EPAPER

Whats App : వాట్సాప్ లో చిన్న సెట్టింగ్ మార్పుతో ఐదుగురికి కాదు.. ఒకేసారి అందరికీ శుభాకాంక్షలు పంపొచ్చని తెలుసా!

Whats App : వాట్సాప్ లో చిన్న సెట్టింగ్ మార్పుతో ఐదుగురికి కాదు.. ఒకేసారి అందరికీ శుభాకాంక్షలు పంపొచ్చని తెలుసా!

Whats App : వాట్సాప్.. ఈ ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ ప్రతీ ఒక్కరి జీవితంలో ఎంతగా భాగమైపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక భారతదేశంలోనే ఈ యాప్ ను 500 మిలియన్లకు పైగా యూజర్స్ వినియోగిస్తున్నారంటే ఇది మన జీవితంలో ఎంతగా లీనమైపోయిందో తెలుస్తూనే ఉంది. వ్యక్తిగత సమాచారమైనా, వృత్తిపరమైన  పరమైన సమాచారమైన షేర్ చేసుకోవాలనుకున్న ప్రతీ ఒక్కరూ వాట్సాప్ ను ఆశ్రయించాల్సిందే. ఇక ఎలాంటి సమాచారాన్నైనా షేర్ చేయగలిగే వాట్సాప్ తో ఉన్న ఒకే ఒక సమస్య.. ఒక విషయాన్ని ఒకేసారి కేవలం ఐదుగురికి మాత్రమే పంపే అవకాశం ఉంది. ఏదైనా ఫెస్టివల్ కు సంబంధించి శుభాకాంక్షలు పంపాలన్నా ఇదే సమస్య ఎదురవుతుంది. అయితే చాలా మందికి తెలియని వాట్సాప్ అప్డేట్ ఒకటుంది. ఒక సమాచారాన్ని దాదాపు 256 మందికి ఒకేసారి పంపగలిగే వాట్సాప్ ఫీచర్ చాలా మంది యూజర్స్ కు తెలియదు. మరి ఈ ఫీచర్ ఏంటి.. సెట్టింగ్స్ లో ఎలా మార్చుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.


దివాళి.. ప్రతీ ఒక్కరూ ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ ఫెస్టివల్ లో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవటం తప్పనిసరి. అయితే వాట్సాప్ తో ఒకేసారి అందరికీ సందేశాలు పంపాలంటే మాత్రం పెద్ద విషయమే. ప్రతీ సారి వాట్సాప్ ఓపెన్ చేసి 5గురికి పంపాక మళ్ళీ వెనక్కి వచ్చి కాంటాక్ట్స్ సెలెక్ట్ చేయాలి. ఇకపై ఆ అవసరం ఉండదు. తేలికగా నచ్చినంతమందికి సందేశాల్ని పంపే అవకాశం ఉంది.  ఇందుకోసం ఏం చేయాలంటే….

ALSO READ : దీపావళి సేల్​ ధమాకా – సగం ధరకే శాంసంగ్, సోనీ బ్రాండెడ్ స్మార్ట్​ టీవీస్​


ఒకేసారి ఎక్కువ మందికి వాట్సాప్ లో సందేశాలు పంపించాలంటే పంపించవలసిన వారి జాబితాను ఒకచోట క్రియేట్ చేసుకోవాలి. ఇందుకోసం వాట్సాప్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే సరి.

⦿ మొబైల్లో వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేసి సెట్టింగ్స్ కి వెళ్ళాలి

⦿ బ్రాడ్ కాస్ట్ లిస్టును సెలెక్ట్ చేసి క్రియేట్ న్యూ లిస్ట్ నోట్ తయారు చేయాలి

⦿ కాంటాక్ట్స్ ను సేవ్ చేయడానికి క్లిక్ మార్క్ పైన క్లిక్ చేయాలి

⦿ ఒకసారి బ్రాడ్ కాస్ట్ లిస్ట్ ఇచ్చి సెలెక్ట్ చేశాక ఒకేసారి వారందరికీ గ్రీటింగ్స్ పంపించవచ్చు

ఇలా వాట్సాప్ లో ఎన్నో లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు అప్డేట్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు తన యూజర్స్ కోసం మెటా సైతం సరికొత్త ఫీచర్స్ ను తీసుకువస్తుంది. వీటిని ఫాలో అయితే వాట్సాప్ లో మరింత తేలికగా సమాచారం పంపిచెయ్యెచ్చు.

ఇలా కేవలం ఈ ఒక్క ఫెస్టివల్ కే కాకుండా ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరికీ ప్రతీ సారి తేలిగ్గా మెసేజ్లను ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక వాట్సప్ బ్రాడ్ లిస్ట్ లో ఒకేసారి 256 కాంటాక్ట్స్ ను సేవ్ చేసుకునే అవసరం ఉంటుంది. ఇది బిజినెస్ పరంగా వాట్సాప్ ఉపయోగించే వినియోగదారులకు సైతం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.  ఇక మరెందుకు ఆలస్యం. అవసరం అనుకుంటే వెంటనే ప్రయత్నించేయండి.

 

Related News

Scientist On Earth: డైమండ్ డస్ట్ తో భూమికి చల్లదనం, ఇది అయ్యే పనేనా గురూ?

LG Smart LED TV Offers : ఎల్ జీ అరాచకం.. స్మార్ట్ టీవీపై మరీ ఇంత తగ్గింపా.. కొనాలంటే మంచి రోజులివే!

OPPO Find X8 series : ఒప్పో భీభత్సం.. కొత్త అప్డేట్స్ తో మరో రెండు ఫోన్స్.. కెమెరా, ప్రాసెసర్ మాత్రం సూపరో సూపర్

Diwali LED TV Offers : దీపావళి సేల్​ అంటేనే చీపెస్ట్ సేల్.. సగానికి సగం తగ్గిపోయిన సామ్ సాంగ్, సోనీ టీవీ ధరలు

Infinix Zero Flip 5G : Infinix ఫోల్డబుల్ మెుబైల్.. నేడే ఫ్లిప్కార్ట్ లో ఫస్ట్ సేల్.. ఫోన్ కొని ఎంచక్కా పాకెట్లో దాచేయండి

Diwali Mobile Sale : భారీగా తగ్గిపోయిన ఫోన్ ధరలు.. 10వేలకే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్

Big Stories

×