EPAPER

Telangana BJP Leaders: హైకమాండ్‌ను లెక్క చేయని టీ-బీజేపీ?

Telangana BJP Leaders: హైకమాండ్‌ను లెక్క చేయని టీ-బీజేపీ?

Telangana BJP Leaders: తెలంగాణ బీజేపీ నేతలకు మెంబర్‌షిప్ డ్రైవ్ భయం పట్టుకుందా..? మెంబర్‌షిప్ టార్గెట్ రీచ్ కాకుంటే తమ పోస్టులకు ఎసరు వచ్చే ప్రమాదం ఉందని నేతలు ఆందోళన చెందుతున్నారా? సభ్యత్వ నమోదు ఇన్చార్జ్ అభయ్ పాటిల్ పెట్టిన టార్గెట్ కాషాయ నేతల్ని టెన్షన్ పెడుతుందా? అసలు హైకమాండ్ గడువు పెంచినా కూడా రాష్ట్ర నేతలు మెంబర్‌షిప్ టార్గెట్ సగం కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారు? మెంబర్షిప్ కమిటి ఉండగానే మరో కమిటీ వెయడం వెనక మతలబేంటి..? ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అంత షార్ట్ పీరియడ్ లో బీజేపీ టార్గెట్ రీచ్ అవుతుందా..?


బీజేపీ దేశ వ్యాప్తంగా సభ్యత్వ నమోదును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని టార్గెట్ పెట్టింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలవడంతో పాటు, దాదాపు 37 లక్షల పైచిలుకు ఓట్లను సాధించి జోష్ మీదున్న రాష్ట్ర బీజేపీకి అధిష్టానం ఈ టార్గెట్ అప్పజెప్పింది. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను చూసి బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణకు భారీ స్థాయిలో టార్గెట్ ఫిక్స్ చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్​ట్ర బీజేపీలో అనుకున్న స్థాయిలో ఎలాంటి యాక్టివిటీస్ లేకపోవడంతో హైకమాండ్ ఇచ్చిన టార్గెట్ ను రీచ్ అవ్వడం రాష్ట్ర నాయకత్వానికి సవాలుగా మారింది.

బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొదట్లో మెంబర్ షిప్ డ్రైవ్ ను ఉత్సాహంగానే ప్రారంభించింది. కానీ అనుకున్న స్థాయిలో మద్దతు లభించడం లేదనే చర్చ జరుగుతుంది. నేతల నుంచి పూర్తి స్థాయిలో సహకారం లేకపోవడంతో నేటికీ దాదాపు 20 లక్షల సభ్యత్వాలు మాత్రమే చేయించగలిగారు. తెలంగాణలో బీజేపీ చేపట్టిన సబ్యత్వ నమోదు డ్రైవ్ ద్వారా మొత్తం 20 లక్షల సభ్యత్వాలు నమోదైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత నెల 8న నుంచి ఈ మెంబర్‌షిప్ ప్రక్రియ ప్రారంభమైంది. వాస్తవానికి ఈ డ్రైవ్ ను సెప్టెంబర్ 2 నుంచే ప్రారంభించాలని పార్టీ భావించినా భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేసింది. గత నెల 8న కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి దాన్ని ప్రారంభించారు.


అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 20 లక్షల వరకు సభ్యత్వాలు నమోదవ్వగా అందులో 14 లక్షలు నేరుగా మరో 6 లక్షలకు పైగా సభ్యత్వాలు మిస్డ్ కాల్ ద్వారా వచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సభ్యత్వ నమోదుకు కమలం పార్టీ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రభారీల పేరుతో ఇన్చార్జులను నియమించింది. అయినా సకాలంలో సగం లక్ష్యాన్ని కూడా రీచ్ కాకపోవడంతో అధిష్టానం గడువు పొడిగించింది. ఇప్పుడా గడువు కూడా నాలుగు రోజుల్లో ముగియనుంది. కాని సగం సభ్యత్వాలు కూడా కంప్లీట్ అవ్వకపోవడంపై పార్టీ హైకమాండ్ ఆగ్రహంగా ఉందంటున్నారు.

