EPAPER

Yash: సీతగా సాయిపల్లవి.. అందుకే రావణుడుగా చేశా

Yash: సీతగా సాయిపల్లవి.. అందుకే రావణుడుగా చేశా

Yash:  ఏ నటుడికి అయినా  తన కెరీర్ లో ఎన్ని సినిమాలు తీసాం అన్నది ముఖ్యం కాదు.. ఏ సినిమా  తన జీవితాన్ని మార్చేసింది అనేది ముఖ్యం. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా  ఒక సాధారణ హీరోను పాన్ ఇండియా స్టార్ గా చేసింది. ఇండస్ట్రీ మొత్తానికి పరిచయం చేసింది. ఎక్కడికి వెళ్లినా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చిపెట్టింది. ఆ హీరో ఎవరో  కాదు కన్నడ నటుడు యష్. అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా కెజిఎఫ్.


ప్రశాంత్ నీల్  దర్శకత్వం వహించిన కెజిఎఫ్ సినిమా యష్ జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా తరువాత యష్ స్టార్ హీరోగా మారాడు. కేవలం కన్నడలోనే కాకుండా పాన్ ఇండియా మొత్తం అతడిని రాఖీ భాయ్ అని పిలుస్తోంది. ఇక ఈ సినిమా తరువాత యష్ .. కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కెజిఎఫ్ తరువాత తన ఫ్యాన్స్ ఎలాంటి అంచనాలను  పెట్టుకున్నారో అలాంటి సినిమాతోనే రావడం కోసం చాలా ఏళ్లు కష్టపడి చివరికి టాక్సిక్ అనే సినిమాను అనౌన్స్ చేశాడు.  గీతూ మోహన్ దాస్ దర్శకత్వ వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే  సెట్స్ మీదకు వెళ్లనుంది.

NBK 109 : బాలయ్య సినిమాకు అల్లు అర్జున్ సెంటిమెంట్… అందుకే ఆ రిలీజ్ డేట్ పై కన్ను


ఇక ఈ సినిమా కాకుండా యష్ నటిస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ రామాయణం.  బాలీవుడ్ స్టార్ డైరెక్టర్  నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్,  మధు మంతెన  అత్యంత  భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి లీకైన ఫోటోస్ లో సీతారాములుగా రణబీర్, సాయిపల్లవి చూడడానికి ఎంతో అందంగా కనిపించారు.

ఇక ఇప్పటివరకు హీరోగా చేసిన యష్ మొదటిసారి  రావణుడిగా కనిపించనుండడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని దాటాయి. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్ లోకి యష్ అడుగుపెడతాడా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా  యష్ ముంబైలో సందడి చేశాడు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ముఖ్యంగా సీత పాత్రకు సాయిపల్లవినే ఎందుకు ఎంపిక చేశారు అన్నదానికి యష్ తన రీతిలో సమాధానం చెప్పుకొచ్చాడు.

Shriya Saran: అన్నం తింటుందా.. అందం తింటుందా.. ఆ వయస్సులో కూడా ఇంత హాట్ ఏంట్రా బాబు..

” సాయిపల్లవి చాలా గొప్ప నటి.  రామాయణం అనుకున్నప్పుడు సౌత్, నార్త్ నటీనటులను మొత్తం కలపాలి అనుకున్నాం.  రాముడిగా రణబీర్ ను మేము అనుకున్నాం. కానీ, సాయిపల్లవినే సీతగా చేయాలనీ  నితేష్ తివారీ ఎప్పుడూ కోరుకునేవాడు. కాబట్టి మేమంతా కలిసికట్టుగా ఆ నిర్ణయం తీసుకున్నాం.  ఆ పాత్రకు ఆమె తగినది.

ఇక నా పాత్ర విషయానికొస్తే.. రావణుడుగా కాకుండా నితీష్  నాకు వేరే పాత్రను ఇచ్చి ఉంటే ఖచ్చితంగా నో చెప్పేవాడిని.  రావణుడు పాత్ర అనేసరికి నేను  ఎస్ చెప్పాను. ఎందుకంటే.. ఒక నటుడిగా రావణుడు పాత్రలో నటించడం నాకు ఇష్టం. ఆ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. అందుకే రావణుడుగా చేయడానికి ఒప్పుకున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యష్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో బాలీవుడ్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. 

Related News

Urvashi Rautela: నాకు, బాలకృష్ణకు 34 ఏళ్ల ఏజ్ గ్యాప్, అదే పెద్ద అడ్వాంటేజ్.. హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్

High Court on Allu Arjun: హైకోర్టులో అల్లుఅర్జున్ కు ఊరట.. అప్పటి వరకు చర్యలు వద్దంటూ ఆదేశం..

Kanguva: ‘కంగువ’లో ఊహించని గెస్ట్ రోల్.. ప్రేక్షకులను ఆటపట్టిస్తున్న సూర్య

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ పొలిటికల్ ఎంట్రీ.. ఆయన ఏమన్నాడంటే.. ?

Sai Durgha Tej: ఇప్పటివరకు ‘విరూపాక్ష’ చూడలేదు, మెగా హీరోలంతా కలిస్తే అదే టాపిక్.. సాయి దుర్గా తేజ్ కామెంట్స్

Priyanka Chopra : ఆ హీరోలతో ముద్దులు, నాతో మాత్రం హద్దులు… ప్రియాంక చోప్రాపై సీనియర్ నటుడి కామెంట్స్

Alia Bhatt: అలియాకు పక్షవాతం.. సిగ్గులేదు అంటూ మండిపడ్డ బ్యూటీ

Big Stories

×