EPAPER

India Export Webley-455: మేడ్ ఇన్ ఇండియా తుపాకులు అమెరికాకు ఎగుమతి.. ఉత్తర్ ప్రదేశ్ లో తయారీ

India Export Webley-455: మేడ్ ఇన్ ఇండియా తుపాకులు అమెరికాకు ఎగుమతి.. ఉత్తర్ ప్రదేశ్ లో తయారీ

India Export Webley-455| ప్రపంచానికి ఆయుధాలు సరఫరా చేసే అమెరికా.. ఇకపై ఇండియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయనుంది. చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇండియాలోని ఒక ఆయుధాల తయారీ ఫ్యాక్టరీకి అమెరికా 10000 పైగా తుపాకులు కావాలని ఆర్డర్ ఇచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ లోని హర్దోయి ప్రాంతంలోని వెబ్లే స్కాట్ ఇండియా కంపెనీ ఈ ఆర్డర్ల్ లభించింది. హర్దోయి లోని శాండియా ప్రాంతంలో ఈ తుపాకుల కర్మాగారం ఉంది.


ఇండియాలో తయారైన ఈ వెబ్లే-455 రివాల్వర్ త్వరలోనే అమెరికాకు ఎగుమతి కానుంది. లండన్ కు చెందిన వెబ్లే అండ్ స్కాట్ కంపెనీ ఆయుధాల తయారీ ముఖ్యంగా రివాల్వర్ తయారీలో చాలా ఫేమస్. ఒక అంతర్జాతీయ కంపెనీ ఇండియాలో డిఫెన్స్ ఆయుధాల ఫ్యాక్టరీ పెట్టడం ఇదే తొలిసారి. ఈ కంపెనీ తయారు చేసే వెబ్లే-455 రివాల్వర్ ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యం పొందింది.

Also Read: లారెన్స్ బిష్నోయిని చంపితే రూ.కోటి పదకొండ లక్షలు.. బహిరంగ ప్రకటన చేసిన కర్ణిసేన..


ఇంతకుముందు వెబ్లే-455 రివాల్వర్ తయారీ కేవలం బ్రిటన్ దేశంలోనే జరిగేది. కానీ 2020 సంవత్సరంలో వెబ్లే అండ్ స్కాట్ కంపెనీ.. భారతదేశంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక తుపాకుల తయారీ ఫ్యాక్టరీ ప్రారంభించింది. ఈ కంపెనీ తయారు చేసే ఆయుధాలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతాయి.

ఉత్తర్ ప్రదేశ్ లో ఫ్యాక్టరీ స్థాపించడానికి వెబ్లే అండ్ స్కాట్ ఒక ఇండియన్ కంపెనీతో భాగస్వామ్యంగా పనిచేస్తోంది. అమెరికా నుంచి ఆర్డర్ రావడంపై కంపెనీ డైరెక్టర్ సురేంద్ర పాల్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే అమెరికా ఆర్డర్ చేసిన 10,445 తుపాకులు ఎగుమతి చేస్తామని.. ఈ ఆర్డర్ విజయవంతంగా పూర్తి చేసిన తరువాత తమకు, దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కృషి వల్లే రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని అయన అన్నారు.

హర్దోయి జిల్లా కలెక్టర్ మంగ్లా ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. భారతదేశంలో తయారైన తుపాకులు అమెరికాకు ఎగుమతి కావడం దేశానికే గర్వకారణమని చెప్పారు. డిఫెన్స్ ప్రొడక్షన్ లో ఇండియాకు ఇది ఒక మైల్ స్టోన్ లాంటిదని పొగిడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి రాష్ట్రంలో తయారీ రంగం అభివృద్ధి కోసం ప్రోత్సహిస్తున్నరని తెలిపారు. అమెరికాకు ఇండియా నుంచి తుపాకులు ఎగుమతి చేయడంలో ఇండియా డిఫెన్స్ ఉత్పత్తుల నాణ్యత గురించి ప్రపంచ దేశాలకు తెలుస్తుందని అన్నారు.

వెబ్లే-455 తుపాకుల చరిత్ర
1887 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో తొలిసారి వెబ్లే-455 తుపాకుల తయారీ జరిగింది. ఈ క్లాసిక్ తుపాకీ వినియోగం ప్రపంచ యుద్ధాలతో పాటు చాలా దేశాల యుద్ధాల్లో జరిగింది. 1887 నుంచి 1924 వరకు 1 లక్ష 25 వేలకు పైగా తుపాకులు విక్రయించిన చరిత్ర ఉంది. తక్కువ బరువు, 50 మీటర్ల షూటింగ్ రేంజ్ ఉన్న ఈ తుపాకీ తయారీ దాదాపు 100 సంవత్సరాల వరకు ఆగిపోయింది. అయితే ఈ ఐకానిక్ తుపాకీ డిమాండ్ పెరగడంతో మళ్లీ కొన్ని సంవత్సరాల కిందటే తయారీ ప్రారంభమైంది. కానీ ఈసారి కంపెనీ ఈ తుపాకుల తయారీ ఇండియాలో చేయాలని భావించింది. అమెరికా, బ్రెజిల్, యూరోపియన్ దేశాల్లో ఈ తుపాకీ కోసం విపరీతంగా డిమాండ్ ఉంది.

వెబ్లే-455 ద్వారా నిమిషంలో 20 నుంచి 30 రౌండ్ల బుల్లెట్లు కాల్చవచ్చు. అయితే ఒకసారికి ఈ రివాల్వర్‌లో 6 రౌండ్ల బుల్లెట్లు మాత్రమే లోడ్ చేయగలిగే అవకావం ఉంది.

ఉత్తర్ ప్రదేశ్ లో 10 ఆయుధాల ఫ్యాక్టరీలు
వెబ్లే-455 రివాల్వర్ తయారీ ఫ్యాక్టరీ కంటే ముందు ఉత్తర్ ప్రదేశ్ లోని అమేఠీలో ఏకె-203 తపాకుల తయారీ కూడా జరుగుతోంది. 2018లో భారత ప్రభుత్వం ఉత్తర్ ప్రదేశ్ లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ స్థాపించాలని ప్రకటించింది. దేశంలో మొత్తం 39 ఆయుధాల ఫ్యాక్టరీలుండగా.. 10 ఫ్యాక్టరీలు ఉత్తర్ ప్రదేశ్ లోనే ఉండడం గమనార్హం.

Related News

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Supreme Court: తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

RAJNATH SINGH : గస్తీ ఒప్పందం విజయవంతంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు… చర్చలకు ఉండే శక్తే వేరు అంటూ కితాబు

Bengaluru Traffic: బెంగళూరులో ప్రత్యక్ష నరకం, రోడ్ల మీదే కార్లు వదిలేసి వెళ్లిపోయిన టెక్కీలు!

Ajit Pawar : మహా ఎన్నికల్లో కీలక పరిణామం, అజిత్‌ పవార్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్, ఇక ఆ గుర్తు మీదే !

Maharashtra Polls MVA: మహారాష్ట్రలో కుదిరిన ప్రతిపక్షాల పొత్తు.. ఇండియా కూటమి 85-85 సీట్ షేరింగ్‌

Big Stories

×