Astrology 22 october 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.
మేషం:
మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. కీలకమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మంచిది.
వృషభం:
వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్ని రంగాల వారికి ఆటంకాలు ఎదురుకావొచ్చు. వచ్చిన అవకాశాలు చేజారిపోవచ్చు. కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉండాలి. అనవసర విషయాల్లో దూరవద్దు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శివ నామాన్ని జపించాలి.
మిథునం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉండవచ్చు. అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్టదేవతారాధన శుభకరం.
కర్కాటకం:
కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో అనుకున్న సమయానికి పనులు నెరవేరుతాయి. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటారు. ఉద్యోగులకు అప్పగించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గ ధ్యానం చేస్తే మంచిది.
సింహం:
సింహ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక పురోగతి ఉంటుంది. పెండింగ్ సమస్యలు తీరుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవకాశాలు మెండుగా ఉంటాయి. శివారాధన శ్రేయస్కరం.
కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో పెద్దల సహకారం ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థిక లాభాలు వరిస్తాయి. అవసరానికి సహాయం అందుతుంది. ఇబ్బందులు ఎదురైనా చివరికి విజయం సాధిస్తారు. గిట్టనివారితో ఆఛితూచి వ్యహరించాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
Also Read: లాఫింగ్ బుద్దా ఎవరో తెలుసా? ఆ విగ్రహం అంత పాపులర్ కావడానికి కారణాలు ఇవే
తుల:
తుల రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారులకు అనుకున్న లాభాలు ఉంటాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు పూర్తిచేస్తారు. ఉద్యోగులు తమ సహచరులతో కలిసిమెలిసి ఉంటారు. విందు కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారంలో ఊహించని ధనలాభాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదేవతారాధన శుభప్రదం.
వృశ్చికం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఊహించని లాభాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో ఆచితూచి వ్యహరించాలి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కొన్ని పనులు వాయిదా వేస్తేనే మంచిది. ఇతరులను గుడ్డిగా నమ్మవద్దు. ఆరోగ్యం సహకరిస్తుంది. అభయ ఆంజనేయ స్వామి సందర్శన మంచిది.
ధనుస్సు:
ఈ రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మిత్రులతో సంతోషంగా ఉంటారు. ఆవేశం, కోపాన్ని దరిచేరనీయవద్దు. వింధు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శుభవార్త వింటారు. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి భుజంగ స్తోత్ర పారాయణ మంచిది.
మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా అధగమిస్తారు. అన్ని రంగాల వారికి డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విద్యార్థులకు మంచి కాలం. అనుకున్న ఫలితాలు వస్తాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. శివుడిని ఆరాధిస్తే శుభప్రదం.
కుంభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఆచితూచి పెట్టుబడులు పెట్టాలి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగులకు సమాజంలో హోదా పెరుగుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కార్యసిద్ధి హనుమ ఆలయ సందర్శన మంచిది.
మీనం:
మీన రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో కఠినమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఆస్తినష్టం జరగవచ్చు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి. శని జపం చేసుకోవాలి.