EPAPER

Prabhas: డార్లింగ్ గురించి ఎవరికీ తెలియని 10 రహస్యాలు ఇవే..!

Prabhas: డార్లింగ్ గురించి ఎవరికీ తెలియని 10 రహస్యాలు ఇవే..!

Prabhas.. యావత్ సినీ ప్రేమికులు ముద్దుగా పిలుచుకునే డార్లింగ్ ప్రభాస్ (Prabhas ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన నటనతో అంతకుమించి సహాయ సహకారాలతో అటు అభిమానుల గుండెల్లోనే కాదు ఇటు ప్రజల గుండెల్లో కూడా శాశ్వతంగా నిలిచిపోతారు అనడంలో సందేహం లేదు. ఆయనతో పని చేసే ఎంతోమంది కార్మికులు, సినీ సెలబ్రిటీలు కూడా ప్రభాస్ తో సినిమా అంటే ఎగిరి గంతేస్తారు. ప్రభాస్ సినిమాలో ఒక్క ఛాన్స్ వచ్చిందంటే ఇక వారికి తిరుగు ఉండదు అనేది వారి అభిప్రాయం. ఇదిలా ఉండగా సాధారణంగా ఏ సినిమాలో అయినా సరే షూటింగ్ సమయంలో నిర్మాతలే సినిమా కోసం పనిచేసే వారికి భోజనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభాస్ సినిమాలో అయితే ప్రభాస్ స్వయంగా ప్రతిరోజు తన ఇంటి నుంచి సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు భోజనాలు తెప్పిస్తారు. ఇదే ఆయన గొప్పతనానికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇకపోతే ఈరోజు డార్లింగ్ పుట్టినరోజు.. ఆయన పుట్టినరోజును దేశవ్యాప్తంగానే కాదు విదేశాలలో కూడా ఆయన అభిమానులు చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని పది నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.


ప్రభాస్ ఈరోజు 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు.

ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. ప్రభాస్ ఇంట్లో చిన్నవాడు. ఈయనకు అన్నయ్య ప్రబోధ్,అక్క ప్రగతి కూడా ఉన్నారు.


ఈయన విద్యాభ్యాసం భీమవరంలోని డిఎన్ఆర్ స్కూల్లో పూర్తి కాగా ఆ తర్వాత శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకొని ఆ తర్వాత తాను హోటల్ ఏర్పాటు చేయాలి అని అనుకున్నాడు. కానీ హీరోగా మారిపోయారు.

హిందీలో ప్రభాస్ మొదటిసారి యాక్షన్ జాక్సన్ అనే చిత్రంలో అతిథి పాత్ర పోషించారు.

బ్యాంకాక్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని కలిగి ఉన్న మొదటి సౌత్ స్టార్ హీరో కూడా ఈయనే.

బాహుబలి సినిమా కోసం తనను తాను ప్రిపేర్ అవడానికి తన ఇంట్లో ఒక వాలీబాల్ కోర్టును కూడా ఏర్పాటు చేసుకున్నారు ప్రభాస్.

అంతేకాదు ఈ సినిమా కోసం నాలుగేళ్ల కేటాయించగా ఆ సమయంలో మరో సినిమా ప్రకటించకపోవడం గమనార్హం.

ప్రభాస్ కు ఇష్టమైన నటుడు రాబర్ట్ డి నిరో..

బాహుబలి కోసం మిస్టర్ వరల్డ్ 2010 లక్ష్మణ్ రెడ్డి వద్ద శిక్షణ తీసుకున్నారు.

అంతేకాదు శిక్షణలో భాగంగా బాహుబలి పాత్ర కోసం 30 కిలోల బరువు కూడా పెరిగారు ప్రభాస్.

బాహుబలి సినిమా తర్వాత అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక అలా చెప్పుకుంటూ పోతే ప్రభాస్ గురించి తెలియని ఎన్నో విషయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా యావత్ దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు పండుగలా పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.

Related News

War 2: వార్ 2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫొటోస్ లీక్.. ఏమున్నాడ్రా బాబు

Unstoppable 4 : బాలయ్య టాక్ షోకి ‘గేమ్ ఛేంజర్’… ఇది మామూలు ప్లాన్ కాదు భయ్యో

Laggam Movie Review : ‘లగ్గం’ మూవీ రివ్యూ

Chiranjeevi : 28న చిరుకు అక్కినేని పురస్కారం… ఎవరి చేతుల మీదు గానో తెలుసా..?

RajaSaab: ఇద్దరు కాదు.. ముగ్గురు అంట.. తాతమనవడు.. ఇంకా.. ?

Kannappa : శివయ్యా… నీపైనే భారమంతా… కేదారనాథ్ యాత్రలో కన్నప్ప టీం..

Suriya: టాలీవుడ్ సీనియర్ హీరోల చుట్టూ తిరుగుతున్న తమిళ్ హీరో.. బాగానే ప్లాన్ చేశాడుగా..?

Big Stories

×