EPAPER

Bigg Boss 8 Telugu : విష్ణు ప్రియా హార్ట్ బ్రేక్ చేసిన పృథ్వి .. గుండెలు పగిలేలా ఏడ్చిన విష్ణు..!

Bigg Boss 8 Telugu : విష్ణు ప్రియా హార్ట్ బ్రేక్ చేసిన పృథ్వి .. గుండెలు పగిలేలా ఏడ్చిన విష్ణు..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 ఎనిమిదోవ వారం నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం నామీనేషన్స్ ఏ రేంజ్ లో సాగాయో రాత్రి జరిగిన ఎపిసోడ్ లో చూసాము. 8వ వారం నామినేషన్స్‌లో అటు పృథ్వీ ఇటు విష్ణుప్రియను మిగిలిన కంటెస్టెంట్స్ వాయించేశారు. అసలు మీరిద్దరూ సింగిల్‌గా ఎక్కడా కనిపించట్లేదు.. చాలా వారాలుగా గేమ్ కూడా ఏం కనిపించట్లేదు అంటూ ఒకరి తర్వాత ఒకరు నామినేషన్స్ వేశారు. ముఖ్యంగా ప్రేరణ అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. ఇక విష్ణుప్రియ నోటి నుంచి పృథ్వీపై ఉన్న ఇష్టాన్ని అందరిముందు బయటపెట్టేలా చేసింది.. ఈ వారం విష్ణు ప్రియా, పృథ్వి, నిఖిల్, ప్రేరణ, నయని పావని, మెహబూబ్ లు నామినేషన్లో ఉన్నారు. హరి తేజను గౌతమ్ సేవ్ చెయ్యడంతో నామినేషన్ నుంచి బయట పడింది. ఇక పృథ్వీ విష్ణు మనసును ముక్కలు చేసాడు. నిన్నటి ఎపిసోడ్ లోని హైలెట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..


నామినేషన్ ప్రక్రియ అయ్యాక కన్నడ బ్యాచ్ పృథ్వికి ఓ రెంజులో క్లాస్ పీకుతారు. యష్మీ, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ కలిసి ముచ్చట పెట్టారు. నిఖిల్‌కి ప్రేరణ మసాజ్ చేస్తుండగా పృథ్వీతో యష్మీ సీరియస్ డిస్కషన్ పెట్టింది. నేను పృథ్వీ ఒక ఫ్రెండ్‌గా చెబుతున్నా విను.. నాకే మిమ్మల్ని చూసి చూసి విసుగొచ్చింది. అసలు పృథ్వికి మాట్లాడే ఛాన్స్ విష్ణు ప్రియా ఇవ్వలేదు. వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టేస్తారు. తను జస్ట్ ఫ్రెండ్.. అంతేనా అని యష్మీ అంటే మళ్లీ అవును అన్నాడు. ఎందుకు హౌస్‌లో ఉన్న మిగిలిన వాళ్లతో కాకుండా తనతో ఎందుకు క్లోజ్‌గా ఉంటావ్.. అంటూ యష్మీ అడిగింది. అలా ఏం లేదు తను వస్తే మాట్లాడతా.. నేను వెళ్లి మాట్లాడేది తక్కువే అంటూ పృథ్వీ అన్నాడు. ఇక పృథ్వి స్ట్రాంగ్ అవుతాడు. ఎలాగైనా విష్ణుకు అర్థమయ్యేలా చెప్పాలని ఫిక్స్ అవుతాడు. బెడ్ మీద ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. అందరు మనల్ని టార్గెట్ చేసారు. గేమ్ ఆడటానికి నేను ఇక్కడకు వచ్చాను. నువ్వు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావని అందరు అంటున్నారు. నీ మనసులో ఏముంది చెప్పు అని అంటాడు పృథ్వీ..

ఇక విష్ణుప్రియతో ఎవరు మాట్లాడాడు పృథ్వీ. నీకు ఏమైనా మనం ఓవర్ అయినట్లు అనిపిస్తుందా హౌస్‌లో అంటూ పృథ్వీ అడిగితే నో అంటూ విష్ణు అంది. నేను నీకు క్లారిటీ ఇచ్చా కదా నాకు ఎలాంటి రిలేషన్ షిప్ వద్దు అని.. నాకు సింగిల్‌గా ఉండటమే ఇష్టం.. నీకు ఆ క్లారిటీ ఉంటే ఫైన్.. లేదు నీకు ఏదైనా నా మీద లైట్‌గా ఇది అనిపిస్తుంది అంటే చెప్పు.. ఇక ఆపేద్దాం అని అంటాడు. ఓకే అని అంటుంది. హౌస్ లో మన గురించి వేరేలా అనుకుంటున్నారు ఇక ఆపేద్దాం అని పృథ్వి ఒక్కమాట తో బ్రేకప్ చెప్పేస్తాడు. ఇక రాత్రి లోపలకు రాగానే నభీల్ అడుగుతాడు. దానికి విష్ణు గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఇక ఇవాళ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తారేమో చూడాలి..


Related News

Bigg Boss 8 Telugu Promo: యష్మీపై అరిచిన గౌతమ్.. ఓజీ టీమ్ కోసం నబీల్ ఫైట్, ఈసారి మెగా చీఫ్ అయ్యేదెవరు?

Bigg Boss 8 Telugu Promo : పృథ్వీ vs టేస్టీ తేజ.. మీలో ఎవరు తెలివైన వారు..?

Bigg Boss 8 Telugu: రాయల్స్ టీమ్‌లో మనస్పర్థలు.. నయని పావని, ప్రేరణ మాటంటే లెక్కే లేదు!

Bigg Boss 8 Telugu: ముందడుగు వేసిన ఓజీ టీమ్.. గంగవ్వ అధిక ప్రసంగం, ఆ మాటలకు కంట్రోల్ లేదా?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌లో మరో మిడ్ వీక్ ఎలిమినేషన్.. మళ్లీ అదే రిపీట్

Bigg Boss 8 Telugu Promo: పరువు పోగొట్టుకుంటున్న ఓజీ టీమ్.. ‘సై’ సినిమా రేంజ్‌లో నిఖిల్ మోటివేషన్

Bigg Boss 8 Telugu :బయటకొచ్చిన బిగ్ బాస్ పోలింగ్ వివరాలు… ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్..

Big Stories

×