EPAPER

Mahesh Babu : పిల్లలకు గుండె ఆపరేషన్లు చేసే చేతులే పాన్ మసాలా తినమని చెప్తున్నాయా ?

Mahesh Babu : పిల్లలకు గుండె ఆపరేషన్లు చేసే చేతులే పాన్ మసాలా తినమని చెప్తున్నాయా ?

Mahesh Babu : ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలున్నా… హై లెవల్ క్రేజ్ ఉన్న హీరోలు ఇద్దరే ఇద్దరు. వాళ్లే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు. ఇక మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా ఏం చెబుతారు. ఇటు బ్లాక్ బస్టర్స్ సినిమాలతో పాటు మంచి పనులు చేస్తూ అందరి నుంచి సెల్యూట్ కొట్టించుకుంటున్నాడు. అలాంటి హీరోపై ఇప్పుడు ఘాటు ట్రోల్స్ వస్తున్నాయి. చిన్న పిల్లలకు ఎన్నో హార్ట్ ఆపరేషన్స్ చేసిన హీరోపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. అందరిలానే ఈ హీరో కూడా డబ్బుల కోసం కక్కుర్తి పడేవాడు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.


అసలేం జరిగింది..? ఎన్నో మంచి పనులు చేసి రీల్ కాదు.. రియల్ శ్రీమంతుడు అని పిలిపించుకునే మహేష్ బాబుపై ఈ నెగిటివిటీకి కారణమేంటి…? అనేది ఇప్పుడు చూద్దాం…

ఒక సారి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ గురించి మాట్లాడుకుందాం…
క్రికెట్ కి దేవుడు అని పిలుస్తారు ఆయనను. ఎంతో క్రేజ్ సంపాదించాడు. కోట్లాది మంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్నాడు. ఆ అభిమానుల కోసం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. ఓ సందర్భంలో సచిన్… “ఆరోగ్యాలను పాడు చేసే ఎలాంటి వాటిని నేను సపొర్ట్ చేయను. దాని నుంచి ఎన్ని కోట్లు ఇచ్చినా… ప్రమోట్ చేయను” అని అంటాడు. ఇప్పుడు ఇది ఎందుకు అంటారా…? సచిన్ ను ఆ  స్ధానంలో నిలబెట్టిన అభిమానుల ఆరోగ్యం గురించి ఆయన ఆలోచించాడు కదా… అదే ఓ సారి గుర్తు చేద్దామని.


మహేష్ బాబు కేవలం 10 కోట్ల కోసం…

మన టాలీవుడ్‌లో స్టార్ హీరో మహేష్ బాబు ఉన్నాడు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కానీ, ఆ అభిమానుల కోసం ఏం చేస్తున్నాడు అంటే… వాళ్ల ఆరోగ్యం పాడు చేసుకోండి అంటూ పాన్ మసాలా తినండి అంటూ రోడ్డు మీదకు వచ్చి మరీ చెబుతున్నాడు. దీని వల్ల మహేష్ బాబుకు వచ్చేది అక్షరాల 10 కోట్లు. నిజానికి మహేష్ బాబు లాంటి హీరోకు 10 కోట్లు పెద్ద మ్యాటర్ కాదు. ఒక్క సినిమా సైన్ చేస్తే 100 కోట్ల వరకు కలెక్ట్ చేసుకోవచ్చు. అలాంటి సత్తా అభిమానులు ఆయనకు ఇచ్చారు. కానీ, మన బాబు గారు మాత్రం కేవలం 10 అంటే 10 కోట్ల కోసం కోట్లాది మంది ప్రజలు.. అందులో ఆయనను ఎంతో ప్రేమగా అభిమానించే వాళ్లు కూడా ఉన్నారు. వాళ్ల అందరి ఆరోగ్యాలను పణంగా పెడుతున్నారు.

ఇది బాలీవుడ్ సంప్రదాయం… కానీ,

పాన్ మసాలాను ప్రమోట్ చేయడం బాలీవుడ్ నటుల సంప్రదాయం. సినిమాల నుంచి ఎన్ని కోట్లు వచ్చినా.. ఈ పాన్ మసాలా డబ్బుల కోసం వాళ్లు కక్కుర్తి పడుతారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్లు కూడా ఆ లిస్ట్ లో ఉన్నారు. అలాంటి బాలీవుడ్ కూడా ఇప్పుడు మారుతుంది. మొన్నటికి మొన్న అనిల్ కపూర్ ఈ పాన్ మసాలా ప్రమోట్ చేయొద్దు అని ఫిక్స్ అయ్యాడు. 10 కోట్ల ఆఫర్ ను కూడా ఆయన లెక్క చేయలేదు.

తెలుగు హీరోలు…

తెలుగులో చాలా మంది హీరోలు ఈ పాన్ మసాలా యాడ్స్ చేయడానికి ముందుకు రావడం లేదు. కోట్లాది రూపాయాలు ఆఫర్స్ వస్తున్నా… అభిమానుల ప్రాణాలను పణంగా పెట్టే పనులు చేయమని తెగేసి చెబుతున్నారు. కానీ, మిల్క్ బాయ్ లా ఉండే ప్రిన్స్ మాత్రం… కేవలం 10 కోట్ల కోసం ఈ ప్రాణాంతకమైన వాటిని స్వేచ్ఛగా ప్రమోట్ చేస్తున్నాడు.

యాడ్స్‌తోనే కోట్లాది రూపాయాలు…

మహేష్ బాబు చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్నాడు. కూల్ డ్రింగ్స్, పర్ఫ్యూమ్ బ్రాండ్స్ తో పాటు చాలా వాటిని ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. ‘సెంట్ ఫర్ మై సక్సెస్’ అంటూ అర్థం లేని డైలాగ్‌లు చెప్పినా… వాటిపై పెద్దగా ట్రోల్స్ రాలేదు. ఎందుకుంటే, వాటితో ఎలాంటి అపాయం ఉండదు కాబట్టి. కానీ, పాన్ మసాలా తినండి అంటూ నడి రోడ్డుపైన మహేష్ బాబు ప్రమోట్ చేయడం ఆయన అభిమానులకే నచ్చడం లేదు.

ఎంతో మంది చిన్న పిల్లలకు ఆపరేషన్స్ చేయించిన ఆ చేతులు ఇప్పుడు ప్రాణాంతకమైన పాన్ మసాలాను తినండి అంటూ చెప్పడం కరెక్ట్ కాదు అంటూ ఆయన సొంత అభిమానులే అంటున్నారు. ఇక రెగ్యలూర్ సినీ అభిమానుల గురించి సోషల్ మీడియా చూస్తే సరిపోతుందేమో…

Related News

Kanguva First Review : “కంగువ” ఫస్ట్ రివ్యూ… మూవీ టాక్ ఏంటంటే?

Ka Movie: ట్రైలర్ బావుంది.. కానీ, కిరణ్ అబ్బవరంకే లక్ లేదు..?

Pushpa 2 Remuneration : పుష్పగాడి రేంజే వేరబ్బా.. అందుకే అన్ని రూ.కోట్లు..!

Ka Movie Trailer : చీకటి వలయం… గందరగోళం… సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటున్న ట్రైలర్..!

Sai Pallavi : ఆ హీరోలు అందరూ ఉనికిని కోల్పోతారు… సాయి పల్లవి నుంచి షాకింగ్ కామెంట్స్..!

Raja Saab : ప్రభాస్ తాత గెటప్ వెనుక ఇంత కథ ఉందా.. మారుతి ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

Tripti Dimri : యానిమల్ బ్యూటి చేసిన మొదటి యాడ్?..అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు..

Big Stories

×