EPAPER

Karan Johar : ‘దేవర ‘ నిర్మాతకు కోలుకోలేని షాక్..అమ్మకానికి ఆస్తులు..?

Karan Johar : ‘దేవర ‘ నిర్మాతకు కోలుకోలేని షాక్..అమ్మకానికి ఆస్తులు..?

Karan Johar : బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ( Karan Johar ) పేరు తెలియని వాళ్ళు ఉండరు. యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా పలు సినిమాలను నిర్మించడంతో పాటుగా సెలెబ్రేటిలతో ఇంటర్వ్యూలు చేస్తూ బాలీవుడ్ తో పాటుగా తెలుగులో కూడా ఈయన పేరు వినిపిస్తుంది. దేశ వ్యాప్తంగా ఈయన అంతగా పాపులర్ అయ్యారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మా ప్రోడక్షన్ ద్వారా ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు. ఈయన గురించి ఓ షాకింగ్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈయన ఆర్థిక ఇబ్బందులతో సతమత మవుతున్నారట. అందుకే ఒక్కొక్కటిగా ఆస్తులను అమ్ముకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలంగా మారింది.. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం..


ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి మామూలు హీరో, హీరోయిన్లుగా స్టార్స్ హోదాలో ఘనత ఆయనకే సొంతం. కేవలం ఒక హిందీలోనే కాకుండా దేశంలోని చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి సినిమాకి ఆయన సపోర్ట్ చేస్తూ తన ప్రొడక్షన్ హౌజ్ ధర్మతో దూసుకెళ్తున్నాడు. ఈ సంస్థ నుంచి వందల సినిమాలు బయటకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే మరోవైపు హోస్ట్ గా ‘కాఫీ విత్ కరణ్’ మాత్రమే కాకుండా హోస్ట్ చేసిందల్లా బంగారమే అన్నట్లు ప్రతిదీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే, తాజాగా ఆయన తన ప్రొడక్షన్ ‘ధర్మ’ని అమ్మకానికి పెట్టాడని వార్తలు వైరల్ గా మారాయి. అందుకు కారణం ఎన్టీఆర్ దేవర సినిమా కూడా ఒక కారణం అని తెలుస్తుంది.

రీసెంట్ గా తెలుగు మూవీ దేవర సినిమా హిందీ హక్కులను ఈయన భారీ ధరకు సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాకు 55 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. హిందీ లో మంచి రేటింగ్స్ వచ్చినప్పటికీ కూడా ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా హిందీ రైట్స్ ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ భారీ రేట్ కి కొనుగోలు చేసారు. సినిమా వల్ల నష్టాలు ఎం జరగలేదు కానీ ప్రస్తుతం ఈయన సగం ఆస్తులను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తుంది. ఇక అదర్ పూనావాలా సుమారుగా 1000 కోట్ల రూపాయిల పెట్టుబడులు కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’ లో పెట్టాడు. ఈ ధర్మ ప్రొడక్షన్స్ లోని 50 శాతం వాటా అదర్ పూనావాలా నిర్మాణ సంస్థ అయినటువంటి సెరెన్ ప్రొడక్షన్స్ దక్కించుకోనుంది. అయితే ఇది 2000 కోట్ల ప్రాపఫ్టీ.. అతనికి వెయ్యి కోట్లు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 1000 కోట్ల ఆస్తులను వారికి ఇచ్చినట్లు టాక్.. ఇక దీనిపై వార్తలు మొదలయ్యాయి. కరణ్ జోహార్ భాగస్వామ్యం కోసం మరొకరితో చేతులు కలపాల్సి వచ్చింది?, ప్రస్తుతం ‘ధర్మ ప్రొడక్షన్స్’ సంస్థ నష్టాల్లో నడుస్తుందా?, నెలసరి ఆదాయం బాగా తగ్గిపోయిందా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా కరణ్ జోహార్ ఆస్తులు అమ్మకాల పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Related News

Samantha : విడాకులపై మళ్ళీ స్పందించిన సమంత.. అలా ఉండాల్సిందంటూ కామెంట్..!

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ కు విముక్తి, సిట్టింగ్స్ షురూ

Game Changer: రెండు రాష్ట్రాలలో నాలుగు సినిమాలకి ఒకరే డిస్ట్రిబ్యూటర్

Richest Singer : ఈ సింగర్ ముందు షారుక్ కూడా దిగదుడుపే.. అసలు మేటర్ ఏంటంటే..?

Devara: ఒక మంచి సినిమా తీయడమే కాదు కరెక్ట్ టైం కి రిలీజ్ చేయడం కూడా అవసరం

Anil Ravipudi: ఖచ్చితంగా సంక్రాంతికి వస్తారు

SS Rajamouli : ట్రిపుల్ ఆర్ సినిమాను మించిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు

Big Stories

×