Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli )… తన భార్యతో మరోసారి మెరిశాడు. ముంబైలోని ఓ కార్యక్రమంలో.. భజన చేస్తూ కనిపించాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ). దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య… బెంగళూరు వేదికగా మొదటి టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మొదటి టెస్టులో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన టీమిండియా… రెండో ఇన్నింగ్స్ లో పోరాడింది.
కానీ ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు అద్భుతంగా ఆడటంతో… టీమిండియా పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ విజయాన్ని వరుణుడు కూడా ఆపలేకపోయాడు. మూడు టెస్టుల సిరీస్ లో… 1-0 తేడాతో న్యూజిలాండ్… దూసుకు వెళ్తోంది. అయితే టీమిండియా… ఓటమి పాలైన నేపథ్యంలో… ఫ్యాన్స్ అందరూ నిరాశగా ఉన్నారు. మళ్లీ తర్వాతి మ్యాచ్… గెలవాలని కోరుకుంటున్నారు.
Also Read: Womens T20 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓటమి.. విశ్వ విజేతగా న్యూజిలాండ్.. చరిత్రలోనే తొలిసారి !
కానీ ఇలాంటి నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) మాత్రం చాలా డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారు. టీమిండియా ఓడిపోయిన కూడా… తనకు పట్టనట్లుగా… తన భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు. రెండవ టెస్టుకు మరో మూడు రోజుల సమయం ఉన్న నేపథ్యం లో… ముంబైలో విరాట్ కోహ్లీ అలాగే అనుష్క శర్మ ( Anushka sharma ) మెరిశారు. ముంబై ( Mumbai ) మహానగరంలో కృష్ణదాస్ కీర్తనలో…విరాట్ కోహ్లీ దంపతులు…పాల్గొనడం జరిగింది.
Also Read: India vs New Zealand: కరుణించని వరుణుడు….మొదటి టెస్ట్ లో టీమిండియా ఘోర ఓటమి !
ఈ సందర్భంగా… స్టైలిష్ దుస్తుల్లో…విరాట్ కోహ్లీ అలాగే అనుష్క శర్మ ( Anushka sharma ) … ఈ కీర్తనల్లో పాల్గొన్నారు. అంతే కాదు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు విరాట్ కోహ్లీ దంపతులు. గతంలో అసలు భగవంతుని నమ్మని విరాట్ కోహ్లీ ( Virat Kohli )… ఈ మధ్య భజనలు ఎక్కువ గానే చేస్తున్నాడు. అనుష్క శర్మ ప్రభావం ఏమో లేక…ఇతర కారణాలేమో… మొత్తానికి భగవంతుని బాట పట్టాడు విరాట్ కోహ్లీ.
Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !
దీనికి సంబంధించిన వీడి యో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా… ఈనెల 24 వ తేదీన అంటే మరో మూడు రోజుల తర్వాత పూణే వేదికగా న్యూజిలాండ్తో ( New Zealand ) రెండవ టెస్ట్ మ్యాచ్ జరగ నున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో… మొదటి నుంచి లో విరాట్ కోహ్లీ ( Virat Kohli ) డకౌట్ కాగా… రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 70 పరుగులతో రాణించాడు.