EPAPER
Kirrak Couples Episode 1

BRS: కాపు కాస్తారా?.. ఏపీలో బీఆర్ఎస్ వ్యూహం ఇదేనా?

BRS: కాపు కాస్తారా?.. ఏపీలో బీఆర్ఎస్ వ్యూహం ఇదేనా?

BRS: కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ పెడితే చాలామంది నవ్వారు. ముందు తెలంగాణలో గెలిచి చూడు, ఆ తర్వాత దేశం సంగతి చూడొచ్చంటూ సెటైర్లు వేశారు. వారంతా అలా నవ్వుతుండగానే.. పార్టీ పెట్టేశారు.. పేరు మార్చేశారు. ఆ వెంటనే ఏపీపై ఫోకస్ పెట్టారు. విజయవాడ సమీపంలో బీఆర్ఎస్ కార్యాలయం అంటూ వార్తలు వచ్చాయి. ఆంధ్రోళ్లంటూ తెగ తిట్టిపోసిన కేసీఆర్ ను ఏపీలో ఎవరు ఆదరిస్తారంటూ అంతా పెదవి విరిచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బీఆర్ఎస్ లోకి ఒక్క నాయకుడైనా చేరుతారా? అంటూ ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్ల నోళ్లు మూయిస్తూ.. న్యూ ఇయర్ రోజే మరో షాక్ ఇచ్చారు కేసీఆర్. ఏపీ నుంచి పలువురు మాజీ ఐఏఎస్, పొలిటికల్ లీడర్స్ ను బీఆర్ఎస్ లో చేర్చుకొని.. ఆంధ్రాలో గులాబీ జెండా ఎగరేశారు.


వచ్చినవాళ్లు మరీ చిన్నాచితకా లీడర్లు మాత్రం కాదు. తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు, పార్థసారధి, ప్రకాశ్ లాంటి వాళ్లు కాస్తో కూస్తో ఫేస్ వ్యాల్యూ ఉన్నవాళ్లే. తోట చంద్రశేఖర్ మూడుసార్లు ఓడిపోయారు.. అతనితో ఏమవుతుందంటూ మళ్లీ వెటకారం. కావొచ్చు, ఓడిపోతే ఓడిపోవచ్చు..కానీ, ఏపీ నుంచి బీఆర్ఎస్ లో ఎవరూ చేరరు అనేవాళ్లకు ఈ చేరికలు కచ్చితంగా షాకింగ్ విషయమే. అట్లుంటది కేసీఆర్ తోని..అంటున్నారు.

ఇది ఆరంభమే అయితే, రాబోవు రోజుల్లో మరిన్ని చేరికలు ఖాయం అనుకోవచ్చు. అయితే, మొదటి వలసల్లో మెజార్టీ జనసేన నుంచే కావడం ఆసక్తికరం. అందులోనూ కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ కు ఏపీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం మరింత ఆసక్తి రేపుతోంది. కాపు-జనసేన అనగానే ఏదో జరుగుతోందనే అనుమానం వ్యక్తం అవుతోంది.


ప్రస్తుతం ఏపీలో కాపు కేక.. కాక రేపుతోంది. వంగవీటి రాధా హడావుడి, విశాఖలో కాపు మీటింగ్, హరిరామ జోగయ్య దీక్షలతో.. కాపు రాజకీయం సలసల కాగుతోంది. ఇలాంటి ఉద్యమ అంశాలను ఒడిసిపట్టుకొని, ఉర్రూతలు ఊగేలా చేయడంలో కేసీఆర్ ఎక్స్ పర్ట్ అంటారు. అందుకే, బీఆర్ఎస్ తో ఏపీలో కాపు గొంతుకలను ఉద్యమ దిశగా నడిపిస్తారా? అందుకు, తోట చంద్రశేఖర్ ను పార్టీ తరఫున ముందుంచనున్నారా? ఇక, బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్త ప్రకాశ్ సైతం జై కేసీఆర్ అనడంతో.. బలిజలను కూడా కలుపుకునే వ్యూహమా? కాపు-బలిజ కాంబినేషన్ తో కేసీఆర్.. ఏపీలో బీఆర్ఎస్ ను పరుగులు పెట్టిస్తారా?

ఏపీలో కాపు_బీసీ ఓట్లు కీలకం. అన్నిపార్టీలు తమను వాడుకుంటున్నాయి గానీ, ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఆగ్రహంలో ఉన్నారు. పవన్ కల్యాణ్ నేమో కుల ప్రాతిపదిక రాజకీయం చేయనంటున్నారు. చంద్రబాబును కాపులు నమ్మట్లేదు. జగన్ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పేశారు. ఇలా సందిగ్థావస్థలో ఉన్న కాపులను, అధికారం దిశగా కార్యోర్ముఖులను చేయడమే కేసీఆర్-బీఆర్ఎస్ వ్యూహమా? మరి, కాపులు కేసీఆర్ పంచన చేరితే.. అది ఎవరికి లాభం? ప్రస్తుతం మెజార్టీ కాపులు జనసేనకు మద్దతుదారులుగా ఉండగా.. ప్రస్తుతం జనసేన నుంచి, కాపు వర్గం నుంచి నేతలు బీఆర్ఎస్ లో చేరడం వెనుక రాజకీయ కోణమేంటి? కాపు ఓట్లు చీల్చడమేనా? జగన్ కే మేలు జరుగుతుందా? ఇలా అనేక అనుమానాలకు త్వరలోనే క్లారిటీ రావొచ్చు.

Related News

Investments In AP: బాబు మార్క్ పాలన.. ఇంటర్నేషనల్ కంపెనీ ఏపీకి రాక.. యువతకు ఉపాధి అవకాశాలు మెండు

AP Politics: ముప్పేట దాడి.. వైయస్ జగన్ తట్టుకొనేనా.. వైసీపీకి గడ్డు కాలమేనా..

Pawan Kalyan : దేవాలయాలకు అసలైన అర్థం ఇదే.. ఇస్రో మాజీ చీఫ్ వీడియోపై పవన్ ట్వీట్

Tirumala Laddu: టెర్రరిస్ట్ లు కూడా ఈ పని చేయరు.. లడ్డు వివాదంపై అగ్ర హీరో సంచలన కామెంట్స్

Naga Babu : పెద్దల సభకు మెగా బ్రదర్ నాగబాబు ? అదే జరిగితే చిరు తర్వాత నాగబాబే !

AP Govt: రేషన్ కార్డ్ ఉంటే చాలు.. ఈ స్కీమ్ తో వేల రూపాయల ఆదా.. దీపావళి నుండే ప్రారంభం..

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Big Stories

×