Also Read:  కారుతో గుద్ది, కత్తితో పొడిచి.. కాంగ్రెస్ నేత దారుణ హత్య

గత నెలలో తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సభ్యత్వ నమోదు కంప్లీట్ అవ్వకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. మరో 15 రోజులు డెడ్ లైన్ విధించి వెళ్లారు. 15 రోజుల తర్వాత మరోసారి రివ్యూ నిర్వహిస్తానని, అప్పటి వరకు కంప్లీట్ అవ్వాలని స్పష్టంచేశారు. ఆ డెడ్ లైన్ ముగిసినా దాదాపు 20 లక్షల సభ్యత్వాలే చేయడంపై హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ గడువును మరోసారి పొడిగించారు. ఈనెల 24 వరకు కంప్లీట్ చేయాలని ఆదేశించారు. అంటే మరో 3 రోజులు మాత్రమే మిగులుంది.

ఇంత తక్కువ సమయంలో ఇంకా 30 లక్షల సభ్యత్వాలు చేయడం సాధ్యమేనా..? అనే సందేహాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ఆ క్రమంలో తొలుత నిమమించిన ఇన్చార్జులకు అదనంగా తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పార్టీలో కీలక నేతలకు మెంబర్‌షిప్ బాధ్యతలు అప్పగించారు. కానీ అందులో కొందరు ఇన్చార్జులుపట్టించుకోకపోవడం, పట్టించుకున్నా రాష్ట్ర నాయకత్వం వారి మాట వినకపోవడం, నేతల మధ్య సమన్వయ లోపాలు, రోజు ఏదోక పంచాయితీతో రచ్చచేయడం వంటి అంశాలు సభ్యత్వ నమోదుకు అడ్డంకులయ్యాయని తెలుస్తోంది.

అందుకే వారిని తొలగించి కొత్త సమష్యను తెచ్చిపెట్టుకోవడం కన్న పాత కమిటీని అలాగే కొనసాగించి అదనంగా కీలక నేతలకు సభ్యత్వ నమోదుపై సమీక్షలు చేపట్టాలని ఆయ జిల్లాల బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇన్చార్జులను అసంతృప్తికి గురిచేస్తే పార్టీకి డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశ్యంతో సభ్యత్వ నమోదుపై రివ్యూ బాధ్యతలు ఇతరులకు కేటాయించారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

మొత్తానికి బీజేపీ జాతీయ నాయకత్వం ఇచ్చిన టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు స్టేట్ నాయకత్వం చేస్తున్న కసరత్తు ఫలిస్తుందా.? అంతర్గత కుమ్ములాటలతో సభ్యత్వ నమోదులో విఫలమవుతారా? ప్రభారీలుగా పిలుచుకునే ఇన్చార్జులతో పాటు అదనంగా సభ్యత్వ నమోదు సమీక్షల పేరిట జిల్లాల బాధ్యతలు అప్పగించిన నేతలు రోజుల వ్యవధిలో 30 లక్షల టార్గెట్ ను రీచ్ అవుతారా..? లేదా..? అనేది అటుంచుతే సభ్యత్వ నమోదు ఇంచార్జీగా వున్న అభయ్ పాటిల్ మాత్రం రాష్ట్ర నేతల తీరుపై గుర్రుగా వున్నారంటున్నారు. ఇప్పటికే ఆయన పలుమార్లు నేతలకు సభ్యత్వ నమోదుపై సీరియస్ గా సూచనలు చేసి వున్నారు. మరి రాష్ట్ర నేతలు తమ ఇచ్చిన భాద్యతలను సక్రమంగా నిర్వహించి, టార్గెట్ రీచ్ అయ్యి అభయ్ పాటిల్ దగ్గర మార్కులు కొట్టేస్తారా ? లేక ఆయన ఆగ్రహానికి గురవుతారా? అనేది చూడాలి.

Related News

Artificial Intelligence: చనిపోయినవాళ్లు తిరిగి వస్తారా? AIతో అది సాధ్యమేనట.. ఇదిగో ఇలా!

Terrorist attacks in Kashmir: కశ్మీర్‌లో ఉగ్ర దాడులు.. ఇండియన్ ప్లాన్ ఏంటి?

YCP Leaders: కథ అడ్డం తిరిగింది.. వైసీపీ లీడర్లకు సన్ స్ట్రోక్

Chandrababu – TTD: బాబుకు కొత్త తలనొప్పి.. టీటీడీ బోర్డు సంగతేంటి?

Terrorist Attack: కథ మళ్లీ మొదటికే! సీఎం నియోజకవర్గంలో ఉగ్ర దాడులు.. వారిని తుడిచి పెట్టలేమా?

US – ISIS: ప్రపంచాన్ని వణికిస్తున్న ISISకు ప్రాణం పోసింది అమెరికానా? చరిత్ర చెబుతోన్న వాస్తవాలేంటీ?

Big Stories

×