EPAPER

Samsung Tri-Fold Smartphone : ఇకపై ఫోన్ ను మూడుసార్లు మడతపెట్టేయండి.. త్వరలోనే సామ్‌సంగ్ ట్రై ఫోల్డ్ మెబైల్స్

Samsung Tri-Fold Smartphone : ఇకపై ఫోన్ ను మూడుసార్లు మడతపెట్టేయండి.. త్వరలోనే సామ్‌సంగ్ ట్రై ఫోల్డ్ మెబైల్స్

Samsung Tri-Fold Smartphone : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్ సాంగ్ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని కొరియా ZDNet నివేదిక తెలిపింది. Samsung Electronics ఎంట్రీ-లెవల్ క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్ ను డిజైన్ చేసేందుకు సన్నాహాలు చేస్తుందని.. ఈ స్మార్ట్ ఫోన్ లో స్క్రీన్ ను రెండు సార్లు మడిచే అవకాశం ఉందని తెలిపింది.


కొరియాకు చెందిన ZDNet ఓ నివేదికను అందించింది. ప్రముఖ టెక్ దిగ్గజం సామ్ సాంగ్ ట్రై ఫోల్డ్ ఫోన్ ను డిజైన్ చేస్తుందని.. 2025లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రాబోతుందని తెలిపింది. ఇక చైనాలో Mate XT అల్టిమేట్ ట్రై ఫోల్డ్ మెుబైల్ ను లాంఛ్ చేసిన Huawei తో పోటీ పడాలని సామ్ సాంగ్ ప్రయత్నిస్తుందని.. దీని ధర సుమారు రూ. రూ. 2,37,000 ఉండొచ్చని తెలిపింది. ఇక Xiaomi, Honor, Oppo సైతం పెద్ద స్క్రీన్‌లతో ఫోన్స్ తయారు చేయటానికి సన్నాహాలు చేస్తున్నాయని.. త్వరలోనే వీటి నుంచి సైతం ట్రై ఫోల్డ్ డిస్‌ప్లే టెక్నాలజీతో మెబైల్స్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

ఇక సామ్ సాంగ్ ట్రై ఫోల్డ్ ఫోన్, సామ్ సాంగ్ ఫోల్డ్ బుల్ మెుబైల్స్ 2025 నాటికి అందుబాటులోకి రావచ్చని… అయితే లాంఛ్ తేది మాత్రం సామ్ సాంగ్ ప్రతినిధులపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చింది.


ALSO READ : అమెజాన్ ఫెస్టివల్ సేల్ చివరి అవకాశాలివే.. మెుబైల్స్, లాప్టాప్స్, ట్యాబ్స్ ఇంకా ఏమున్నాయంటే!

Huawei Mate XT అల్టిమేట్ తో పోటీ

సామ్ సాంగ్ నుంచి రాబోయే ట్రై-ఫోల్డ్ డిస్‌ప్లే మెుబైల్ Huawei Mate XT అల్టిమేట్ కంటే సన్నగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ ఫోన్ లో ఉన్నట్లే సామ్ సాంగ్ లో సైతం కెమెరా, బ్యాటరీ, డిస్ ప్లే హై రేంజ్ లో ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన Samsung Galaxy Z Flip 6, Galaxy Z Fold 6 మోడళ్లకు ఊహించిన దాని కంటే తక్కువ డిమాండ్ కనిపించింది. దీంతో రాబోయే మెుబైల్స్ లో మరిన్ని అధునాతన ఫీచర్స్ ను తీసుకువస్తుందని తెలుస్తుంది. ఇక ట్రిపుల్ ఫోల్డింగ్ డిస్‌ప్లే మెుబైల్స్ ను సామ్ సాంగ్ 2023లోనే తీసుకురావాలనే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాకపోవటంతో ఆ ప్రయత్నం విరమించి.. వచ్చే ఏడాది తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. Galaxy S23 FE కు బదులుగా ట్రిపుల్ ఫోల్డింగ్ డిస్‌ప్లే మెుబైల్ రాబోతుందని అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. కానీ అవి సాధ్యం కాలేదు.

ఈ ఫోల్టబుల్ మెుబైల్స్ ను Samsung Flex G, Flex S పేరుతో తీసుకురావాలని సామ్ సాంగ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కానీ ఈ మెుబైల్స్  కస్టమర్స్ ను చేరుకోలేకపోయాయి. ఇక Samsung గెలాక్సీ Z ఫ్లిప్ లో ఉన్నట్లు తర్వాత రాబోయే మోడల్స్ లో ఇయర్ స్పీకర్స్ ఉండవనే అంచనాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక సామ్ సాంగ్ తీసుకురాబోయే ఈ మోడల్ మెుబైల్స్ ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

Scientist On Earth: డైమండ్ డస్ట్ తో భూమికి చల్లదనం, ఇది అయ్యే పనేనా గురూ?

LG Smart LED TV Offers : ఎల్ జీ అరాచకం.. స్మార్ట్ టీవీపై మరీ ఇంత తగ్గింపా.. కొనాలంటే మంచి రోజులివే!

OPPO Find X8 series : ఒప్పో భీభత్సం.. కొత్త అప్డేట్స్ తో మరో రెండు ఫోన్స్.. కెమెరా, ప్రాసెసర్ మాత్రం సూపరో సూపర్

Whats App : వాట్సాప్ లో చిన్న సెట్టింగ్ మార్పుతో ఐదుగురికి కాదు.. ఒకేసారి అందరికీ శుభాకాంక్షలు పంపొచ్చని తెలుసా!

Diwali LED TV Offers : దీపావళి సేల్​ అంటేనే చీపెస్ట్ సేల్.. సగానికి సగం తగ్గిపోయిన సామ్ సాంగ్, సోనీ టీవీ ధరలు

Infinix Zero Flip 5G : Infinix ఫోల్డబుల్ మెుబైల్.. నేడే ఫ్లిప్కార్ట్ లో ఫస్ట్ సేల్.. ఫోన్ కొని ఎంచక్కా పాకెట్లో దాచేయండి

Diwali Mobile Sale : భారీగా తగ్గిపోయిన ఫోన్ ధరలు.. 10వేలకే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్

Big Stories

×