EPAPER

WhatsApp New Feature: వాట్సాప్ లో సరికొత్త ఫీచర్, మర్చిపోయిన విషయాలు గుర్తు పెట్టుకుంటుంది తెలుసా?

WhatsApp New Feature:  వాట్సాప్ లో సరికొత్త ఫీచర్, మర్చిపోయిన విషయాలు గుర్తు పెట్టుకుంటుంది తెలుసా?

Whatsapp Chat Recording Feature: ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగదాలు అత్యధికంగా ఉపయోగిస్తున్న యాప్స్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది. వాట్సాప్ ద్వారా ఎంతో మంది ఎన్నో పనులను చక్కదిద్దుకుంటున్నారు. ఆఫీస్ పనుల నుంచి మొదలు కొని వ్యక్తిగత పనుల వరకు వాట్సాప్ ద్వారా చేసేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ తన వినియోగదారులకు రోజు రోజుకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. చాటింగ్ అనుభవాన్ని మరింత ఈజీగా మార్చుతోంది. తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ కు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్ ఏంటి? దాని ప్రత్యకత ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


వాట్సాప్ చాట్ మెమరీ ఫీచర్

వాట్సాప్ ప్రస్తుతం చాట్ మెమరీ ఫీచర్ మీద వర్క్ చేస్తోంది. త్వరలోనే ఈ నయా ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఈ ఫీచర్ మెటా AIతో పంచుకున్న పర్సనల్ డేటాను రికార్డు చేసుకుంటుంది. మనకు అవసరం అయినప్పుడు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ ఈ ఫీచర్ ను టెస్ట్ చేస్తున్నట్లు wabetainfo వెల్లడించింది.


ఈ ఏడాది ప్రారంభంలో ఏఐ ఫీచర్

ఈ ఏడాది ప్రారంభంలో మెటా సంస్ వాట్సాప్ AI ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోదారులు తమకు అవసరం అయిన సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ చాట్ మెమరీ ఫీచర్ ను డెవలప్ చేస్తోంది. ఈ ఫీచర్ వినియోగదారులు AIకి పంపించిన ముఖ్యమైన సమాచారాన్ని రికార్డు చేసి భద్రపరుస్తుంది. చాట్ బాట్ తో గతంలో షేర్ చేసిన వివరాలను మళ్లీ గుర్తు చేసేందుకు AIకి మెటా పర్మీషన్ ఇస్తోంది. ఇందులో మనకు నచ్చిన, ఇష్టమైన సమాచారాన్ని రికార్డు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  అంతేకాదు, ఈ ఫీచర్ వినియోగదారులకు అవసరమైన సూచనలు, సలహాలు కూడా ఇస్తుందట. అయితే, AI మెటా సేవ్ చేసుకునే డేటా అంతా యూజర్ కంట్రోల్ లో ఉంటుంది. వారికి అవసరం లేని సమాచారాన్ని డిలీట్ చేసుకునే అవకాశం ఉంది.

గతంలో ఇలాంటి ప్రయత్నం చేసిన కంపెనీలు

గతంలో పలు కంపెనీలు మెమరీ ఫీచర్లపై పని చేశాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ‘రీకాల్’ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది పరిమితంగానే డేటాను రికార్డు చేసుకునేది. అటు గూగుల్ పిక్సెల్ ‘స్క్రీన్ షాట్స్’ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో కేవలం స్క్రీన్‌ షాట్స్ ​ను రికార్డు చేసే అకాశం మాత్రమే ఉంది. అయితే, వాట్సాప్ తీసుకురాబోతున్న ఫీచర్ లో తమకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ తుది దశలో ఉన్నది. త్వరలోనే ఈ ఫీచర్ కు సంబంధించి పూర్తి సమాచారం బయటకు తెలిసే అవకాశం ఉంది.

Read Also: వీటికి గూగుల్ ఎప్పుడో గుడ్​బై చెప్పేసిందని మీకు తెలుసా?

Related News

Google : వీటికి గూగుల్ ఎప్పుడో గుడ్​బై చెప్పేసిందని మీకు తెలుసా?

Jio 5G : అన్‌లిమిటెడ్‌ 5జీ డేటాతో పాటు 12 OTT సబ్‌స్క్రిప్షన్‌లను – అతి తక్కువకే ప్రీపెయిడ్‌ ప్లాన్‌!

Flipkart Diwali Sale 2024 : ఫ్లిప్కార్ట్ దివాళి సేల్ రేపే ప్రారంభం.. మోటోరోలా ఫోన్స్ పై కళ్ళు చెదిరే ఆఫర్స్

iQ00 13 : అదిరిపోయే డిజైన్ తో iQ00 13 లీక్.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఫుల్ డీటెయిల్స్ ఇవే

Amazon Diwali sale : అమేజింగ్ ఆఫర్.. రూ. 10,999కే 50MP కెమెరా, 128GB స్టోరేజ్ తో సూపర్ స్మార్ట్ ఫోన్

Realme P1 smartphone : రూ.15 వేలకే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ – గేమింగ్, మల్టీటాస్కింగ్​ స్మార్ట్ ఫోన్​

Big Stories

×