EPAPER

Facial At Home: పండగ సమయంలో మెరిసిపోవాలా ? వీటితో ఇంట్లోనే ఫేషియల్ చేసుకోండి

Facial At Home: పండగ సమయంలో మెరిసిపోవాలా ? వీటితో ఇంట్లోనే ఫేషియల్ చేసుకోండి

Facial At Home: పండగ సమయంలో మరింత అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. అందు కోసం ముఖ్యంగామహిళలు కొన్ని రకాల ఫేస్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అంతే కాకుండా కొంతమంది పార్లర్‌లకు కూడా వెళుతుంటారు. ఇందుకోసం పార్లర్‌లో వేలల్లో ఖర్చు చేసే వారు కూడా లేకపోలేదు. ఇలా ఖరీదైన ఫేస్ ప్రొడక్ట్స్ కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడానికి బదులుగా ఇంట్లో ఉండే కొన్ని రకాల పదార్థాలతోనే ఫేషియల్ చేసుకోవచ్చు. అందమైన ఫేస్ కోసం ఇంట్లోనే ఫేషియల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


పెరుగుతో ఫేషియల్:

కావలసినవి: 


పెరుగు-  1 టేబుల్ స్పూన్

బియ్యం పిండి-  1 /2 టీ స్పూన్

పసుపు-  1 /2 టీ స్పూన్

తయారీ విధానం: ఈ ఫేషియల్ కోసం ముందుగా మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. తర్వాత ఇందులో పైన చెప్పిన మోతాదుల్లో పెరుగులో బియ్యం పిండితో పాటు, పసుపు కలిపి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేయండి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తో పాటు, తేనెను కూడా మిక్స్ చేయవచ్చు. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా మసాజ్ చేయాలి. అనంతరం 15 నిమిషాల తర్వాత మీ ఫేస్ శుభ్రం చేసుకోండి. ఇలా తరుచుగా చేయడం వల్ల మీ ముఖం అందంగా మెరుస్తుంది. అంతే కాకుండా చర్మంపై ముటిమలు కూడా రాకుండా ఉంటాయి. చర్మ సంరక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

పెరుగు చర్మంపై సహజ మాయిశ్చరైజర్ లాగా పని చేస్తుంది. పెరుగును వాడటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగు సహాయంతో మీరు ఫేషియల్ కూడా చేసుకోవచ్చు.

అలోవెరాతో ఫేషియల్ :

కావలసినవి:

అలోవెరా- 1 టీస్పూన్

దోసకాయ రసం- 1 టీస్పూన్

ఓట్స్ పౌడర్- 1 టీ స్పూన్

Also Read: చలికాలంలో చర్మాన్ని కాపాడుకోండిలా ?

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదుల్లో అలోవెరా జెల్, దోసకాయ రసం, ఓట్స్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిని ముఖానికి అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. వీలైతే ఈ ఫేషియల్ కోసం కాస్త రోజ్ వాటర్‌తో పాటు విటమిన్ ఇ కూడా కలపండి.

అలోవెరా జెల్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. అంతే కాకుండా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ముఖానికి అవసరమైన పోషణను కూడా అందిస్తుంది.

ముఖం అందంగా మెరిసిపోవాలంటే కొన్ని రకాల ఫేషియల్స్ తయారు చేసుకుని తరుచుగా వాడుతుండాలి. పచ్చిపాలు, పెరుగు, టమాటో, బంగాళదుంప, ముల్తాని మిట్టి, గంధం పొడి, చందనంతో పాటు వివిధ రకాల పదార్థాలు చర్మాన్ని అందంగా చేస్తాయి. వీటిని తరుచుగా ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం అందంగా మెరుస్తుంది. అంతే కాకుండా ఫేస్‌పై మొటిమలు కూడా రాకుండా ఉంటాయి

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Curry Leaves Hair Mask: కరివేపాకుతో హెయిర్ మాస్క్.. ఇది వాడితే జుట్టు రాలే సమస్యే ఉండదు

Face Serum: నారింజ తొక్కలతో ఫేస్ సీరం.. అందమైన చర్మం మీ సొంతం

Frogs Health Benefits: కప్పలు తింటే ఇన్ని లాభాలున్నాయా? పదండ్రా పట్టుకొద్దాం!

Pimples On Face: వీటిని వాడితే మీ ముఖంపై మొటిమలు రమ్మన్నా.. రావు

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అది తినకుండా రోజును ప్రారంభిస్తే ఏమవుతుందంటే?

Spotting and Periods: పీరియడ్స్‌కు, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను పీరియడ్స్ అనుకోవద్దు

Boneless Chicken Pickle: బోన్ లెస్ చికెన్ పికిల్ ఇలా సరైన కొలతలతో చేసి చూడండి రుచి అదిరిపోతుంది

Big Stories

×