటూ యువతిపై అత్యాచారం, దోపిడి

ఇన్‌స్టాగ్రామ్ లో స్వయంగా వీడియో షేర్ చేసిన రోమా మైకేల్
పాకిస్తాన్ ఫ్యాషన్ మోడల్ అయిన రోమా మైకేల్ తాను అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపేందుకు స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో తన బికినీ ర్యాంప్ వాక్ వీడియో పోస్ట్ చేసింది. కానీ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ విపరీతంగా రావడంతో ఆమె ఈ వీడియోని డెలీట్ చేసింది. కానీ అప్పటికే ఈ వీడియో వేల మంది షేర్ చేసేశారు. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరోవైపు ఆమె అభిమానులలో కొంతమంది రోమా మైకేల్ చాలా ధైర్యవంతురాలని పొగుడుతున్నారు. ఆమె విమర్శలు వస్తాయని తెలిసిని ధైర్యంగా చాలా కాన్ఫిడెంట్ తో బికినీ ధరించి ప్రపంచం ముందుకు వచ్చి గర్వంగా తాను పాకిస్తానీ అని ప్రకటించడం అభినందించాల్సిన విషయమనీ చెబుతున్నారు.

ఒక యూజర్ ఆమెకు మద్దతుగా కామెంట్ చేస్తూ.. “మిస్ గ్రాండ్ ఇంటర్నేష్నల్ అందాల పోటీల్లో ఒక పాకిస్తానీ మోడల్ పాల్గొనడం ఇదే మొదటిసారి. ఆమె హిజాబ్ లేకుండా పోటీల్లో పాల్గొన్ని సంచలనం సృష్టించింది. ఆమె బికినీ ధరించడం ఆమె వ్యక్తిగత నిర్ణయం. ఆమె స్వేచ్ఛను మనం గౌరవించాలి. బెస్ట్ ఆఫ్ లక్ రోమా ” అని రాశాడు.

రోమాను విమర్శించే వారిలో ఒక యూజర్ అయితే.. “ఈ మహిళ నరకానికే వెళుతుంది. అక్కడ ఆమె నగ్న ప్రదర్శన పాపానికి నిప్పులో కాల్చబడుతుంది” అని కామెంట్ చేశాడు.

Also Read:  రాజకీయాలను జయించిన ప్రేమ.. పాక్ యువతిని పెళ్లాడిన బిజేపీ నాయకుడి కుమారుడు..

రోమా మైకేల్ ఎవరు?
పాకిస్తాన్ లోని లాహోర్ నగరానికి చెందిన రోమా మైకేల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియా నుంచి బి టెక్ పూర్తి చేసి.. ఫ్యాషన్ మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. పాకిస్తాన్ లోని పలు జాతీయ అందాల పోటీల్లో ఆమె విన్నర్ గా నిలిచింది. మిస్ చార్మ్ పాకిస్తాన్ 2023, మిస్ గ్రాండ్ పాకిస్తాన్ 2024 టైటిల్ కూడా ఈమె సొంతం. ‘ఢిల్లీ గేట్’, ‘కహే దిల్ జిధర్’ లాంటి సినిమాలు, ‘ప్యారీ నిమ్మో’, ‘తూ జిందగీ హై’ లాంటి టీవి షోలలో కూడా నటించింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ లో 77000 మంది ఫాలోవర్స్ ఉన్నారు.

Related News

Kiss Allergy: ‘నన్ను ముద్దు పెట్టుకోవాలంటే షరతులు వర్తిస్తాయి’.. బాయ్‌ఫ్రెండ్స్‌కు యువతి కండీషన్స్ వైరల్

Fake Court In Gujarat: నిన్న ఫేక్ పోలీస్ స్టేషన్, నేడు ఫేక్ కోర్టు- చీటర్లు మరీ రాటుదేలుతున్నారు భయ్యా!

Leopard Attacks: చిరుత పులితో రీల్స్.. చీల్చి పడేసిందిగా, ఈ వీడియో చూస్తే వణికిపోతారు!

New Snake Species: హిమాలయాల్లోని అరుదైన పాముకు ఆ రొమాంటిక్ హీరో పేరు పెట్టిన పరిశోధకులు.. అది అంత స్పెషలా?

Leave For Piles: ‘నీకు పైల్స్ ఉందని ఆధారం చూపించు’.. లీవ్ అడిగినందుకు బాస్ కండీషన్.. ఎంత పని చేశాడంటే?.

Europe Techie Salary: ‘లండన్‌లో సాలరీ రూ.80 లక్షలు.. బెంగుళూరుకు వచ్చేయాలనుకుంటున్నాను’.. సోషల్ మీడియాలో భారత టెకీ వైరల్ పోస్ట్

Big Stories

×