EPAPER

Running Mistakes: రన్నింగ్ సమయంలో ఈ పొరపాట్లు చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా ?

Running Mistakes: రన్నింగ్ సమయంలో ఈ పొరపాట్లు చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా ?

Running Mistakes: రన్నింగ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శరీరం ఫిట్‌గా ఉండాలంటే ఖచ్చితంగా రన్నింగ్ అలవాటు చేసుకోవాలి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి కూడా రన్నింగ్ ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే రన్నింగ్ చేసేటప్పుడు చాలా మంది కొన్ని  పొరపాట్లు చేస్తుంటారు. కానీ వాకింగ్, రన్నింగ్ సమయంలో తప్పకుండా కొన్ని రకాల విషయాలను తప్పకుండా గుర్తుచుకోవాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.


శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రన్నింగ్ ఒక గొప్ప వ్యాయామం. ఆరోగ్యంగా ఉండటానికి రన్నింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, రన్నింగ్‌కు ముందు, రన్నింగ్ సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయకపోతే, రన్నింగ్ వల్ల ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుంది. మీరు రన్నింగ్ ప్రారంభించబోతున్నట్లయితే, కొన్ని విషయాలను అస్సలు మరచిపోవద్దు. రన్నింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది చేసే కొన్ని సాధారణ తప్పులు, వాటి పరిష్కారాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రన్నింగ్ సమయంలో గుర్తుంచుకోవలసిన 7 విషయాలు


అధిక పరుగు సమస్య: రన్నింగ్ మొదలు పెట్టిన సమయంలోనే ప్రారంభంలో ఎక్కువగా పరుగెత్తడం వల్ల కండరాల ఒత్తిడి ,నొప్పి వస్తుంది.
పరిష్కారం: మీ పరుగు వ్యవధిని క్రమంగా పెంచండి. ప్రారంభంలో చిన్న దూరాలను టార్గెట్‌గా పెట్టుకోండి. ఆ తర్వాత మీ వేగాన్ని, సమయాన్ని క్రమంగా పెంచండి.

అసౌకర్యవంతమైన షూస్ : అసౌకర్యవంతమైన షూస్ మీ రన్నింగ్‌కు హాని కలిగిస్తాయి. అంతే కాకుండా గాయాలకు కూడా దారితీస్తాయి.
పరిష్కారం: మంచి స్పోర్ట్స్ షూ దుకాణానికి వెళ్లి మీ పాదాల ఆకారం, మీరు నడుస్తున్న విధానాన్ని బట్టి షూలను ఎంచుకోండి.

ఎక్కువగా పరిగెత్తడం: ఎక్కువగా పరిగెత్తడం, కూల్-డౌన్ చేయకపోవడం కండరాల ఒత్తిడి, బెణుకుకు కారణమవుతుంది.
పరిష్కారం:రన్నింగ్‌కు ముందు 5-10 నిమిషాలు తేలికపాటి వ్యాయామం చేయండి. తర్వాత 5-10 నిమిషాలు రన్నింగ్ చేయండి.

సరిగ్గా రన్నింగ్ చేయకపోవడం: నిటారుగా ఉండి రన్నింగ్ చేయకపోవడం వల్ల వెన్ను, మోకాలు, తుంటి నొప్పులు వస్తాయి.

పరిష్కారం: నిటారుగా నిలబడి పరుగెత్తండి. మీ తల ఎత్తుగా, భుజాలు రిలాక్స్‌గా, మీ కోర్ కండరాలను బలంగా ఉంచండి.

ఒకే ఉపరితలంపై పరుగెత్తడం: ఎల్లప్పుడూ ఒకే ఉపరితలంపై పరుగెత్తడం వల్ల కీళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాకుండా గాయాలకు దారితీస్తుంది.
పరిష్కారం: గడ్డి, ట్రాక్‌లు, ట్రెడ్‌మిల్స్ వంటి వివిధ రకాల ఉపరితలాలపై రన్నింగ్ చేయండి.

Also Read: స్కిన్ అలర్జీతో ఇబ్బంది పడుతున్నారా ? వీటిని వాడండి

తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం: ప్రతి రోజు రన్నింగ్ చేయడం వల్ల శరీరం కోలుకోవడానికి సమయం ఉండదు. ఇది అలసటకు దారితీస్తుంది.
పరిష్కారం: వారానికి ఒకటి లేదా రెండు రోజులు విశ్రాంతి తీసుకోండి.

నీరు సరిగ్గా త్రాగకపోవడం: నీటి కొరత నిర్జలీకరణానికి కారణమవుతుంది. అంతే కాకుండా మీ శరీర పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది.
పరిష్కారం: రన్నింగ్‌కు ముందు, రన్నింగ్ సమయంలో, తర్వాత కూడా తగినంత నీరు త్రాగాలి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Face Serum: నారింజ తొక్కలతో ఫేస్ సీరం.. అందమైన చర్మం మీ సొంతం

Frogs Health Benefits: కప్పలు తింటే ఇన్ని లాభాలున్నాయా? పదండ్రా పట్టుకొద్దాం!

Pimples On Face: వీటిని వాడితే మీ ముఖంపై మొటిమలు రమ్మన్నా.. రావు

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అది తినకుండా రోజును ప్రారంభిస్తే ఏమవుతుందంటే?

Spotting and Periods: పీరియడ్స్‌కు, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను పీరియడ్స్ అనుకోవద్దు

Boneless Chicken Pickle: బోన్ లెస్ చికెన్ పికిల్ ఇలా సరైన కొలతలతో చేసి చూడండి రుచి అదిరిపోతుంది

Social Media Age Restriction: ఆ వయస్సు పిల్లలు మొబైల్ చూస్తే ఇక అంతే.. నార్వే సర్కార్ కీలక నిర్ణయం!

Big Stories

×