EPAPER

Iran Israel War: ప్రాణ మిత్రులు బద్ద శత్రువులు ఎలా అయ్యారు? ఇరాన్-ఇజ్రాయెల్ నడుమ చిచ్చు ఎలా మొదలైంది?

Iran Israel War: ప్రాణ మిత్రులు బద్ద శత్రువులు ఎలా అయ్యారు? ఇరాన్-ఇజ్రాయెల్ నడుమ చిచ్చు ఎలా మొదలైంది?

Iran-Israel Conflict:  ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గున మండే పరిస్థితి నెలకొన్నది. గత కొన్ని దశాబ్దాలుగా ఇరు దేశాల నడుమ వైరం చాపకింద నీరులా రాజుకుంటూనే ఉంది. ఇరు దేశాల మధ్య జరిగే యుద్ధాన్ని చాలా మంది షాడో వార్ గా అభివర్ణించారు. ఎందుకంటే.. రెండు దేశాలు ఏనాడు తమ వైరాన్ని బహిరంగపరుచుకోలేదు. కానీ, ఇప్పుడు ముసుగు తొలగిపోయింది. రెండు దేశాలు నేరుగా తలపడుతున్నాయి. తాడో పేడో తేల్చుకుందాం అంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. ఒకప్పుడు మిత్రదేశాలుగా కొనసాగిన ఇరాన్, ఇజ్రాయెల్ నడుమ ఎందుకు వివాదం చెలరేగింది? ముందు తప్పుటడుగులు వేసింది ఎవరు? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


హమాస్ దాడులతో పెరిగిన ఉద్రిక్తత

తాజా పరిణామాలకు కారణం హమాస్ 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడులు చేయడం. హమాస్ మూకలు ఇజ్రాయెల్ లోకి దూసుకొచ్చి ఏకంగా 1200 మంది ఇజ్రాయేలీలను హతమార్చాయి. ఎంతో మందిని బంధించి గాజాకు తీసుకెళ్లాయి. హమాస్ చర్యతో కోపంతో రగిలిపోయిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు గాజాపై వైమానిక దాడులు చేయించారు. బందీలుగా ఉన్న తమ పౌరులను వదిలే వరకు దాడులు తప్పవంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.  తన సైన్యం చేత గాజాలో తీవ్రస్థాయిలో ప్రతీకార దాడులు చేయించారు. ఈ దాడులు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధానికి కారణమయ్యాయి.


గత కొంతకాలంగా లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైన్యానికి హిజ్బుల్లా అనుబంధ సంస్థలు అయిన మిలీషియాల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. అదే సమయంలో వెస్ట్ బ్యాంక్ లోని ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల్లో పాలస్తీనా నిరసనకారులతో ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ మీద గురిపెట్టింది. ఇజ్రాయెల్ మీద క్షిపణులతో దాడులకు దిగింది.  హిజ్బుల్లా చీఫ్ మృతికి ప్రతీకారం తీర్చుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న షాడో యుద్ధం ప్రత్యక్ష యుద్ధానికి దారి తీసింది. తమ దేశం మీద ఇరాన్ దాడి చేసి పెద్ద తప్పు చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు.  తగిన మూల్యంచెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అటు ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు ఇవ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

మిత్రదేశాలు, శత్రుదేశాలుగా..

వాస్తవానికి ఒకప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మిత్రదేశాలు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడింది. ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నది. చాలా ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ ను దేశంగా గుర్తించలేదు. మిడిల్ ఈస్ట్ లోని ముస్లీం దేశాలు ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకించేవి. అలాంటి పరిస్థితిలో ఇరాన్, ఇజ్రాయెల్ కు స్నేహ హస్తం అందించింది. ఇరు  దేశాల నడుమ మంచి సంబంధాలు కొనసాగాయి. ఇజ్రాయెల్, ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేస్తే, ఇరాన్, ఇజ్రాయెల్ కు ఆయిల్ సరఫరా చేసింది. అన్ని రంగాల్లో ఇరుదేశాలు పరస్పర సహకారం అందించుకున్నాయి.

ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇరాన్ అడుగులు   

ఇరాన్ లో అయతుల్లా ఖొమేనీ నేతృత్వంలో ఇస్లామిక్ విప్లవం మొదలైన తర్వాత ఇజ్రాయెల్ తో సంబంధాలు పలుచబారాయి. ఖొమేనీ అమెరికాతో పాటు  ఇజ్రాయెల్‌ ను డెవిల్ దేశాలుగా అభివర్ణించాడు. ఇరాన్‌ ప్రత్యేక ముస్లిం దేశంగా ఉండాలని ఖొమేనీ ఉద్యమం లేవదీశాడు. 1979లో ఇరాన్ ముస్లిం దేశంగా అవతరించింది. ఇజ్రాయెల్, ఇరాన్ దారులు వేరయ్యాయి. ఇరు దేశాల నడుమ దౌత్య సంబంధాలు తెగిపోయాయి. టెహ్రాన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని పాలస్తీనా రాయబార కార్యాలయంగా మార్చారు. ఇరు దేశాల నడుమ వైరం మొదలయ్యిది.

ఇజ్రాయెల్ శత్రువులతో ఇరాన్ దోస్తీ

అనంతరం ఇరాన్.. ఇజ్రాయెల్ శత్రుదేశాలతో జోడీ కట్టింది. సిరియా, యెమెన్, లెబనాన్ కు ఆయుధాలు సరఫరా చేసింది. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా ఇరాన్  మిలీషియా దళాలతో ఓ నెట్‌ వర్క్‌ ను  రూపొందించింది. లెబనాన్‌లోని ఇజ్రాయెల్ వ్యతిరేక హిజ్బొల్లా గ్రూపుతో పాటు హమాస్ ఉగ్రమూకలకు ఇరాన్ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సిరియా, గాజాలోని ఇరానియన్ స్థావరాలను నేలమట్టం చేసింది. వైమానిక దాడితో తమ అణు శాస్త్రవేత్త మొహసేన్ ఫక్రిజాదేను ఇజ్రాయెల్ చంపేసినట్లు ఇరాన్ ఆరోపించింది. ఆ తర్వాత యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ సపోర్టుగా నిలిచింది. ఇజ్రాయెల్‌పై దాడికి దిగిన హమాస్ సహా పాలస్తీనాలోని పలు మిలిటెంట్ గ్రూపులకు ఇరాన్ ఆయుధాలు అందించడంతో పాటు ట్రైనింగ్ ఇచ్చింది. ఇరాన్ చర్యల కారణంగా గాజా యుద్ధం, లెబనాన్ యుద్ధం తలెత్తింది. ఇజ్రాయెల్ ప్రతి దాడులకు ఇరాన్ ఎలా తట్టుకుంటుంది? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.

Read Also: ప్రపంచాన్ని వణికిస్తున్న ISISకు ప్రాణం పోసింది అమెరికానా? చరిత్ర చెబుతోన్న వాస్తవాలేంటీ?

Related News

Nellore Politics: సై అంటే సై.. నెల్లూరు మంత్రుల మధ్య ఇసుక దుమారం

Mekathoti Sucharitha: వైసీపీకి మరో ‘మేడమ్‌’ గుడ్ బై..

YS Jagan: చిలకా ఏ తోడు లేకా బెంగళూరు వైపు ఒంటరి నడక..?

Kavitha: కవితకు ఏమైంది? సవాలు చేసి సైలెంట్ అయ్యారు ఎందుకు?

Salman Khan: సల్మాన్ నిజంగానే ఆ జింకను కాల్చాడా? ఆ రోజు అతనితో ఉన్న హీరోయిన్స్ ఎవరు? వారికీ ముప్పుందా?

Chandrababu Vision: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ తో ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో తెలుసా? హైదరాబాద్‌కు విశాఖ ప్రత్యామ్నాయం కానుందా?

Big Stories

×