EPAPER

Vahana yoga for yew year : నూతన సంవత్సరంలో వాహన యోగం కలగాలంటే……

Vahana yoga for yew year : నూతన సంవత్సరంలో వాహన యోగం కలగాలంటే……

Vahana yoga for yew year : కొత్త సంవత్సరంలోనైనా వాహన యోగం కలుగలాని కోరుకునే కొన్ని పూజలు చేస్తే వారి కోరిక తీరుతుంది.. మహాలక్ష్మీ దేవిని జాజి పూలతో పూజ చేసి మల్లెపూల గంధం ఆ సమర్ఫిస్తూ మంత్రాన్ని జపిస్తే వాహన యోగం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. వాహనం తీసుకునేటప్పుడు కూడా తీసుకునే రంగులు అదృష్టాన్ని తీసుకొస్తాయి.


నేవీ బ్లూ కలర్ వాహనం నడిపేవారి ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. మధ్యలో వాహనం ఆగిపోయే ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆకుపచ్చ రంగులో వాహనం నడిపే వారికి అసలు ప్రమాదాలు జరగవు. గ్రీన్ కలర్ వాహనానికి బ్రేకులు పడకపోవడం లాంటి సమస్యలు రావనేది జ్యోతిష్య నిపుణుల మాట. పెరఫెక్ట్ సేఫ్ జర్నీకి గ్రీన్ వెహికల్ గా చెబుతారు. ఎరుపు రంగు వాహనాలకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ.

ఎరుపు కుజుడికి సంకేతం. కాబట్టి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది అందరికి వర్తించదు. లక్కీ నెంబర్ 9 ఉన్న వాళ్లకి ఎరుపురంగు వాహనాలు బాగా కలిసి వస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే 9 వచ్చినా.. 9వ తేదీలో పుట్టినా వారికి 9 లక్కీ నెంబర్ అవుతుంది. మిగిలిన వారు రెడ్ కలర్ లో మంగళవారం నాడు వెళ్తే ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. ప్రమాదానికి ఆహ్వానం పలికినట్టేనని చెబుతున్నారు. రెడకలర్ వాహనంలో వెళ్లే వారు మంగళవారం నాడు వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకుని వెళ్తే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
గ్రే కలర్ వాహనం వాడే వారిలో ఎక్కువమంది ఆరోగ్య పరమైన సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. బూడిద రంగు వాహనం కొన్న తర్వాత ఇంట్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. కానీ ప్రమాదాలు మాత్రం జరగవు. కానీ అందరికి గ్రే కలర్ కలిసి రాదు.


బ్రౌన్ కలర్ , గానీ అస్పష్టమైన వైట్ కలర్ ఉన్న వాహనాలు వాడినా ధనవ్యయం కలుగుతుంది. కారు కొన్నప్పటికి నుంచి ఖర్చు వస్తోందంటే అది బ్రౌన్ రంగు వాహనం వల్లే. రవి బలం లేని వాళ్లు బ్రౌన్ కలర్ , అస్పష్టమైన వైట్ రంగు వాహనాలు తీసుకోవద్దని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. తెలుపు రంగు వాహనాల వల్ల ప్రమాదాలు పెద్దగా జరగవు. కానీ అప్పుడప్పుడు అద్దాలు మాత్రం ఏదో ఒక కారణం వల్ల పగులుతూ ఉంటాయి. స్కై బ్లూ కలర్ వాహనాలు కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని శాస్త్రం చెబుతోంది. దీనివల్ల కలిసొచ్చేది ఏమీ ఉండదు. అలాగే నష్టాలు కూడా ఏమీ ఉండవు.

ఏ కలర్ వాహనం వాడినా ఆ రోజు గ్రహానికి సంబంధించి రంగు బట్టలు వేసుకుంటే ఎలాంటి సమస్యలు ప్రమాదాలు రావు. ఆదివారం సూర్యుడుకి ఇష్టమైన రంగు కాబట్టి ఆ వేళ ఎరుపు రంగు బట్టలు వేసుకోవడం వల్ల ప్రయాణం సేఫ్ గా సాగిపోతుంది. సోమవారం చంద్రుడు అధిపతి కాబట్టి ఆవేళ తెలుపు రంగు బట్టలు వేసుకుని వెళ్లాలి…మంగళవారానికి అధిపతి కుజుడు ఆవేళ ఎరుపు రంగు వేసుకోవాలి. బుధవారం గ్రీన్ కలర్, గురువారం పసుపు రంగు, శుక్రవారం వైట్ కలర్, శనివారం బ్లూ కలర్ వేసుకుని వెళ్లాలి. ఒకవేళ గ్రహాధిపతికి అనుకూలమైన రంగు బట్టలు లేకపోతే ఆ రంగు ఖర్చీఫ్ తీసుకుని వెళ్లినా సరిపోతుంది.

Tags

Related News

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Big Stories

×