EPAPER

Ka Movie : కష్టాల్లో “క” మూవీ… ఇది కూడా చే జారిపోయినట్టేనా?

Ka Movie : కష్టాల్లో “క” మూవీ… ఇది కూడా చే జారిపోయినట్టేనా?

Ka Movie : ఏదైనా పండగ వస్తుంది అంటే చాలు టాలీవుడ్ మూవీ లవర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్ల బాట పడతారు. అయితే నిర్మాతలు కూడా దీన్నే క్యాష్ చేసుకోవాలని ముందుగానే తమ సినిమాలను ఆయా పండగలకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. అందులోనూ చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల దాకా అందరి కన్నూ పండగ డేట్ లపై ఉండడం అనేది థియేటర్ల సమస్యకు దారితీస్తుంది. ఇక వీటన్నింటి కంటే ముందు సినిమా కంటెంట్ బయ్యర్ లను అట్రాక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అది కాస్త అటు ఇటుగా ఉంది అనిపించినా, చిన్న సినిమా అయినా బయ్యర్లు ఆ సినిమాల జోలికి వెళ్లరు. ఇక కొన్న బయ్యర్ల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంటుంది. తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘క’ మూవీకి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కిరణ్ అబ్బవరం సినిమాను కొన్న బయ్యర్లు తెగ టెన్షన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.


ఆగస్టు 31న దీపావళి కానుకగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’ మూవీ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ ఒక్క మూవీనే కాకుండా తమిళ మూవీ ‘అమరన్’, కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ కూడా అదే రోజున రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ మూడు సినిమాల్లో ఎక్కువగా హైప్ ఉన్న మూవీ ‘లక్కీ భాస్కర్’. ఇందులో కంటెంట్, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించడం మాత్రమే కాదు, ప్రొడ్యూసర్ నాగ వంశీ కావడం మరో ప్లస్ పాయింట్. ఇండస్ట్రీలో దిల్ రాజు తర్వాత భారీగా టాలీవుడ్ లో థియేటర్లు దక్కే నిర్మాత ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా నాగ వంశీనే. కాబట్టి ‘లక్కీ భాస్కర్’ మూవీకి భారీ సంఖ్యలో థియేటర్లు దక్కడం ఖాయం.

ఇక ఆ తర్వాత స్థానంలో ఉన్న మూవీ ‘అమరన్’. ఇదొక దేశభక్తి కథాంశంతో వస్తున్న ఈ బయోపిక్ లో సాయి పల్లవి నటించడంతో కొంతవరకు బజ్ ఉంది. ఇక అచ్చ తెలుగు మూవీ ‘క’కు మాత్రం దెబ్బ పడింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయినప్పటికీ పెద్దగా హైప్ పెరగలేదు. ఇక అక్టోబర్ 24న రిలీజ్ కాబోతున్న ట్రైలరే ఈ సినిమాను కాపాడాలి. ఎందుకంటే ఆల్రెడీ బిజినెస్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ సినిమాకు పెట్టిన డబ్బులు వస్తాయో రావో అని బయ్యర్లు భయపడుతున్నారని ఇన్సైడ్ వర్గాల సమాచారం. బిజినెస్ అయితే జరిగింది కాకపోతే ఎగ్జిబిటర్స్ డబ్బులు కడతారా లేదా అదే డబ్బుతో ఇప్పుడు రిలీజ్ అవుతుందా? అనుకున్న ప్రకారమే డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఇవ్వగలరా అనే చర్చ నడుస్తోంది.


దానికి కారణం కచ్చితంగా కిరణ్ అబ్బవరంతో పాటు నిర్మాతలు అని కూడా చెప్పొచ్చు. సాధారణంగా ఇలా చిన్న సినిమాలను సోలోగా రిలీజ్ చేస్తేనే బెటర్. కానీ ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ తర్వాత ఒక్క హిట్ కూడా అందుకోని కిరణ్ అబ్బవరం ఏకంగా నాగ వంశీ సినిమాతో ఢీకొనడం అనేది ఆయనతో పాటు మేకర్స్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పొచ్చు. అసలే కిరణ్ అబ్బవరం ఇప్పటి వరకు పది సినిమాలు చేసినప్పటికీ అందులో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటంటే ఒక్కటి మాత్రమే. ఆయన గత సినిమాలన్నీ నిర్మాతలను నిండా ముంచినవే. ఇలాంటి హీరోను నమ్ముకుని నిర్మాతలు దీపావళి బరిలోకి దిగడం అనేది నిజంగా తెలివి తక్కువ పనే. ఇక ఇప్పుడు బయ్యర్లు సినిమాను కొని చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా టెన్షన్ పడుతున్నారని టాక్ నడుస్తోంది. మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Related News

War 2: వార్ 2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫొటోస్ లీక్.. ఏమున్నాడ్రా బాబు

Unstoppable 4 : బాలయ్య టాక్ షోకి ‘గేమ్ ఛేంజర్’… ఇది మామూలు ప్లాన్ కాదు భయ్యో

Laggam Movie Review : ‘లగ్గం’ మూవీ రివ్యూ

Chiranjeevi : 28న చిరుకు అక్కినేని పురస్కారం… ఎవరి చేతుల మీదు గానో తెలుసా..?

RajaSaab: ఇద్దరు కాదు.. ముగ్గురు అంట.. తాతమనవడు.. ఇంకా.. ?

Kannappa : శివయ్యా… నీపైనే భారమంతా… కేదారనాథ్ యాత్రలో కన్నప్ప టీం..

Suriya: టాలీవుడ్ సీనియర్ హీరోల చుట్టూ తిరుగుతున్న తమిళ్ హీరో.. బాగానే ప్లాన్ చేశాడుగా..?

Big Stories

×